Drop Down Menus

Sri Kaleshwara Mukteswara Swamy Temple Information | Kaleshwaram | Jayashankar Bhoopalpally | Hindu Temples Guide

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం,  కాళేశ్వరం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా :

తెలంగాణాలోని దక్షిణకాశీగా పేరు పొందిన ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి గాంచిన త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందినది. ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ ఇప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం గ్రామం వద్ద కలదు. ఈ ఆలయంలో శివునితో పాటు మనకి ఎక్కడ కనిపించని విధంగా యముని ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఉప ఆలయాలు అయిన శ్రీ రామ ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, సంగమేశ్వర ఆలయం, సుబ్రమణ్య స్వామి ఆలయం, విజయ గణపతి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, నాగ దేవత ఆలయలు కూడా దర్శించవచ్చు.

ఆలయ చరిత్ర :

ఈ ఆలయంలో  గొప్ప శిల్పకళా ఆలయంగా కూడా ప్రసిద్ధిచెందినది. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేక పాత శిల్పలు గమనిచడం వల్ల పాత కాలం నుంచే ఈ ప్రాంతంలో శిల్ప కళా ప్రాంతం అని తెలుస్తుంది. ఈ ఆలయంలో మరియొక్క విశేషం ఏమిటానగ ప్రముఖ సరస్వతీ ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరంలోని మహా సరస్వతి ఆలయం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఉప ఆలయలు అయిన సూర్యదేవాలయం కూడా దగ్గరలో కలదు. ఈ ఆలయంలో ప్రధానంగా బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనుమత్‌ తీర్థం, జ్ఞానతీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం వంటి తీర్థాలున్నాయి. ఈ  ఆలయానికి పడమటి వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం అనే మరియొక్క ఆలయం కూడా ఉంది.


ఆలయ స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించడంతో యమధర్మ రాజు యొక్క యమపాశం నుంచి విముక్తి లభిస్తుంది అని ఈ ఆలయ చరిత్ర.  అనగా ఆలయం లో మొదట లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది, ఇందులో నుండి బయటకి వెల్లినట్లయితే యమ దోషం పోతుంది అని భక్తుల నమ్మకం. అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకి వెళ్ళి వేడుకోగా శివుడు యమున్ని తనవద్దే పక్కన లింగరూపంలో నిల్చోమన్నాడట. తనని దర్శించుకొన్న వారు అతనిని దర్శించుకోనట్లయితే మోక్షప్రాప్తి లభించదని అన్నాడు. అందుకే భక్తులు స్వామి వారిని దర్శించుకొని (శివుణ్ని), కాళేశ్వరుణ్ణి (యమున్ని) కూడా దర్శించుకుంటారు.


ఆలయ ప్రత్యేకత ఆలయంలో రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండటం ఒక విశేషం ముక్తేశ్వర స్వామి లింగంలో రెండు రంధ్రాలు ఉండటం మరో ప్రత్యేకత. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో వెళ్ళి కలుస్తుందంటారు. కేవలం స్వామి వారిని మాత్రమే దర్శించి యమలింగం దర్శించకపోతే మనిషి యొక్క చివరి సమయం దగ్గరపడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకొని వెళ్ళమని చెప్తాడు. అందుకే భక్తులు స్వామి వారిని దర్శించుకొని (శివుణ్ని), కాళేశ్వరుణ్ణి (యమున్ని) కూడా దర్శించుకుంటారు. ఆలయ ప్రత్యేకత ఆలయంలో రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండటం ఒక విశేషం. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.


మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటలకు మహారుద్రాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 4.00 గంటలకు ముక్తీశ్వర, శుభానందదేవి కల్యాణోత్సవం, రాత్రి 12 గంటలకు గర్భగుడిలోని ద్విలింగాలకు మహాభిషేకం, లింగోద్భవ పూజ, చండీ పూజ నిర్వహిస్తారు. మసుసటిరోజు ఉదయం 11.30కి యాగశాలలో పూర్ణాహుతి, సదస్యము, మహదాశ్వీరాదం, పండిత సన్మానం, సాయంకాలం 4 గంటలకు కల్యాణోత్సవం, రాత్రి 8 గంటలకు నాకబలి, పవళింపు సేవతో శివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేకంగా నవరాత్రి ఉత్సవాలలో సరస్వతి దేవి పూజలు భారీ ఎత్తున నిర్వహిస్తారు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 6.00-12.00
సాయంత్రం  : 3.30-8.30

వసతి సౌకర్యాలు :

ఈ ఆలయానికి దగ్గరలోనే ప్రభుత్వ మరియు ప్రైవేట్ సత్రాలు కూడా ఉన్నాయి. ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు ఈ ఆలయానికి బస్ లు కలవు. ప్రతి 3 గంటలకి ఒక బస్ బయలుదేరుతుంది. హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి 310 కి. మీ దూరంలో కలదు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి నేరుగా రైలు మార్గం లేదు. రామగుండం అనే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి ఆలయానికి 98కి. మీ దూరంలో ఉన్నది.

విమాన మార్గం :

నేరుగా విమానాశ్రయం లేదు. సమీప విమానాశ్రయం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్ నుండి కాళేశ్వరం దాదాపు 310 కిలోమీటర్ల ఉంటుంది.

ఆలయ చిరునామా :

శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం ,
కాళేశ్వరం గ్రామం.
మహాదేవపురం మండలం
కరీంనగర్.
పిన్ కోడ్ - 505504

Key words : Sri Mukteswara Swamy Temple, Kaleshwaram, Famous Temples In Karimnagar, Hindu Temples Guide

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.