Drop Down Menus

శ్రీ కాశి విశ్వనాధ్ | Sri Kashi Vishwanath | Annapurna Devi Temple Information | Varanasi | Uttar pradesh | Hindu Temples Guide

శ్రీ కాశీవిశ్వేశ్వర సమేత అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం,ఉత్తర్ ప్రదేశ్
హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రం కాశీ.  ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వేశ్వర లింగం ఒకటి. ఈ దేవాలయం ఉత్తర్ ప్రదేశ్ లో కలదు.సప్త మోక్ష పూరీ అలయాలో ఈ ఆలయం ఒకటి.  ఈ ఆలయ సమీపంలో ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ ఉండదు అని హిందువుల నమ్మకం. కాశీలో ప్రాంతంలో మరణిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.  ఈ ప్రాంతం లో పిండ ప్రధానాలు కూడా జరుగుతాయి.  జగత్ గురువు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య స్వామి మరియు ఎందరో మహా మునులు ఈ ఆలయని దర్శించారు. ఈ ఆలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. ఈ కాశీ ప్రాంతాన్ని మందిరాల నగరం అనే పేరు కూడా ఉన్నది. సాయంత్రం 7 గంటలకి ప్రత్యేకంగా గంగ హారతి ఇస్తారు. ఈ హారతి చూడడానికి వేల మంది ఇస్తారు. గంగ హారతి చూడడానికి విదేశీ నుంచి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ హారతి దగ్గరి నుంచి చూడాలి అంటే తొందర వెళ్ళితే దగ్గరి నుంచి చూసే అవకాశం ఉంటుంది. 16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. ఇక్కడి నుంచి ప్రయాగ , అయోధ్య కు కూడా వెళ్ళవచ్చు. 

ఆలయ చరిత్ర :

ఈ ఆలయంలో స్వామి స్వయంభూ శివ లింగం. కాల భైరవాలయం, గణపతి ఆలయం , కాశీ విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీ, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, , దుర్గా మాత దేవాలయం, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. ఈ కాశీ నగరం మొత్తం కూడా ఆలయలే. గంగ నది వద్ద అనేక స్నాన ఘాట్ లు కలవు. వాటిలో ప్రధానంగా దశాశ్వమేధ ఘాట్ , హరిశ్చంద్ర ఘట్టం , మణికర్ణిక ఘాట్ మొదలగు స్నాన ఘట్టాలున్నాయి. ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి.
సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించారు అని మరియు కాశీలో ఆది శంకర స్వామి వారికి పరమేశ్వరుడు తరసపడ్డాడు అని కూడా తెలుస్తుంది. సీత దేవి ఆలయం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ సీత దేవి భూమి లో ప్రవేశించే అప్పటి ఆలయం ప్రతక్షయం గా చూడవచ్చు.

శ్రీ కాలభైరవ మందిరం : 

ఈ కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాశీలో మొదట ఈ స్వామి ని దర్శించుకోవాలి. ఈ కాలభైరవ స్వామిని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని ఇక్కడి ఆచారం. ఈ ఆలయం పోస్ట్ ఆఫీసు వద్ద కలదు. ఈ స్వామి అనుమతి లేకపోతే కాశీ విశ్వేశ్వరా స్వామి దర్శనం సాధ్యం కాదు అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయం దర్శనం చేసుకుంటే మనిషి శరీరం విడిచిన తరువాత భైరవ దండన ఉండదు అని భక్తుల నమ్మకం.

శ్రీ విశ్వనాధ మందిరం : 

కాశీలో ఈ ఆలయం ప్రధాన ఆలయం.  ఈ ఆలయ దర్శనం పునః జన్మ సుకృతం అని అంటారు.  ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది .  నాలుగు వైపులా నుంచి లోపలికి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవచ్చు.  ఇక్కడ మారియొక్క విచిత్రం ఏమిటానగా స్వామి వారికి ఎదురుగా కాకుండా బావి వైపు చూస్తూ నంది విగ్రహం దర్శనం ఇస్తుంది.


1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.ఈ ఆలయం పై ఎంతో మంది రాజులు  విధ్వంసం చేశారు. కానీ భక్తులు తిరిగి పునఃనిర్మాణం చేశారు. తులసి దాస్ గారు కూడా ఈ ఆలయాన్ని దర్శించారు. ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ ఉదయం 3 నుంచి 4 గంటల వరకు స్వామి వారికి భస్మ అభిషేకం చేస్తారు.

శ్రీ అన్నపూర్ణ దేవి ఆలయం  : 

ఢుండి గణపతి ఆలయం వద్దనే ఈ అన్నపూర్ణ దేవి ఆలయం కలదు. ఇక్కడ అమ్మవారు బంగారు వర్ణం లో దర్శనం ఇస్తారు. సాక్షాత్తు పరమేశ్వరునికి ఇక్కడ అమ్మవారు మొదట భిక్ష పెట్టిన ప్రాంతం. అందరూ కడుపు నిండా తినాలి అని సంకల్పించి ఇక్కడ వెలిశారు. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమలు కూడా జరుగుతాయి.

శ్రీ వారాహి అమ్మవారి ఆలయం :

అమ్మవారు ఈ ఆలయం క్షేత్ర పాలకురాలు. ఉదయం 4 నుంచి 7 గంటల వరకే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ అమ్మవారిని నేరుగా దర్శించ కూడదు. ఉగ్ర స్వరూపిగా అమ్మ వారు ఉంటుంది. రెండు రంధ్రాల ద్వారా మాత్రమే అమ్మవారి దర్శనం చేసుకోవచు.

శ్రీ విశాలాక్షిఆలయం :

దశాశ్వమేధ ఘాట్ కి దగ్గరగా ఈ అమ్మవారి ఆలయం కలదు. ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. కానీ మహా శక్తి కలిగిన ఆలయం. అష్టాదశ శక్తి పీఠ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి.  సతీ దేవి చెవి కుండలం పడిన స్థలం ఈ క్షేత్రం. ఇక్కడ అమ్మవారు రెండు రూపంలో దర్శనం ఇస్తుంది. ముందు అర్చన మూర్తి దర్శనం చేస్తూ వస్తు తిరిగి చూస్తే అద్దంలో అసలైన నిజ రూప దర్శనం కనపడుతుంది. కాశీ విశ్వనాధ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి ఆలయం కలదు.  స్వామి దర్శనం చేసుకున్న తరువాత ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

శ్రీ సాక్షి గణపతి ఆలయం :

వారణాసి ఆలయం దర్శించారు అని ఈ స్వామి సాక్ష్యం చెప్పడానికి ఇక్కడ వేలిశారు. ఇక్కడ స్వామి వారి చేతిలో కలం పట్టుకున్నటు దర్శనం ఇస్తారు.

శ్రీ ఢుండి గణపతి ఆలయం :

ఇక్కడ స్వామి అపార శక్తి కలిగిన గణపతి ఆలయం. కావ్య గంట గణపతి ఇక్కడ తపస్సు చేసిన ప్రాంతం.

శ్రీ సంకట మోచన్ హనుమాన్ మందిరం :

కాశీలో ఉన్న హనుమాన్ ఆలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసినదీతీరంలో ఉంది. ప్రస్తుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర్య సమరవేత్త, " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " వ్యవస్థాపకుడూ అయిన మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. తులసిదాస్ గారు ఈ ఆలయం దర్శించి హనుమాన్ చాలీసా శ్లోకాలని పాటించారు అని శాసనాల ద్వారా తెలుస్తుంది.

శ్రీ చక్ర లింగేశ్వరుడు :

చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించకుండానే వెళ్లిపోతూ ఉంటారు. ఈ లింగాన్ని భాస్కర రాయల వారు మహా ముని కాశీ వచ్చిన్నపుడు శివ లింగం పై శ్రీ చక్రన్ని వేసి స్థాపించారు అని చెపుతారు. వారహి అమ్మవారి ఆలయం సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ స్వామి శ్రీ లలిత సహస్ర నామలకి భాస్యం రచించారు. కాశీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయంలో లలితా సహస్ర నామం చదువుకోవాలి.

శ్రీ కాశీ రాజు మ్యూజియం :

ఈ ప్రాంతని పరిపాలించిన రాజు యొక్క ఖడ్గలు , అప్పటి కాలం నాటి తుపాకులు , వాళ్ళు ధరించిన దుస్తువులు కూడా దర్శించు. ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

ఆలయ దర్శన సమయం :

ఉదయం       : 3.00- 3.00
సాయంత్రం  : 4.30 -10.30

వసతి వివరాలు :

కాశీలో చాలా వసతి సౌకర్యాలు కలవు. వారణాసి రైల్వే స్టేషన్ వద్ద కూడా చాలా కలవు. తెలుగు వారి కోసం కూడా ఆంధ్ర ఆశ్రమం , సైకిల్ ఆశ్రమం లు కలవు. ఇందులో అప్పటికి అప్పడు రూమ్ లు కాలి ఉంటే ఇస్తారు. రూమ్ యొక్క ధరలు కూడా భారీగానే ఉంటాయి.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

దేశంలోని అన్నీ ప్రాంతాల నుంచి మొదట వారణాసి చేరుకొని అక్కడి నుంచి ఆటో లో చేరుకోవచ్చు.

రైలు మార్గం :

హైదరాబాద్  నుంచి నేరుగా రైలు ప్రతి రోజు నడుస్తుంది. విజయవాడ నుంచి వారాంతపు రైలు కూడా ఉన్నాయి. విశాఖ పట్నం నుంచి భువనేశ్వర్ చేరుకొని అక్కడి నుంచి ఈ ఆలయానికి ఇంకో ట్రైన్ లో వెళ్ళాలి. వారణాసి రైల్వే స్టేషన్ నుంచి 8 కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు.

విమాన మార్గం :

వారణాసి విమననాశ్రయం 25కి. మీ దూరంలో కలదు. కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామ :

శ్రీ కాశీవిశ్వేశ్వర సమేత అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం ,
వారణాసి మార్గ్ ,
వారణాసి,
ఉత్తర్ ప్రదేశ్.
పిన్ కోడ్ -221 001

Key Words : Sri Kashi Vishwanath Temple , Annapurna Devi Temple Information , Famous Temples In Utter Pradesh , Varanasi , Kashi , Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.