Drop Down Menus

Sri Uttara Swamimalai Temple Information | Delhi | Hindu Temples Guide

శ్రీ ఉత్తరా స్వామి మలై ఆలయం , ఢిల్లీ : 

ఆలయని మాలై స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఢిల్లీ లోని ప్రముఖ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ దేవాలయం రామకృష్ణ పురం న్యూ ఢిల్లీ వద్ద కలదు. ఈ ప్రాంతం లో నివసించే తమిళులు మురుగన్ ఆలయం అని పిలుస్తారు.  ఈ ఆలయం ఒక కొండపై నిర్మించబడింది. ఈ దేవాలయ నిర్మాణ శైలి మీనాక్షీ ఆలయం వలె ఉంటుంది.స్వామి వారికి ఉత్సవం మరియు కళ్యాణం ఈ క్రింద చూపించిన ప్రత్యేక మండపంలో నిర్వహిస్తారు.


ఆలయ చరిత్ర :

ఈ ఆలయం పురాతన దేవాలయం. 1973 జూన్ 7న ఈ ఆలయానికి మహా కుంభభిషేకం జరిగింది మరియు 1990 జూన్ 13 న మళ్ళీ మహా కుంభభిషేకం ప్రదర్శించారు.  శ్రీ ఆది శంకర హాల్ 1997 నవంబర్ 9న నిర్మించారు. ఈ ఆలయ సెప్టెంబర్ 8, 1965 న అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం. భక్తవత్సలం గారి చేతుల మీదుగా ప్రారంభించబడినది.  ఆ కార్యక్రమంలో భారత ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి కూడా పాల్గొన్నారు.


 ఈ ఆలయం మొత్తం గ్రానైట్ రాయి ఉపయోగించి స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ పరిశీలించి చూస్తే చోళ శైలికి అనుగుణంగా నిర్మించబడింది. ఈ ఆలయం ఉత్తర భారత దేశంలో ఉన్నప్పటికీ  నిర్మాణం గమనించి చూస్తే దక్షిణ భారతదేశం యొక్క నమూనాలను ప్రతిబింబించే విధంగా ఉంటుంది.  స్వామి వారి ప్రధాన మూల విరాట్ ని  నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడ్డాయి.


ఆలయంలోకి ప్రవేశించిన తరువాత, ఎడమ వైపు ఆలయ ప్రారంభంలో శ్రీ గణపతి స్వామి, మీనాక్షి అమ్మవారు  మరియు శ్రీ సుందరేశ్వర ఉప ఆలయాలు కూడా దర్శించవచ్చు.  ఈ ఆలయం తో పాటు శ్రీ శని ప్రత్యేక ఆలయం కూడా ఉన్నది. ఆలయం బయట ఎడమ మెట్ల వైపున నాగ దేవతా విగ్రహం కూడా ఉంది. 27 జూన్ 2001 న ఆలయ పునః నిర్మాణం చేసి అష్టబంధన మరియు స్వర్ణ-రాజత బంశన మహాకుంభభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగల్ చేత నిర్వహించబడినది.  శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిగల్ 25 జూన్ 2001 రాత్రి యజ్ఞ పూజలో పాల్గొన్నారు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం       : 6.30 - 12.00
సాయంత్రం  : 5.00 - 8.30

వసతి వివరాలు :

ఈ ఆలయానికి సమీపంలో 4 కి.మీ దూరంలో ప్రైవేట్ సత్రాలు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

ఆలయానికి సమీపంలోనే రామకృష్ణ పురం  అనే బస్ స్టాండ్ కలదు. అక్కడి నుంచి ఆటోలో చేరుకోవచ్చు.

రైలు మార్గం :

ఆలయానికి దగ్గరలోనే మెట్రో స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి ఆలయానికి 8 కి.మీ దూరంలో కలదు.

విమాన మార్గం :

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

శ్రీ ఉత్తరా స్వామి మలై ఆలయం ,
సెక్టార్ 7,
ఆర్కె పురం.
ఢిల్లీ.
పిన్ కోడ్ : 1110022

Key Words : Sri Uttara Swamimalai Temple Information , Famous Temples In Delhi ,  Hindu Temples Guide. 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.