Drop Down Menus

ఇండియాలో ఉండి ఈ దేవాలయాలు చూడకపోతే ఇక మీరు వేస్ట్ | 15 Most Famous Temples to visit in India

ఇండియాలో ఉండి ఈ దేవాలయాలు చూడకపోతే ఇక మీరు వేస్ట్!
భారత దేశంలో దక్షిణ భారత దేశానికి చాలా ప్రత్యేక ఉంది, దక్షిణ భారత దేశంలోని ఆలయ నిర్మాణాలు చూస్తే మనస్సు తన్మయత్వం చెందుతుంది. పురాతన కాలం నాటి ఆచారాలకు నిదర్శనంగా నిర్మించిన ఆలయాలు చారిత్రక ఔచిత్యానికి నిదర్శనం. అటువంటి దేవాలయాలను సందర్శించడం ఒక మంచి అనుభూతి కలిగిస్తుంది.
పర్యాటకులు సందర్శించాల్సిన దేవాలయాల చిట్టా పెద్దదైనా, వాటిన్నింటిని ఒకే సారి సందర్శించలేరు కాబట్టి, కొన్ని ముఖ్యమైన దేవాలయాల గురించి మీకు తెలపడం వల్ల మీరు ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పడు మర్చిపోకుండా ఆయా దేవాలయాలను సందర్శించడానికి వీలుంటుంది.

దక్షిణ భారత దేశంలో అతిముఖ్యంగా సందర్శించాల్సిన హిందు దేవాలయాల్లో 15 ముఖ్యమైన దేవాలయాల గురించి ఇక్కడ తెలపడం జరిగింది. వీటి గురించి చదువుతున్నప్పుడు ఈ ఆలయాలను ఎందుకు మిస్ చేయకూడదన్న విషయం మీకు తెలుస్తుంది. మరి ఆ దేవాలయాలేంటో..వాటి ప్రత్యేకతలేంటో ఒకసారి తెలుసుకుందామా..
మీనాక్షి అమ్మ టెంపుల్ మదురై:
మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులోని మదురై పట్టణం ఉంది. మీనాక్షి దేవాలయం మదురైలో కల వేగాయి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయంలో ఎనిమిది గోపురాలు ఉన్నాయి. నగరం నడి బొడ్డున మీనాక్షి అమ్మ టెంపుల్ నిర్మించబడినది. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్‌ ఆలయం ( మీనాక్షి అమ్మవారి ఆలయం) నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తుంది. 
అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు.  శివుని భార్య అయిన పార్వతి దేవికి ఈ గుడి అంకితం చేయబడినది. ఇంకా ఇక్కడే లార్డ్ శివ మరియు మీనాక్షి అమ్మవార్ల వివాహం జరిగినట్లు చెబుతుంటారు. మీనాక్షి తిరుకల్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ.
Click Here More Details:
విరూపాక్ష టెంపుల్ , హంపి:
విరూపాక్ష దేవాలయంను హంపిలో కనుగొన్నారు, హంపి బెంగళూరు నుండి 350కిమీ దూరంలో ఉంది, ఇండియాలో చూడదగ్గ ముఖ్యమైన దేవాలయాల్లో ఇది ఒకటి. విజయనగ సామ్రాజ్య ఉత్తమ నిర్మాణాలలో ఇది ఒకటి. ఈ దేవాలయంను అనేక మంది పాలకులు అనేక సవరణలు చేసి, వివిధ రూపాల్లో అద్భుతంగా నిర్మించారు. అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఇది ఒకటి. విరూపాక్ష అనగా శివుని రూపం. ఈ ఆలయం చాల పురాతనమైనందున, దీనిని వీరు చాల పవిత్రంగా భావించేవారు యాత్రికులు ఎక్కువగా వస్తూ ఉండేవారు. 
ఈ ఆలయ ప్రధాన ద్వారం పైన అందమైన చెట్టు ఉంది.చుట్టూ స్త్రీ, పురుషుల చిత్రాలతో ఉండేది. గర్భాబాలయానికి వెనుక, బయటకు వెళ్లడానికి మెట్లదారి ఉంది. అక్కడ పది మెట్లు ఎక్కగానే, కుడి వైపు ఒక చీకటి గది ఉంది. ఆ గదికి తూర్పు వైపున 7 అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉంది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడ పై పడి బయట ఉన్న రాజ గోపురం నీడ తల క్రిందులుగా చాల స్పష్టంగా కనబడుతుంది. దాని కెదురుగా ఒక తెల్లని గుడ్డ అడ్డం పెడితే దాని మీద కూడా ఆ గోపురం ప్రతి బింబం కనబడుతుంది. అందరూ దీన్ని చాల వింతగా చూస్తుంటారు. ఆ వస్తున్నది సూర్య కిరణాలు కాదు, కేవలం వెలుగు మాత్రమే. ఈ వింత బయట వెలుగు ఉన్నంత సేపు ఉంటుంది. ఇది తప్పక చూడాల్సిందే.
Click Here More Details:
తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి. 
ఏడు కొండల మద్య కొలువై ఉన్న ఈ దేవాలయంను చేరుకున్న వెంటనే ద్రావిడ శైలి నిర్మాణాలు మన దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం.  తిరుమల శ్రీ వెంటకశ్వరుని ఆశీస్సులు పొందడానికి భక్తులు దాదాపు 4000 మెట్లను ఎక్కుతుంటారు. తిరుమలకొండపై భక్తుకుల అందించే లడ్డు ప్రసాదం చాలా ఫేమస్ .
Click Here More Details:
పట్టడకాల్ :
అక్కడ జలపాతాల జడినీ సుందర నదీతీరాలనీ వీక్షిస్తే పౌరాణిక గాథల్ని వినిపిస్తాయి. ఎర్రనినేలనీ రాతి కొండల్నీ గుహల్నీ పలకరిస్తే శతాబ్దాల చరిత్ర లోతుల్లోకి తీసుకెళతాయి. ఆ గోడలని కళ్లతో ఆర్తిగా తడిమితే నాటి శిల్పుల ఉలి విన్యాసాలు సాక్షాత్కరిస్తాయి. అటు ప్రకృతి అందాలకూ ఇటు చాళుక్యుల కళావైభవానికీ వేదికలుగా నిలిచిన ఆ ప్రాంతాలే ఐహోలె, పట్టడకల్‌, బాదామి...' చాళుక్యుల కాలం నాటి మహిమాన్వితమైన ప్రదేశం. 
ఈ ప్రదేశంలోని దేవాలయం గురించి ఒక ఆసక్తిరమైన విషయం ఏంటంటే, దేవాలయ నిర్మాణం ఉత్తర భారతీయ నిర్మాణ శైలితో కట్టినట్లు కనబడుతుంది. పట్టడకల్ లోని ఆలయాలు 7వ మరియు 8వ శతాబ్దాలలో నిర్మించబడ్డాయి. ఐహోలెకు 13 కిలోమీటర్ల దూరంలో పట్టడకల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం పది ఆలయాలు ఉంటాయి. వీటలో ఎనిమిది ఒక కూటమిగా ఒకే చోట ఉండగా పాపనాథ ఆలయం, జైన నారాయణ ఆలయం చెరో దిక్కుగా రెండు కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి.
రామనాథస్వామి టెంపుల్, రామేశ్వరం:
రామేశ్వరము తమిళనాడు రాష్ట్రములోని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణము రామనాథ స్వామి దేవాలయం ఉంది. శివుడి యొక్క జోతిర్లింగాల్లో రామేశ్వరంలోని రామనాథస్వామి టెంపుల్ ఒకటి. అత్యంత ప్రసిద్ధి చెందిన శివుని ఆలయం. ఈ ఆలయం శివుడికి అంకితం చేశారు. ఈ ఆలయంలో రెండు శివలింగాలున్నాయి.
వీటిలో ఒకటి లార్డ్ సీత, మరొకటి లార్డ్ హనుమాన్ నిర్మించారు. ఈ దేవాలయంలోని కారిడార్(నడవ ప్రాంతం)మరే దేవాలయంలో లేనంత పెద్దగా ఉంది. భారతీయులలో హిందువులు అనేకమంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తరువాతకాని పూర్తికాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగా తీర్థం తీసుకు వచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లైతే కాశీయాత్ర పూర్తి ఔతుందని దేశంలోని సకల తీర్ధములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు.
Click Here More Details:
హంపిలోని విటల్ టెంపుల్:
భారత దేశంలో దక్షిణ భారత దేశానికి చాలా ప్రత్యేక ఉంది, దక్షిణ భారత దేశంలోని ఆలయ నిర్మాణాలు చూస్తే మనస్సు తన్మయత్వం చెందుతుంది. పురాతన కాలం నాటి ఆచారాలకు నిదర్శనంగా నిర్మించిన ఆలయాలు చారిత్రక ఔచిత్యానికి నిదర్శనం. అటువంటి దేవాలయాలను సందర్శించడం ఒక మంచి అనుభూతి కలిగిస్తుంది.
హంపిలోని ప్రతి ఆలయానికి ఒక పురాణ కథ ఉంది. విటల్ ఆలయం లేదా విటలాలయం. ఇది హంపి యొక్క ఈశాన్య భాగంలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. హంపిలో సందర్శించదగ్గ ప్రముఖ ఆలయం ఇది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది, ఆలయంలోని నిర్మాణ శైలిలోని స్తంభాల నుండి సంగీతం వినుపిస్తుందని అంటారు. హంపిలోని అన్నిదేవాలయ నిర్మాణాలలోకి ఈ ఆలయ నిర్మాణశైలి విభిన్నంగా.. గొప్పగా ఉంటుంది.
Click Here More Details:
ఐరావతేశ్వర టెంపుల్, కుంబక్కోణం:
మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు. వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే.  ఈ ఆలయ నిర్మాణంలో రాతి శిల్పాలకు మరియు ఉత్కంఠభరితమైన నిర్మాణాలకు ప్రసిద్ధి. ఇక్కడి శివుని పేరు'' ఐరావతేశ్వరుడు''.
ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దిలోచోళులు నిర్మించిన దేవాలయాల్లో ఇప్పటికీ నిత్యం దూప, ధీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో దారాసురంలోని ఐరావతేశ్వరాలయం కూడా ఒకటి.  అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూడవచ్చు. ఈ దేవాలయంలో సంగీతాన్ని ప్రతిధ్వనింపజేసే రాతి మెట్లు ఉన్నాయి. ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ నిఘూడ రహస్యం. దారాసురం పట్టుచీరలకూ ప్రసిద్ధి. సౌరాష్ట్ర నుంచి వలస వచ్చిన పలు చేనేత కుటుంబాలు ఇక్కడి మగ్గాలపై చీరలు నేయడం చూసి కొనకుండా ఉండలేరు.
Click Here More Details:
తంజావూరు బృహదీశ్వరాలయం, తమిళనాడు:
అణువణువూ అద్భుతం.. బృహదీశ్వరాలయం , తంజావూరులో ఉన్న బ్రహదేశ్వర దేవాలయం ప్రపంచంలోని మొట్టమొదటి ఆలయం, బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరులో ఉంది. ఇది శైవాలయం. ఇది పూర్తిగా గ్రానైట్ తో నిర్మించబడింది. ఇండియాలోనే అతి పెద్ద ఆలయం, ప్రపంచంలో ఉన్న ఆలయాలలో ఇది అతిపెద్ద వారసత్వపు దేవాలయం.
శివలింగానికి ఎదురుగా పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న అతి పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. 20 టన్నుల నల్లని గ్రానైట్ రాయితో- అంటే ఏకశిలతోనే ఈ నందిని కూడా నిర్మించడం విశేషం. ఇది దేశంలోని రెండో అతిపెద్ద ఏకశిలా నంది. మొదటిది అనంతపురం జిల్లాలోని లేపాక్షి బసవేశ్వరుడు అన్నది తెలిసిందే. క్రేనుల్లాంటి భారీ మెషీన్ల సాయం లేకుండా ఆ రోజుల్లో 13 అంతస్తుల్లో నిర్మించిన ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది. నేలమీద నుంచి 216 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం నుంచి జారిపడిన వానచినుకులన్నీ భూగర్భంలో ఇంకేలా చేయడం మరో అద్భుతం.
Click Here More Details:
గురువాయుర్:
గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం, పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. శ్రీ కృష్ణ టెంపుల్ కేరళలో ఉన్న గురువాయూర్ శ్రీ కృష్ణ టెంపుల్ కృష్ణుడికి అంకితం చేసిన ఆలయం.
గురువాయురప్పన్ ఆలయం అని కూడా పిలుస్తారు. కేరళ యొక్క కళా రూపమైన కృష్ణనట్టం కాళి ఇక్కడ నుండి కనుగొనబడినది. గురువాయూరప్పన్ ఆలయం దేశంలో ప్రసిద్ధి చెందినది. ఈ గుడి ని కలియుగ వైకుంఠం గా భావిస్తుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఈ ఆలయంలో ప్రధాన దైవం బాల గోపాలన్ కృష్ణుడి శిశువు. గురువాయూరప్పన్ ఆలయానికి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
Click Here More Details:
ఛాముండేశ్వరీ టెంపుల్, మైసూర్:
చాముండేశ్వరి దేవాలయం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని మైసూరులో మైసూరు ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉంది. . హొయసల రాజవంశం నిర్మించిన ఈ ఆలయం కోసం మైసూర్ మహారాజుల విరాళాలు అందచేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయం యొక్క తలుపులు వెండి, బంగారంతో తయారు చేశారు.
సంవత్సరాని కొక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. తల మీదున్న చామరాజ ముడి (కిరీటం), కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు, జడ బిళ్ల, వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి అలరారుతుంది. ఈ కొండ మీద దాదాపు 3000 మెట్లను నిర్మంచబడ్డాయి, మైసూర్ లోని ప్రధాన ఆకర్షణలలో ఇది ఒకటి.
Click Here More Details:
మూకాంభిక టెంపుల్ కొల్లూరు:
మూకాంబిక దేవికి అంకితమయిన కొల్లూరు మూకాంబిక దేవి ఆలయం భారత దేశములోని కర్నాటక మరియు కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి. మంగళూరుకు 147 కిమీ దూరములో సౌపర్ణిక నది ఒడ్డున కొల్లూరు మూకాంబికా దేవి ఆలయం ఉంది.
మూకాంబిక దేవి కర్ణాటకలోని 'ఏడు ముక్తిస్థల క్షేత్రాలలో' ఒకటి. సౌత్ ఇండియాలో అతి పెద్ద దేవాలయం మూకాంబిక దేవాలయం. ఈ దేవాలయం శక్తికి స్వరూపమైన అమ్మ మూకాంభిక దేవికి అంకితం ఇవ్వబడింది. సౌత్ ఇండియాలో మూకాంబిక టెంపుల్ చాలా ప్రసిద్ది. ఈ ఆలయంలోని మూకాంభికా దేవికి మూడు కళ్ళు ఉన్నాయి, ఈ విగ్రహానికి ఎదురుగా శివలింగంను ప్రతిస్ఠించారు. ఈ ఆలయంలో నవరాత్రి మరియు సరస్వతి పూజలను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.
Click Here More Details:
షోర్ టెంపుల్ మహాబలిపురం:
మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామం. కంచి పట్టణానికి 66 కి.మీ. దూరంలో ఉంది. ఇండియాలో ముఖ్యంగా చూడదగ్గ దేవాలయాల్లో ఒకటి షోర్ టెంపుల్ అత్యంత పురాతన దేవాలయాల్లో వారసత్వ దేవాలయంగా ప్రసిద్ది చెందినది. బంగాళాఖాతం నేపథ్యంలో సూర్యాస్తసమయాలలో ఈ ఆలయం యొక్క గ్రానైట్ నిర్మాణం సుందరంగా కనబడుతుంది.
అనేక మంది దేవతలు ఇక్కడ ఆరాధించబడ్డారని పురాణాలో లికించబడనిది. ఆల్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ షోర్ టెంపుల్ వీక్షించడానికి సందర్శకులు ఎక్కువగా ఉదయం లేదా సాయంత్ర సమయంలో వెళుతుంటారు. ఇక్కడ నిర్వహించే వార్షిక వేడుకలకు "డాన్స్ ఫెస్టివల్"గా అంతర్జాతీయ ఖ్యాతి ఉంది.
Click Here More Details:
పద్మనాభస్వామి టెంపుల్ , తిరువనంతపురం:
అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది.
ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంకోర్ రాజకుటుంబం అధ్యతలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది. తిరువనంతపురంలో ప్రసిద్ది చెందినటువంటి ఆలయం పద్మనాభస్వామి టెంపుల్. ఇండియాలోని ఆలయాలన్నింటిలోకి అత్యంత ధనిక దేవాలయంగా ప్రసిద్ది చెందినది. పద్మనాభస్వామి ఆలయంలో విష్ణువు కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయంలో విష్ణువు ‘అనంత శయనమ్' స్థితిలో ఉన్న విగ్రహాన్ని మీరు చూడవచ్చు.
Click Her More Details:
సుచింద్ర టెంపుల్, సుచింద్రం :
సుచింద్రం, తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో ఉన్నఒక ఆధ్యాత్మిక మరియు ప్రశాంతకరమైన ప్రముఖ పట్టణం. ఇక్కడ థనుమలయన్ దేవాలయం ఉండటం వలన దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంగా పేరు వొచ్చింది. పురాతన కాలంలో, ఈ పట్టణం ట్రావన్కోర్ పట్టణానికి ఒక కోటలాగా ఉండేది.  ఈ ఆలయ గోపురం 134 అడుగుల ఎత్తులో ఉంటుంది, ఇది సుదూరం నుండి కూడా కనపిస్తుంది. ఈ దేవాలయ గోపురంపై దేవతల మరియు హిందూ పురాణాలకు సంబంధించిన విగ్రహాలున్నాయి.
Click Here More Details:
రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం:
శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు స్వయంవ్యక్తమైన ఎనిమిది క్షేత్రాల్లో శ్రీరంగం మొట్టమొదటిది. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో (దివ్యదేశాలు) అన్నిటికంటే మొట్టమొదటిదిగా, అత్యంత ప్రధానమైనదిగా ఇది పరిగణన పొందుతోంది. 
ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. రంగనాథస్వామి దేవాలయం లేదా తిరువరంగం, సౌత్ ఇండియాలోనే బాగా ప్రసిద్ది చెందిన దేవాలయం . ఈ దేవాలయంలో విష్ణు భగవానుడు శయనస్థితిలో ఉండటాన్ని మనం చూడవచ్చు.  ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అని చెప్పబడుతోంది.
Click Here More Details:

Famous Temples:










15 famous temples in india list, list of india hindu temples, famous temples in india list pdf, famous temples in india with states, temple cities of india, famous temples in india map, north indian famous temples list, top 10 temples in india, top 10 hindu temples in the world, lepakthi temple, hampi, tirumala, tanjavur, srirangam, anatapadmanabha swamy, rameswaram,
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.