Drop Down Menus

కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra kedareshwar Temple

ఇక్కడికి వెళితే అందరి కంటే ముందే కలియుగాంతం గురించి మీరు తెలుసుకోవచ్చు.
కేదారేశ్వర గుహ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఉన్న హరిశ్చంద్ర కోటకు కుడి వైపున ఉంది . ఇది ఒక అద్భుతమైన కట్టడం.పెద్ద బండరాయి కింద 12 అడుగుల శివలింగం రూపంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ గుహ లోపలి భాగంలో 4- 6 మంది భక్తులు కూర్చుని పూజ, ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఒక గది కూడా ఉంది. ఈ శివ లింగాన్ని భూమి నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండేటట్టు నిర్మించారు.
యుగాంతం. ఈ పదాన్ని ఆధారంగా చేసుకొన్ని ఎన్నో కథలు, నవలలు, చివరికి సినిమాలు కూడా వచ్చాయి. ఇక పరిశోధనలకు లెక్కలేదు. ఈ యుగాతం విషయమై ధార్మిక, వేద భూమిగా పేరొందిన భారతదేశంలో పరిశోధనలకు లెక్కలేదు. లయకారకుడైన పరమేశ్వరుడి ఆదేశం మేరకు ఈ యుగాంతం అనే ప్రక్రియ జరుగుతుందని చెబుతారు.

ఇక కలియుగం అంతం తర్వాత ఈ భూ మండలం పై జీవంఉండదని కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది. ఒక్క భారత దేశంలోనేకాకుండా కలియుగానికి సంబంధించిన కథలు, పరిశోధనలు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన విషయాల పైఅప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి.

అలా కలియుగాన్ని 24 గంటలు మందే చెప్పే ఒక గుహాలయం భారతదేశంలోనే ఉంది. మీరు అక్కడికి చేరుకొంటే యుగాంతం గురించిముందుగా తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం మీ కోసం..
ప్రస్తుతం మనం నివశిస్తున్నది కలియుగం. ఈ యుగం తర్వాత ఈ ప్రపంచం మొత్తం అంతమై పోతుందని భారతపురాణాలే కాకుండా ఇతర దేశాల్లోని చాలా మంది నమ్ముతున్నారు.
శాస్త్రవేత్తలు కూడా చాలా ఏళ్లుగా ఈ విషయం పై పరిశోధనలు చేస్తున్నారు. భారత పురాణాలను అనుసరించి ఈ మొత్తం ప్రపంచాన్ని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని విభజించారు.

ప్రతి యుగం తర్వాత భయంకర ప్రళయం ఏర్పడుతుందని అటు పై మరుసటి యుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతాయి.
ఆ ఘటనల్లో చాలా వరకూ దేవాలయాల్లో జరుగుతాయి. అటు వంటి దేవాలయం మహారాష్ట్రలో ఉంది. అదే కేదారేశ్వర దేవాలయం. ఇది ఒక గుహాలయం.
ఈ గుహలో నాలుగు రాతి స్తంభాల మధ్య ఒక శివలింగం ఉంటుంది. దీని ఎత్తు ఐదు అడుగులు. ఈ శివలింగంతోపాటు ఈ గుహాలయాన్ని ఎప్పుడు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు.
ఇక ఆ నాలుగు స్తంభాలు ఒక్కొక్క యుగానికి అంటే కృతయుగం , త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికి ప్రతీకలు. ఒక్కొక్క యుగాంతం సమయంలో సరిగ్గా 24 గంటల ముందు ఒక్కో స్తంభం విరిగి పోయిందని స్థానిక కథనం.

ఇదే క్రమంలో విరిగి పోకుండా ఉన్న స్తంభం మనకు కలియుగానికి ప్రతీక. అయితే విరిగిపోకుండా ఉన్న ఈ స్తంభం అంత పెద్ద రాతి బండను ఎలా మోస్తోందన్న విషయం అంతు చిక్క‌డం లేదు. అలాగే ఇక్కడ మ‌రో విషయం ఏమిటంటే, ప్రతిరోజు 4 గోడల నుండి నీరు గుహలోకి వస్తుంది. శివలింగం చుట్టూ వేసవి, శీతాకాలాలలో 5 అడుగుల ఎత్తులో చాలా చల్లని నీరు ఉంటుంది. కాని, వర్షాకాలంలో చుక్క నీరు కూడా గుహలోకిరాదు, నిలవదు. ఈ విషయంపై కూడా పరిశోధనలు జరిగిన జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇలాంటి ప్రదేశాలు ఇంకా ఎన్నో భారత దేశంలో వుండడం మన ప్రాచీనుల విజ్ఞానానికి ప్రతీక.
అహ్మద్ నగర్ నుంచి ఈ కేదారేశ్వర గుహకు 146 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 3.48 గంటలు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎప్పుడైనా గుహను సందర్శించుకోవడానికి వీలవుతుంది.
Interesting Temples:
కేదారేశ్వర గుహ, కేదారేశ్వర గుహలో ఉన్న ర‌హ‌స్యాలు, Harishchandragad, kedareshwar guha
kedareshwar cave, harishchandragad, harishchandragad trek map, harishchandragad in marathi, harishchandragad height, harishchandragad trek blog marathi, maharashtra kedareshwar temple, harishchandragad camping, maharashtra
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Topic andmand content inspired from Praveen mohan A youtuber.

    ReplyDelete
  2. Topic andmand content inspired from Praveen mohan A youtuber.

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.