ఈ సురలీమును లీచరాచరములు | Annamayya Keerthanalu
ఈ సురలీమును లీచరాచరములు |
యిసకలమంతయు నిది యెవ్వరు ||
ఎన్నిక నామము లిటు నీవై యుండగ |
యిన్ని నామము లిటు నీవై యుండగ |
వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి |
యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ||
వొక్కరూపై నీవు వుండుచుండగ మరి |
తక్కిన యీరూపములు తామెవ్వరు |
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ |
మక్కువ నుండువారు మరి యెవ్వరు ||
శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా |
దైవంబులనువారు తామెవ్వరు |
కావలసినచోట కలిగి నీవుండగ |
యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు ||
More Annamayya Keerthanas Click Here Below Link:
అన్నమయ్య కీర్తనలు
annamayya keerthanalu by priya sisters, annamacharya keerthanalu balakrishna prasad
annamayya keerthanalu lyrics in english, balamuralikrishna annamayya keerthanalu mp3
annamayya keerthana telugu songs, annamacharya ketan, tallapaka annamacharya sankeerthanalu, annamayya patalu
Today Tirumala Darshan Information:
తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు
a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం
b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం
c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు
Comments
Post a Comment