శ్రీ జగన్నాథ్ ఆలయం | రాంచీ జార్ఖండ్ | Sri Jagannath Temple Information | Ranchi Jharkhand | Hindu Temples Guide

శ్రీ జగన్నాథ్ ఆలయం, రాంచీ, జార్ఖండ్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. శ్రీ జగన్నాథ్ ఆలయం అనగానే అందరికీ పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ్ ఆలయం గుర్తుకు వస్తుంది. కానీ రాంచీ లోని ఆలయం కూడా ఉన్నది అని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఆలయంలో కూడా పూరీ ఆలయంలో వలె అని పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయం ప్రసిద్ది చెందకపోవడం వల్ల చాలా మందికి తెలియదు.

ఆలయ చరిత్ర :

రాంచీలోని జగన్నాథ్ ఆలయాన్ని బారక్ గర్హ రాజు జగన్నాథ్పూర్ ఠాకూర్ అని నాథ్ షాహ్డియో 1691 లో నిర్మించారు. డిసెంబర్ 25, 1691 న పూర్తయింది. ఇది ప్రధాన పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఆ గ్రామ చిన్న కొండ పైన ఉంది. ఈ ఆలయం చిన్నది అయినప్పటికీ అదే నిర్మాణ శైలిలో నిర్మించబడింది. పూరిలోని రథయాత్ర మాదిరిగానే, అశఢ మాసంలో ఈ ఆలయంలో  రధయాత్ర జరుగుతుంది. ఈ యాత్ర జరిగే సమయంలో భక్తులు వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయం పునః నిర్మాణం 8 ఫిబ్రవరి 1992 న ప్రారంభమైంది మరియు 1992 డిసెంబర్ లో పూర్తిగా పునరుద్ధరించబడింది. ఈ ఆలయం కూడా అనేక మంది రాజులు దండయాత్ర చేసి ఈ ఆలయని కూల్చి వేసిన భక్తులు తిరిగి పునః నిర్మించుకున్నారు.  ఆలయలో వైకుంఠ ఏకాదశి , శ్రీ రామ నవమి , దసరా , దీపావళి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 5.00 - 12.00
సాయంత్రం : 3.30 - 7.30

వసతి సౌకర్యాలు :

ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలో రాంచీ బస్ స్టాండ్ కలదు.  ఇక్కడి నుంచి ఈ ఆలయానికి కేవలం 44కి.మీ దూరంలో కలదు.

రైలు మార్గం :

సమీప రైల్వే స్టేషన్ అయిన రాంచీ జంక్షన్  రైల్వే స్టేషన్ అనే రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి అనేక ప్రైవేట్ వాహనాలు  ఆలయానికి చేరుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం :

రాంచీ  విమానాశ్రయం సమీప విమానాశ్రయం ఇక్కడి నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

ఆలయ చిరునామా :

శ్రీ జగన్నాథ్ దేవాలయం,
రాంచీ,
జార్ఖండ్.
పిన్ కోడ్ - 834001

Key Words : Sri Jagannath Temple Information Ranchi, Famous Temples In Jharkhand, Hindu Temples Guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS