Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Bhagavad Gita 3rd Chapter 23-33 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 

శ్రీమద్ భగవద్ గీత తృతీయోఽధ్యాయః
అథ తృతీయోఽధ్యాయః |

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ‖ 23 ‖

భావం : అర్జునా! ఏ మాత్రమూ ఏమరపాటు లేకుండా నేను నిరంతరం కర్మలు చేయకపోతే, ప్రజలంతా అలాగే ప్రవర్తిస్తారు.

ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ‖ 24 ‖
భావం : నేను కర్మలు ఆపివేస్తే ప్రజలంతా భ్రష్టులైపోతారు. రకరకాల సంకరాలకూ, ప్రజలనాశననికి నేనే కర్తనవుతాను.

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత |
కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్ ‖ 25 ‖
భావం : అర్జునా! అజ్ఞానులు ఫలితలు ఆశించి కర్మలు చేసినట్టే ఆత్మజ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోకకళ్యాణం కోసం కర్తవ్య కర్మలు ఆచరించాలి.

న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్ |
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్ ‖ 26 ‖
భావం : ఫలం కోరి కర్మలు చేస్తే పామరులు బుద్దిని విజ్ఞులు వికలం చేయకూడదు. జ్ఞానియోగిగా సమస్తకర్మలూ చక్కగా ఆచారిస్తూ ఇతరుల చేతకూడా చేయించాలి.   

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః |
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ‖ 27 ‖
భావం : ప్రకృతిగుణాలవల్ల సర్వకర్మలూ సాగుతుండగా, అజ్ఞాని అహంకారంతో కర్మలను తానే చేస్తున్నానని తలుస్తాడు.

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః |
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ‖ 28 ‖
భావం : గుణాలు, కర్మల నిజస్వరూపం తెలసిన తత్వవేత్త ఇంద్రియారూపాలైన గుణాలు విషయరూపాలైన గుణాలమీదే నిలచి వున్నాయని గ్రహించి వాటికి దరికి చేరడు.

ప్రకృతేర్గుణసంమూఢాః సజ్జంతే గుణకర్మసు |
తానకృత్స్నవిదో మందాన్కృత్స్నవిన్న విచాలయేత్ ‖ 29 ‖
భావం : ప్రకృతిగుణాలతో ముగ్ధులైన మూఢులు గుణకర్మలలోనే ఆసక్తి చూపుతారు. అయితే అల్పులూ, మండబుద్దులూ అయినవాళ్ల మనస్సులను జ్ఞానులు చలింప చేయకూడదు.

మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా |
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ‖ 30 ‖
భావం : నీవు చేసే సమస్త కర్మలూ నాకు సమర్పించి, వివేకంతో ఆశా మామకారాలు విడిచిపెట్టి నిశ్చితంగా యుద్దం చెయ్యి.

యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః |
శ్రద్ధావంతోఽనసూయంతో ముచ్యంతే తేఽపి కర్మభిః ‖ 31 ‖
భావం : అసూయ లేకుండా, శ్రద్ధాభక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారం ప్రవర్తించే మానవులు మానవులు కర్మబంధాలనుంచి విముక్తులవుతారు.

యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ |
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ‖ 32 ‖
భావం : నేను ఉపదేశించిన ఈ నిష్కామకర్మయోగా విధానాన్ని నిందించి ఆచరించని వాళ్లు అవివేకులూ, అజ్ఞానులూ అన్ని విధాలా చెడిపోయిన వాళ్లూ అని తెలుసుకో.


సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి |
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ‖ 33 ‖
భావం : పండితుడు కూడా తన సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమతమ ప్రకృతినే అనుసరిస్తాయి. అలాంటప్పుడు నిగ్రహం ఏం చేస్తుంది ?   


3వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 3rd chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments