Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Bhagavad Gita 3rd Chapter 34-43 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 

శ్రీమద్ భగవద్ గీత తృతీయోఽధ్యాయః
అథ తృతీయోఽధ్యాయః |

ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపంథినౌ ‖ 34 ‖

భావం : ఇంద్రియాలన్నిటికి తమతమ విషయాల పట్ల అనురాగం, ద్వేషం వున్నాయి. ఎవాళ్లూ వాటికి వశులు కాకూడదు. అవి మనవులకు బద్దశత్రువులు.

శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ‖ 35 ‖
భావం : ఇతరుల ధర్మం చక్కగా అనుసరించడంకంటే లోటుపాటూలతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడంవల్ల స్వధర్మ చరణలో మరణమైనా మంచిదే. 
అర్జున ఉవాచ |
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః |
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ‖ 36 ‖
భావం : అర్జునుడు : కృష్ణా! తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వల్ల పాపాలు చేస్తున్నాడు. 
శ్రీభగవానువాచ |

కామ ఏష క్రోధ ఏషః రజోగుణసముద్భవః |
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ ‖ 37 ‖
భావం : శ్రీ కృష్ణాభగవానుడు:రజోగుణం వల్ల కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకూ మూలకారణాలు. ఎంత అనుభవించినా తనివితీరని కామమూ మహాపాతకాలకు దారితీసే క్రోధమూ ఈ లోకంలో మానవుడికి మహాశత్రువులు.

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ |
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ‖ 38 ‖
భావం : పొగ అగ్నిని, మురికి అద్దాన్ని, మావి గర్భంలోని శిశువుని కప్పేవేసినట్లు కామం ఆత్మజ్ఞానాన్ని అవరించింది.

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ‖ 39 ‖
భావం : అర్జునా! ఎంతకీ తృప్తి ఎరుగని అగ్ని లాంటి కామం జ్ఞానులకు నిత్య శత్రువు. ఆత్మజ్ఞానాన్ని అలాంటి కామం కప్పివేసింది.

ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే |
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ‖ 40 ‖


భావం : ఈ కామనికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. ఇది వీటి ద్వారా జ్ఞానాన్ని అవరించి దేహధారులకు మోహం కలుగజేస్తున్నది.
తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ‖ 41 ‖
భావం : అర్జునా! అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పుచేతల్లో వుంచుకొని, జ్ఞానవిజ్ఞానాలను నాశనంచేసే కామమనే పాపిని పారద్రోలు.

ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః ‖ 42 ‖
భావం : దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి. మనస్సు ఇంద్రియాలకంటే శ్రేష్టం. బుద్ది మనస్సు కంటే అధికం. అయితే బుద్దిని అధిగమించింది ఆత్మ.

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా |
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ‖ 43 ‖
భావం : అర్జునా! ఇలా బుద్దికంటే ఆత్మ గొప్పదని గుర్తించి, బుద్దితోనే మనస్సును నిలకడ చేసుకొని, కామరూపంలో వున్న జయించరాని శత్రువును రూపుమాపు.
oṃ tatsaditi śrīmadbhagavadgītāsūpaniśhatsu brahmavidyāyāṃ yogaśāstre śrīkṛśhṇārjunasaṃvāde
karmayogo nāma tṛtīyoadhyāyaḥ ‖3 ‖


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
కర్మయోగో నామ తృతీయోఽధ్యాయః ‖ 3 ‖

3వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 3rd chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments

Popular Posts