ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 32nd Question
32nd Question :
ప్రశ్న ) కొందరంటారు: కర్మయోగమే గొప్పదని, ఇంకొందరంటారు: జ్ఞానయోగం గొప్పదని, మరి కొందరంటారు: భక్తి యోగం చాలా గొప్పదని, సామాన్యులైన నాకు వీటినన్నింటిని పరిశీలించే శక్తి లేదు. సమభావనతో నా కర్తవ్యాన్ని నేను చక్కగా నిర్వహించడం నాకు తెలుసు నాకు పరిపూర్ణత కలుగుతుందా ? ఇలా సిద్ది పొందినా వారున్నారా ?
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి ‖ (3వ అ - 20వ శ్లో)
జవాబు : ఒక్కొక్కరు వారి వారి అంచనాల ప్రకారం ఒక్కొక్క విధంగా చెపుతారు. అన్నీ వ్యాధులకు ఒకే మందు, ఒకే మోతాదులో వేస్తే పడనట్లే అందరికీ ఒకే మార్గం కుదరదు. కనుక మహర్షులు వాళ్ల వాళ్ల యోగ్యత, అవసరాలను గుర్తించి అనేకరకాలుగా మనకు మార్గాల నుపదేశించారు. అన్నీ గొప్పమార్గాలే. అనాసక్తి యోగ్యంతో కర్తవ్యబుద్దితో కర్మలచరిస్తే తప్పక పరిపూర్ణత లభిస్తుంది. అలా కర్మయోగం ద్వారా సిద్దిని పొందిన వారే జనకాది మహాపురుషులు. పరిపూర్ణతను పొందినప్పటికి, వారికేమి అక్కరలేక పోయినప్పటికి, లోకంలో ఉన్న మనమంతా తమను ఆదర్శంగా ఆనుసరిస్తాం. కాబట్టి వారు కర్మనుష్టాన్ని విడిచివేస్తే, మనం కూడా చేయమని మన కోసమే వారు వ్యవహారం కోసం కర్మలను అనాసక్తితో ఆచరించారు. మనం వారి అడుగుజాడల్లో నడవాలి.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment