ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 31st Question
31st Question :
ప్రశ్న ) ఏ పనీ చేయకుండా ఉండలేం. ఏదో ఒకటి చేస్తూ ఉంటే రాగద్వేషాలు కలగకా మానవు. రాగద్వేషాల ప్రభావాలకు లోపడితే మనస్సుకు శాంతి ఉండనే ఉండదు. పనులు చేస్తున్నప్పటికి రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా ఉండటమేలా సాధ్యపడుతుంది అలా కర్మసంగం లేకుండా ఉంటే ఎన్నటికైనా మోక్షం లభిస్తుందా ?
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః ‖ ( 3వ అ - 19వ శ్లో)
జవాబు : రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా కర్మలుచేయడం తప్పక సాధ్యమౌతుంది. ఇంద్రియాలను, మనస్సును వాటి విజృంభణల నుంచి నిరోధించి ఫలసక్తి లేకుండా కర్తవ్యతా బుద్దితో కర్మలను చేయాలి. అప్పుడు మీకు కర్మసంగం ఉండదు. అంటే ఆసక్తి లేదన్నమాట. ఇలా పనులు చేయడాన్ని మహాత్ములు అనాసక్తి యోగమన్నాడు. అనాసక్తి కర్మలను చేసేవారికి పరమపురుషప్రాప్తి రూపమైన మోక్షం లభిస్తుంది.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment