మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇళ్లు లక్ష్మీ నివాసమే..
ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీ తాండవం చేస్తుంది.
పూర్వం కాలం లో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు, వాటి వల్ల ఆరోగ్యముగా ఉండేవాళ్లు. వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికి మనం పాటిస్తున్నాం. ఒక ఇల్లు బావుండాలన్న, ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా.. ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని చెప్తుంటారు..మహిళలు,ఎప్పటికి,చేయకూడని,పనులు మరి అవేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..
1) సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మీ వెంటాడుతుంది.
2) ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షము లోనే చేయాలి.. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. బహుళ పక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు..
3) ఆడవారు ఎప్పుడు దిండ్లుపై కూర్చోకూడదు.. ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట..
3) ఇంట్లోని మగవారు మంగళ వారము నాడు క్షవరము చేసుకోవడం, గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఇలా చేస్తే దారిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే.. చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు.. కానీ అలా తీయరాదు.
4) ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినపుడు పలకిరించ వచ్చే వారిని ఎదురెళ్లి ఆహ్వానించ కూడదు. అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది.. అలాగే పలకరించి వెళ్లే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు.
5) కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి, ఎందుకంటే పసుపు క్రిమినాశిని.
6) స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు
7) నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు… సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు.
8) ఉప్పు, మిరప కాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చిన, చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి..
9) అలాగే ప్రతి రోజు భోజనానికి ముందు కాకికి అన్నము పెట్టాలి.. ఇలా చేయటం పితృ దేవతలకు సంతృప్తిని ఇస్తుంది.. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి.
10) టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్లు వుండే భాగము ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.
11) స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు.. ఇది జ్యేష్టాదేవి స్వరూపము. ఇది ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది.
12) అలాగే శుక్రవారమునాడు గాని, జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పు కొనండి.. ఇలా చేయటం వలన సంపదోన్నతి కలుగుతుందని చెప్తారు..
13) ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకొని కుర్చోవడము, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలవడం గాని, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు.
14) ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచేపుడు కుడి చేతితో చేయాలి, ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.
15) సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.
16) స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్ప కూడదు, రేపు తీసుకుంటాను అని చెప్పాలి
17) ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటె శ్రాద్ధము ముగిసేవరకు ముగ్గు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి.
18) ఇంటి ఇల్లాలి నోటినుండి ఎప్పుడు కూడా పీడ ,దరిద్రం, శని, పీనుగా, కష్టము, అనే పదములను వినిపించకూడదు..
19) ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూళ్లు దారిద్ర హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
20) ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి
21) ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్ళకూడదు.ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు.
22) మహిళలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే చీటికీ మాటికీ చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది.
ఉదయాన్నే నిద్రలేచాక చేయాల్సిన పనులు :
1) ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి.
2) మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది.
3) ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని, మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు.
4) ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి.పసి పిల్లలు హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి.
5) కుటుంబానికి వండిపెట్టడం దేవుడికి వంటచేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంట ప్రారంభించాలి.
ఇంటి ఇల్లాలు, ఇంటి వాస్తు దోషాలు, ఇంటి నిర్మాణం ప్లాన్, వాస్తు ప్రకారం గృహనిర్మాణం, ఇంటి ఆవరణలో ఉండవలసిన చెట్లు, వాస్తు టిప్స్, devotional house wife rules in telugu, good wife qualities in telugu, good husband qualities in telugu, wife and husband relationship in telugu
Tags
interesting facts
I WISH TO CPY THE MATERIAL BUT AM UMNABLE TO DO - DUE TO MY LCAK OF KNOWLEDGE ON THE COMPUTER - NO DOUBT - CAN U SUGGEST ME A SIMPLE WAY TO COPY THE MATERIAL AND OBLIGVE. THANKS
ReplyDeleteTake screenshots
ReplyDeleteNo woman is observing these , in the present day, fast changing world.
ReplyDelete