Drop Down Menus

Machenamma Temple Information in Telugu | Pedamallam,Achanta,West Godavari


ఆచంట మండలంలో  మాచేనమ్మా కట్టా అని పిలవబడే పెదమల్లం గ్రామ దేవత అయిన శ్రీ మాచేనమ్మా అమ్మవారి ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. .
స్థలపురాణం ప్రకారం అమ్మవారికి 400 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు తెలుస్తుంది. 

శ్రీ మాచేనమ్మ అమ్మ వారు  పెదమల్లం గ్రామం ఆడపడుచు. ఈమె చిన్నతనం నుండి లక్ష్మీదేవి భక్తురాలు. ఈమె మనసులో ఏమి అనుకుంటే అవి జరిగేవి. ఈమె యుక్త వయస్సు వచ్చిన తరువాత వివాహము జరిగింది.ఆమె భర్త ఒక ఆశ్రమంలో గురువు వద్ద శిష్యునిగా పనిచేస్తుండేవారు. గురువుగారు కాశీ పుణ్యక్షేత్రం చూడటానికై తనతో తన శిస్తులని వెంట తీసుకుని వెళ్ళుటకు నిర్ణయించుకున్నారు. శిష్యులలో ఒకరైన ఈమె భర్త భార్యతో చెప్పి కాశీకి వెళ్లారు. ఆసమయంలో ఈమె ఒక నెల గర్భిణి. ఆ విషయం భర్తకు తెలియదు.

సుమారు రెండు సవత్సరముల తరువాత భర్త కాశీ నుండి తిరిగి వచ్చారు. భర్త వచ్చిన సమయానికి ఈమె తన చిన్నారి పాపను ఎత్తుకుని భర్తకు చూపగా.ఈమె భర్త ఈ చిన్నారి పాప ఎవరు? అని ప్రశ్నించగా ఆమె చెప్పిన మాటలు భర్త నమ్మక,ఆమెను అత్తవారింటి వద్దనుండి పుట్టిల్లు అయిన పెదమల్లం గ్రామంలో దించుటకు గ్రామ పొలిమేర వద్దకు వచ్చిన తరువాత ఆమె భర్త చిన్నారి పాప ఎలా పుట్టింది అని ప్రశ్నించగా ఆమె భర్త మనస్సును గ్రహించి భర్తను ముందుకు నడవమని చిన్నారి పాపను ఎత్తుకుని ప్రక్కగా ఉన్న పొదల చటునకు వెళ్లి తన భర్త అనునించుచున్నాడు కావున పంచభూతాలు సాక్షిగా భూదేవి యందు ఐక్యం చేసుకోవలసినదిగా కోరగా భూదేవి ఆమె ఉన్న చోటు నుండి దారి ఇవ్వగా ఆమె,ఆమె చిన్నారి భూదేవి యందు ఐక్యమవుతు ఉన్నారు. మాచెనమ్మ చిన్నారి పాప శిరస్సుల వరకు భుగర్భము నందు దిగిపోవుచూ కనిపించినారు. వీరిని ఏ విధంగా రక్షించాలో భర్తకు అర్థం కాక ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగగా భర్త చేతికి జుట్టు వచ్చి ఆమె, చిన్నారి పాప శిరస్సులవరకు శిలా ప్రతమలుగా మారిపోయినారు.ఆమె భర్తకు ఏమి చెయ్యాలో తెలియక భయాందోళనతో జుట్టును ప్రక్కకు విసిరేసి అతను వెళ్ళిపోయాడు. జుట్టును విసిరేసిన ప్రదేశం నందు కొన్ని వృక్షములు మొలిచాయి.ఆ వృక్షము పేరు లేని చెట్టుగా ప్రసిద్ధిగాంచినది.

కొద్ది కాలమునకు చుట్టుప్రక్కల గ్రామస్థులకు అమ్మవారు కనిపించి గ్రామ పొలిమేర నందు మాచేనమ్మా అమ్మవారు వెలిసినారు అని చెప్పగా గ్రామస్థులు వచ్చిచూడగ దివ్య సమ్మోహితమైన శ్రీ మాచేనామ్మ అమ్మవారు చిన్నారి పాప విగ్రహములు కనిపించసాగాయి. ఈమెను కొలవడం ప్రారంభించడం ప్రారంభించిన తరువాత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ మాచేనమ్మ అమ్మవారు స్వచ్చమైన మహిమాన్వితం తెలుసుకుని గ్రామస్థులు గ్రామం పొలిమేర నుండి గ్రామం లోనికి తీసుకు వచ్చి గుడి కట్టుటకు నిర్ణయించుకుని అమ్మవారి వద్ద ఎంత మట్టి తీసిన అంత లోతుణకు శిరస్సులు వరకే  కనిపించసాగారు. సుమారు ఐదు అడుగుల బావి ఎర్పడగా అమ్మవారి ఆజ్ఞానుసారం ఆమెను ఆ ప్రదేశము యందు ఉంచసాగారు. 

తరువాత కొంత కాలమునకు గ్రామస్థులు గుడికట్టుటకు ప్రయత్నము చెయ్యగా అమ్మవారు కలలో కనిపించి నాకు ఎండ,వర్షం పడే విధంగా గుడి నిర్మాణము చేసి దానిపై తాటిఆకు శిఖరము ఉండే విధంగా కోరినారు అందుకే ఈ రోజు వరకు తాటిఆకు శిఖరం కలదు.
Related Posts:








              

machenamma temple information in telugu, east godavari famous temples in telugu, palivela temple history, ashta someshwara temples list, శ్రీ మాచేనమ్మ అమ్మవారి ఆలయ విశేషాలు, మాచేనమ్మ, శ్రీ మాచేనమ్మ, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.