Drop Down Menus

రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ? Brahmam Gari Kalagnanam

రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా? 
బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువులకాపరి గా ఉంటూ రవ్వలకొండ లో కాలజ్ఞానం వ్రాసారు. ఆవుల చుట్టూ గీతగీసి రవ్వలకొండ లో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లె కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గుహాలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసారు కనుక కొండలను 'బ్రహ్మంగారి కొండలు' అని కూడా పిలుస్తారు.

ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు అయన కాలజ్ఞానంలో ఉన్నవే! ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది ? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటివరకు బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో అయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు.

బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీ లోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పినవిధంగానే 1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు.

రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటివారికి తెలియదు కానీ, వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు వుండేవి. ప్రస్తుతం ఎక్కాడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగోనలేకపోతారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకూ కనుక్కోలేదు.

రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు. ప్రస్తుతం నీటినుంచే విద్యుత్తు వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ళ కిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమయిన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు.


వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పాడు. బ్రహ్మం గారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు.

ఇది ఇలా ఉంటె ఇప్పటివరకు జరగనవి, రాబోవు రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానం లో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అని ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది.

ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. దీని పైన భిన్న వాదనలు ఉన్నాయి. చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసినవారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు గుడ్డి వారు అవుతారని ఉంది. పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి, భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమౌతుంది అని చెప్పాడు. కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు.

ఇక బ్రహ్మం గారి ఆయన జన్మ రహస్యం గురించి, ఐదువేల ఏళ్ళ తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీనదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి. మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఉహించి రాసిన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలీదు, ఎలా ఉన్న కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి, కాలంతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే.

రవ్వలకొండ చేరుకోవటం ఎలా? 
రవ్వలకొండ చేరుకోవటానికి ముందుగా బనగానపల్లె చేరుకోవాలి. బనగానపల్లె నుండి రవ్వలకొండ కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీలైతే లోకల్ గా తిరిగే ఆటోలలో లేదా కాలినడకన కొండ పైకి చేరుకోవచ్చు. బనగానపల్లె కు హైదరాబాద్, కర్నూలు, డోన్, నంద్యాల, బెంగళూరు, ప్రొద్దుటూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులలో ఎక్కి చేరుకోవచ్చు. బనగానపల్లెలో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన బేతంచెర్ల (20 కి. మీ), తాడిపత్రి( 62 కి. మీ), నంద్యాల (38 KM ), డోన్ జంక్షన్ (58 KM), కర్నూలు(73 KM) . పట్టణానికి సమీపాన కడప విమానాశ్రయం (130 కి.మీ), రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (258 కి. మీ) కలవు.


బ్రహ్మం గారి కాలజ్ఞానం, బ్రహ్మం గారి పద్యాలు, వీర బ్రహ్మం గారి జీవితచరిత్ర, బ్రహ్మంగారి కాలజ్ఞానం mp3, కాలజ్ఞాన తత్త్వములు, బ్రహ్మంగారి కాలజ్ఞాన వాక్యాలు, బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞనం, శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పాటలు, brahmam gari kalagnanam telugu, brahmamgari jeevitha charitra, brahmamgari vachana kalagnanam, brahmam gari charitra katha, sri pothuluri veera brahmam gari charitra, brahmam gari patalu, veera brahmam garu, pothuluri veerabrahmendra swamy original photos, veera brahmam gari charitra audio songs download
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

 1. Goppa mahimaanvithudu&sangha samsskarta GOD Sri Sri Sri Viraat Pothuluri Veera Brahmendra Swamiye Namaha

  ReplyDelete
 2. Thanq, om hreem kleem sreem sivaya Brahmane namaha.

  ReplyDelete
 3. Om Sri Pothuluri Veerabrahmendraya Swamine Namo Namaha

  ReplyDelete
 4. Nice article
  Ready my blog articles too
  https://tollywood-stories.blogspot.com/2020/09/trivikram-moviel-titles-began-with.html

  ReplyDelete

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.