Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఐశ్వర్య ప్రదాయిని ధూమావతి జయంతి ఈరోజు | Dhumavati Devi Story in Telugu

ఐశ్వర్య ప్రదాయిని " ధూమావతి "(జూన్ 28 ధూమావతి జయంతి )
కొలిచిన వారికి కొంగు బంగారం...దారిద్ర్యాన్ని పోగొట్టి అమిత ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత ధూమావతి. జ్యేష్ట శుద్ధ అష్టమి అనగా జూన్ 28 ఆదివారంనాడు ఈ దేవత జయంతి. ఈ శక్తిఆవిర్భావం వెనుక విభిన్నకధలు ప్రచారంలో ఉన్నాయి.ఈమె రూపంలో కూడా చాలా వైరుధ్యం కనిపిస్తుంది.దేవతల్లో వైధవ్య రూపిణి గా దర్శనమిస్తుంది...
బూడిదరంగుఆకృతి..మాసినవస్త్రాలు.. వేలాడేస్తనాలు..విరబూసిన జుట్టు..ఆకలి గొట్టు..రౌద్రమైన చూపు,బొట్టు లేని ముఖంతోచాలా వృద్దురాలు గా వీరిని మనం చూస్తాం! దరిద్రగొట్టు పెద్దమ్మ అనేది వినే ఉంటారు ఆ ఆమ్మ ఈ అమ్మే అని కొందరు అంటారు. ఇక ధూమావతి అవతారం వెనుక కూడావిభిన్న కధనాలు వినిపిస్తాయి...

ఒకసారి శివుడు పార్వతి దేవి కైలాసంలో ఆనంద విహారం చేస్తున్న సమయంలో పార్వతి కి అకస్మాత్ గా ఆకలి బాగా వేసింది..ఆహారం కావాలి అని పతిని అడిగింది..కాని శివుడు ఆమె ఆకలి బాధ తీర్చడం ఆలస్యం చెయ్యడం తో ఒకపక్క ఆకలి దంచేస్తూండం తో కోపం వచ్చి ఆ గరళ కంఠుడిని మింగేస్తుంది... అగ్నిరూపుడు శివుడు తన కడుపులో ఉండటంతో ఆ మహేశ్వరీ శరీరం నుండి ధూమ వర్ణం తో పొగలు రావడంతో ఆమె ధూమావతి అయ్యింది..

అలానే భర్త ని మింగేయడం వలన విధవ గా మారింది. అలానే ఈమె గురించి ఇంకో కధ కూడా ప్రచారంలో ఉంది.... దక్షపుత్రిక అయిన దుర్గాదేవిఅవతారం అయిన సతీదేవి తన తండ్రి చేసే యజ్ఞం తిలకించేందుకు పిలవని పేరంటం గా వెళ్లి అవమానం పాలు అవుతుంది,అది భరించలేక తనకుతాను అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది.సృష్టి స్థితి లయకారిణి అయిన ఆమె నుండి వచ్చిన ఒక ఉజ్వల శక్తి ఆ బూడిదలోచేరి మరో మహాకృతిని దాలుస్తుంది..ఆ శక్తే ధుమావతి అంటారు.దోష గుణ సంపన్నుడు అయిన దక్షుడు ని సంహరించడానికి అవతరించిన రుద్ర మూర్తి గా పేర్కొంటారు!
కలహప్రియ అయిన ఈమె ప్రభావం వలన శివ -దక్ష సైన్యాల మధ్య యుద్ధం జరిగేలా ప్రేరేపిస్తుంది.అమిత ఉచ్చాటన శక్తి రూపిణి అవ్వడం చే దక్షసైన్య శక్తిని నిర్వీర్యం చేస్తుంది. ఇక దేవి భాగవతంలో మరో కధనం కనిపిస్తుంది. పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు దేవతలని నానారకాలు గా హింసిస్తూ ఉంటాడు..ఆ బాధ తాళ లేక దేవతలు అందరూ జగన్మాత ని శరణు వేడుతారు..అప్పుడు ఆ లోక కంటకుడు ని వధించేందుకు దేవి సన్నధం అవుతుంది.
వారి ఇద్దరి మధ్య జరుగుతున్న సమర సమయంలో మహాశక్తి నుండి కాళి,భైరవి,చిన్నమస్తా,నీల సరస్వతి వంటిపంచదశ (15 ) మూర్తులు ఉద్భవిం చారు అంటారు..కనుక అన్ని విద్యలు ఒకేసారి అవతరించి నప్పుడు
వేరు వేరు తిధుల్లో జయంతులు ఎలా చేస్తారు అనేది వాదన ..ఆయా తిధులు ఆ దేవతలకు ఇష్టమైన
రోజులే తప్ప జయంతి కాదు అనేది వారి భావన...కనుక ధూమావతి జయంతి లేదా ఇష్టమైన తిథి జ్యేష్ట శుద్ధ అష్టమి..
ధూమవతి నే వృద్ద కాళిక గా మరి కొందరు అభివర్ణించారు.. 
వరాహా ముఖంగా ధూమ్ర వారాహి గా మరింత రౌద్రాకారం లో 
మరి కొందరు కొలుస్తారు... ఈ శక్తి రూపం బట్టి చాలామంది ఈ దేవత ని ఆరాధించడానికి భయపడతారు కాని నిజానికి ఈ దేవి సులభ వరప్రదాయిని అని సాధకులు చెబుతారు..ఋషుల్లో తొలుత పిప్పలాదుడు వీరిని పూజించారు అని వారి ద్వారానే ఈమె ఆరాధన విధానం జగతికి అందుబాటులో కి వచ్చింది అంటారు.
గణపతిముని "విశ్వోచ్చాటన కామో ధూమావతి ముపాసిత "అని పేర్కొన్నారు అంటే మొత్తం విశ్వాన్ని ఉచ్చాటనం చేయగలిగే శక్తి ఈ దేవతకు ఉంది ట! స్మశానంలో కాలుతున్న శవం అగ్నిలో ఏదైనా కాకి ని కూడా వీరి మంత్రం పఠిస్తూ కాల్చి ఆ బూడిద ఏ శత్రవు ఇంటి పై చల్లినా ఆ శత్రువు 
అక్కడ నుండి ఫలాయనం చిత్తగిస్తాడు అని ధుమావతి తంత్రం లో పేర్కొన్నారు . ఎంతటి దుష్ట శత్రువునైనా ఈమె ని ఆరాధించడం ద్వారా దూరం చేసుకోవచ్చు..అంతేకాదు పిచ్చి,మూర్చ,క్యాన్సర్,మెదడు కణతి,పక్షపాతం కీళ్ళనొప్పులు
వంటి భయంకర వ్యాధులు,దారిద్ర్యం ,వ్యసనాలు ఇలా ఒక మాటలో చెప్పాలి అంటే సర్వ దుఃఖ సంహారిణి! 
ఈ దేవిని నిత్యం పూజించి ఆమె అనుగ్రహం పొందితే అంతకన్నా అదృష్టం ఉండదు ..అందులో కలియుగం లో శని బాధ దూరం కావాలి అంటే కాలభైరవుడు,స్త్రీ దేవతల్లో వీరినే ఎక్కువ ఆరాధించాలి.అలాగే రుద్రుల్లో కాలభైరవ అంశ ..దశావతారాల్లో మత్స్య అవతారం..ఈమె వాహనం కాకి..శని వాహనం కూడాఅదే!
ధుమావతి యజ్ఞం చేసే చోట కాకులు కూడా విరివిగా వస్తాయి అది కొంతమంది కి కలిగిన అనుభవం. ఇక ఈ దేవిని మనం నలుపు వస్త్రాలు ధరించి ఆరాధించాలి..అలాగే ఈమె ఉచ్ఛాటన
దేవత కనుక అపసవ్య దిశలో ప్రార్ధించాలి అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించు అనకూడదు..దారిద్ర్యాన్ని వెళ్లగొట్టు అనాలి..ఇలాగే
ఏ కోరిక అయినా కోరుకోవాలి
ధుమావతి మంత్రాలు:- ఓం ధూం ధూం ధూమావతి స్వాహా
               ఓం ధూం ధూం ధూమావతి అపదోద్దరనాయ స్వాహా
ధుమావతిధ్యానం:- ....

Related Posts:


 ధూమావతి , dhumavati devi story in telugu, dhumavati photo, dhumavati tantra, dhumavati temple mangalore, dhumavati temple in varanasi, dhumavati daiva, dhumavati jayanti, dhumavati temple in tamilnadu, chinnamasta devi, dhumavahti jayanti.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు