Drop Down Menus

శ్రీ చిదంబర నటరాజ స్వామి ఆలయం | చిదంబరం | తమిళనాడు | Sri chidambara Nataraja Swami Temple Information | Chidambaram | Tamilnadu | Hindu Temples Guide

శ్రీ చిదంబర నటరాజ స్వామి ఆలయం, చిదంబరం, తమిళనాడు :

తమిళనాడు రాష్ట్రాన్ని దేవాలయాల నగరం అని అంటారు. అందుకు కారణం ఈ రాష్ట్రం మొత్తం ప్రసిద్ద ఆలయాలు కలవు. ఇందులో ప్రధానంగా పంచభూత ఆలయాలలో 4 ఈ రాష్ట్రంలోనే కలవు. శ్రీకాళహస్తిలో వాయు లింగం ఉండగా మిగిలిన నాలుగు ఈ తమిళనాడు రాష్ట్రంలో కలవు. అవి కాంచీపురంలో పృధ్వివి లింగం , తిరువణ్ణామలై లో అగ్ని లింగం , జంబుకేశ్వరంలో జల లింగం మరియు చిదంబరంలో ఆకాశ లింగం. ఇక్కడ స్వామి గమనిస్తే 3 రూపాలలో దర్శనం ఇస్తాడు. అన్నీ శివాలయం లలో లింగ రూపంలో మాదిరిలా కాకుండా ఇక్కడ స్వామి నటరాజా మూర్తి రూపంలో దర్శనం ఇస్తారు. మొదటి సరిగా భూమిపై నాట్యమాడిన ప్రదేశమే చిదంబరం. 

ఆలయ చరిత్ర : 

ఈ ఆలయం చాలా పురాతనమైనది. కానీ ఇక్కడ శాసనాల ప్రకారం ఈ ఆలయం 11-12 శతాబ్దం మధ్య కాలంలో నిర్మించారు అని తెలుస్తుంది. మన దేశంలోని పెద్ద ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం 40 ఎకరాలలో విస్తరించి ఉన్నది. ఈ ఆలయంలో శివున్ని "నటరాజ" నృత్య రూపంలో పూజించే ఏకైక శివాలయం అని చెప్పవచ్చు. సాదారణంగా ప్రతి శివాలయంలో శివున్ని "శివలింగ" రూపంలో పూజించటం గమనించవచ్చు. పరమశివుడు మహావిష్ణు ఇద్దరిని పక్కపక్కనే పూజలు చేసే ప్రధాన ఆలయం ఇక్కడ మాత్రమే ఉంటుంది. చిదంబరం అనగానే అనంతమైన ఆకాశం అని అర్ధం.


మనిషి నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నుల నుంచి తప్పించుకొని ఉన్న ఐదవ దిక్కు ఉన్నది పైన ఆ నేత్రం ఎల్లపుడూ చూస్తుననే ఉన్నది మనలని అందుకే పరమశివుడు ఆకాశ కన్ను గా మనలని ఎల్లపుడూ గమనిస్టుననే ఉంటాడు. పంచభూతల సాక్షిగా మనిషి తో పాటు ఏ ప్రాణి ఏం చేసిన ప్రతి ఒక్కటి సాక్ష్యం చెప్పడానికి పంచభూతల రూపంలో ఎల్లపుడూ సిద్ధము గా ఉంటాయి అందుకే స్వామి ఈ రూపంలో కొలువై ఉన్నాడు.


ఈ ఆలయంలో స్వామి 3 రూపాలలో దర్శనం ఇస్తారు. అవి ఒకటి నటరాజ రూపం , రెండు గర్బాలయం లోని శుద్ద స్పటిక లింగ రూపం. ఈ లింగాన్ని ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకి ప్రత్యేక అభిషేక సమయంలోనే బయటికి తీస్తారు. కేవలం ఒక గంట సమయం మాత్రమే అభిషేకించి తిరిగి లోపలికి తీసుకోని వెల్లుతారు. మూడవ రూపం నిరాకార రహస్యం చిదంబరం రహస్య రూపం. పూర్వం ఏ ప్రదేశంలో ఋషీలు తపస్సు చేస్తూ ఉండేవారు. వారు ఒకసారి తమ తప్ప శక్తి చేత ఎంతటి వారినైనా లోబరుకొని భస్మం చేస్తాం అనే అహం వారిలో వచ్చినది. ఋషిల యొక్క గర్వాన్ని అణిచివేయాలని శివుడు దిగంబరుడు రూపంలో ఆ ప్రాంతానికి వచ్చి ఋషిల ముందు నిల్చొని ఉన్నాడు.


ఈ స్వామి యొక్క సౌందర్యాన్నికి ఋషిల యొక్క స్రీ పరవశించి పోయారు. అలా చేసినది కూడా శివుడే. అందుకే కారణం ఈ ఋషిల యొక్క గర్వం అణిచివేయడం కోసం స్వామి ఆడిన లీల. అందుకు యజ్ఞ గుండం ని అప్పటికి అప్పడు సృష్టి చేసి అందులో నుంచి విష సర్పాలని స్వామి పై వదిలారు. కానీ ఆ విష సర్పాలు అని స్వామి యొక్క ఆభరణాలు గా మారిపోయాయి. తరువాత ఒక భీకర రాక్షసుడుని సృష్టి చేసి వదలగా పరమశివుడు ఆ రాక్షసుడు మీదనే నృత్యం చేయగా వచ్చినది మామూలు వ్యక్తి కాదు అని గ్రహించి స్వామి పాదాల పై పడి శరణు కోరారు. అప్పుడు భోళా శంకరుడు వారి గర్వాన్ని అణిచి వారికి స్వామి యొక్క అసలు రూపం దర్శనం ఇచ్చాడు.


ఈ విషయం అంతా గ్రహించిన వ్యాఘ్ర పాద ముని ఆది శేషుని అవతారం అయిన పతంజలి ఋషీలు ఇద్దరు శివ లింగం ప్రతిష్ట చేసి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆనంద తాండవం చేశాడు. ఈ మూర్తియే గర్భాలయం లోని అసలైన మూర్తి. స్వామి యొక్క ముగ్ధ మనోహరమైన రూపం చూడడానికి రెండు కనులు సరిపోవు. ఈ స్వామి ని దర్శించిన వెంటనే తమకి తెలియకుండానే హర హర శంకర జయ జయ శంకర అని తలుచుకుంటారు.ఈ ఆలయంలో నటరాజ స్వామికి కుడి వైపున ఒక ప్రత్యేకమైన బాక్స్ లో శుద్ద స్పటిక లింగానే ఉంటుంది. ఈ లింగానే కొందరు ఆకాశ లింగం అని అంటారు. ఈ లింగాన్ని శ్రీ శంకరాచార్య స్వామి ప్రతిష్ట చేశారు అని కూడా చెపుతారు. ఈ క్రింది ఫోటో ఆలయం వెనుక గోపురం యొక్క ప్రదేశ ద్వారానికి ఎదురుగా ఉంటుంది.


పూర్వం ఈ ప్రాంతాన్ని పుండరీకం , వ్యాఘ్ర పురం , చిత్ర కూటం, బ్రహ్మ పూరీ అనే పేర్లు కలవు. ఈ ఆలయాన్ని చోళరాజులు తంజావూరుని రాజడనిగా చేసుకిని పరిపాలించే ముందు చిదంబరం నే రాజధానిగా చేసుకొని పరిపాలించే వారు. చోళ రాజులు ఆ తర్వాత పాడ్యరాజులు కాలంలోనే నటరాజ స్వామి ఆలయ నిర్మాణం జరిగినది. ఈ ఆలయం లో మన తెలుగు రాజు అయిన శ్రీ కృష్ణదేవరాయులు సైతం ఈ ఆలయానికి ఒక గోపురం నిర్మాణం చెప్పటారు.  ఈ ఆలయం 9 పుష్కరణి తో ఉండగా విటిలో "శివ గంగ" పుష్కరణి ప్రధానం. తప్పకుండ వెళ్ళినప్పుడు ఈ పుష్కరణి అడిగి మరి చూడండి. ఈ పుష్కరణి చాలా విశాలము గా ఉంటుంది.


దేహమే దేవాలయం అనే మాటకి నిదర్శనంగా భావిస్తే మనిషి యొక్క ముఖ్యమైన స్థానం గుండె ని స్వామి వారి గర్భాలయంగా భావించవచ్చు. మనిషి యొక్క శరీరానికి ఈ ఆలయానికి చాలా దగ్గరి సంబంధం కనిపిస్తుంది. మనిషికి నవ రంధ్రాలు ప్రతీకగా ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. నటరాజ స్వామి కొలువై ఉన్న ఆలయ శిఖరం పైన మొత్తం 21600 బంగారు పలకలు ఉంటాయి. ఇవి ఒక్క రోజులో మనిషి ఊపిరి తీసి వదిలే వాటితో సమానం. ఈ బంగారు పలకలని అతికించడానికి 72000 బంగారు మేకులని వినియోగించారు. ఈ 72 వేల బంగారు మేకులు మనిషిలోని 72 వేల నాడులతో సమానం. ఆలయంలోని 5 మండపాలు మనిషి యొక్క పంచ ప్రాణాలతో ప్రతీక. సూక్ష్మంగా గమనించి చూస్తే అప్పటి నిర్మాణ శైలి ఎంత వైభవంగా చేశారో తెలుస్తుంది. ఇందులో మారియొక్క విశేషం ఎమిటి అనగా ఆలయంలోపల మొత్తం 28 స్తంభాలు ఉండగా అవి 28 ఆగమాలకి ప్రతీక. ఆలయం పై కప్పు దులాలు మొత్తం 64 ఉండగా ఇవి 64 మొత్తం 64కళాలకి సంకేతం. గోపురం పైన ఉన్న  కలశలు  శక్తులకి ప్రతీక.


ఇలా ప్రతి ఒక్క అంశం మనిషి యొక్క అంశంలో ఏదో ఒక ప్రత్యేకత ఈ ఆలయానికి సంబంధం కలిగి ఉంటుంది. ఈ ఆలయం బయట గోపురం పై 108 శివ తాండవ భంగిమలు ఉండటం ఇక్కడ మాత్రమే కనిపించే విశేషం. ఈ ఆలయంలో మారియొక్క విశేషం ఈ ఆలయంలో 108 దివ్య హరి క్షేత్రాలలో ఒకటైన గోవిందరాజ స్వామిని దర్శించు కోవచ్చు. ఈ స్వామి ఆది శేషుని పై శయన రూపంలో దర్శించవచ్చు.  ఇక్కడ మహా లక్ష్మీ అమ్మవారి ఆలయం దర్శించుకుంటే అందరికీ అమ్మవారికి అలదీన పసుపు ప్రసాదం గా ఇస్తారు. కేవలం ఈ ఆలయంలో మాత్రమే ఈ సంప్రదాయం కనిపిస్తుంది. చిదంబర ఆలయం స్వయం యుక్తం అయినప్పటికీ ఏ ఆలయంలో లేని విధంగా నటరాజ మూర్తి చర ప్రతిష్ట. అనగా ప్రత్యేక సందర్భాలలో ఈ విగ్రహాన్ని బయటికి తీసి అభిషేకం , ఉత్సవాలు జరిపి తిరిగి లోనికి తీసుకొని వెల్లుతారు. ఇటువంటి ప్రక్రియ ఏ శైవ ఆలయం లలో కనిపించదు. ఈ ఆలయంలో స్వామి యొక్క కుడి వైపున ఒక ప్రత్యేక తెర ఉంటుంది.

ఈ తెరని గమనించి చూస్తే తెర పై చక్కటి సుగంధ పరిమాలలతో గంధం తో అలదీ దర్శనం ఇస్తుంది. కానీ చాలా మంది ఈ తెరని గమనించరు. మధ్యలో స్వర్ణ భరణాలతో దర్శనం ఇస్తున్న మూర్తి యో నటరాజ మూర్తి. స్వామి యొక్క అర్ధ భాగం గా ఉండే అమ్మవారు ఇక్కడ శివగామిగా దర్శనం ఇస్తుంది. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉన్నది. ఆలయం లోపల ఒక ప్రత్యేక భావి కలదు. ఆ భావి నీటి నుంచే అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తి వంతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ అమ్మవారిని నేరుగా కాకుండా కుడి లేదా ఎడమ వైపు నిల్చొని దర్శించుకోవాలి. ఈ అమ్మవారి ఆలయంలో మారియొక్క ప్రత్యేకత కలదు. ఆలయం లోపల ఒక ప్రత్యేక ప్రాంతంలో నిల్చొని ఒక రంధ్రం గుండా చూస్తే ఆలయం పక్కన శ్రీ శంకరులు ప్రతిష్ట చేసిన శ్రీ చక్రాన్ని దర్శించవచ్చు. వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. కనిపించక పోతే అమ్మావారి ఆలయం నుంచి బయటికి వచ్చి ప్రదక్షణ గా బయటికి వాస్తే ఎడమ వైపు ఒక ప్రత్యేక ఆలయంలో ఈ శ్రీ చక్రాన్ని దర్శించవచ్చు. అమ్మవారి ఆలయం ప్రక్కనే శ్రీ సుబ్రమణ్య స్వామిఆలయం కూడా కలదు.


స్వామి వారికి కుడి వైపున ఉన్న తెరలోపలే ఉన్నది చిదంబర రహస్యం. ఈ ఆలయంలో ఒక్కప్పుడు చిదంబర రహస్యంగా భావించే శిలకి మాత్రమే పూజలు జరిగేవి. ఆ తరువాత కాలంలో శ్రీ ఆది శంకరులు స్పటిక లింగాన్ని కైలాసం నుంచి తీసుకొని వచ్చి ప్రతిష్ట చేశారు. చోళుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగాక నటరాజ స్వామి రజత మూలవిరాట్ చరప్రతిష్ట చేశారు. అందుకు కారణం సం|| లో 6 సార్లు ఈ విగ్రహాన్ని గర్బాలాయం నుంచి బయటికి తీసుకొని వస్తారు. గర్బాలయం బయట ఉన్న మండపంలో నటరాజ మూర్తి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి లోనికి తీసుకొని వెల్లుతారు.


ఈ ఆలయంలో స్వామి వారికి కుడి వైపున ఉన్న చిదంబర రహస్యాన్ని మారియొక్క సారి పరిశీలించి చూస్తే బంగారు బిల్వ దళాలు , బంగారు లతలల మాలలు వేలాడదీసి కనిపిస్తాయి. ఇక్కడే ఉన్నది చిదంబర రహస్యం. ఆ బంగారు మలాల వెనుక ఉన్నదే చిదంబర రహస్యం. నటరాజ స్వామి ఆరాధకులు దీక్షితార్లు .ఆలయ ప్రధాన అర్చకులే ఈ దీక్షితార్లు. వీరు ప్రతి రోజు స్వామి వారికి రాత్రి చిదంబర మూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.  ఇక్కడ మహిమగల ఒక యంత్రం కలదు అని వారు చెపుతారు. ఎవ్వరికీ ఏ హాని చేయకుండ , ఒక్క అబద్ధం చెప్పకుండా ఉన్నవారికి ఈ తెర వెనుక ఉన్న యంత్రంలో శివపార్వతులు దర్శనం ఇస్తారు అని చెపుతారు. ఈ కలికాలంలో అది అసాధ్యం కనుక ఆ తెర తవాలగించిన ఎవ్వరూ తదేకంగా గమనించిన వారికి కనిపించదు.  చిదంబరం అంటే అనంతమైన శూన్యం. ఆ విధంగా ఆకాశాన్ని తాకే గోపురాలు కలవు.


తెర అనగా అజ్ఞానం. అనగా చీకటిలో ఒక తాడుని చూసి పాముగా భావిస్తే ఎంత అజ్ఞానం భయం కలుగుతున్నదో అదే తాడు పై వెలుగు పడగానే అది పాము కాదు తాడు అని ఎంతటి అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగి భయం తొలగిపోతున్నాదో దానికి సంకేతంగా మయా అనే తెర తొలగించి తన దర్శనం చేసుకుంటానే జ్ఞానం అనే తన దర్శనం లభిస్తుంది అని స్వామి వారు చెపుతారు. కింద నుంచి చూస్తే ఆ తెర కనిపించదు. అందుకు ప్రత్యేక 50 రూపాయలు గల ప్రత్యేక ప్రవేశ రుసుం తీసుకొని మగ వారు పై వస్త్రం తీసి ఆలయం లోనికి ప్రవేశించి గమనించి చూస్తే ఆ తెర కనిపిస్తుంది. ఇక్కడ స్వామి వారు ప్రతి రోజు ప్రదోష సమయంలో నటరాజ మూర్తిగా నాట్యం చేస్తారు అని చెపుతారు.


విష్ణు మూర్తి గోవిందరాజ ఆలయం నుంచి బయటికి వచ్చి ధ్వజ స్తంభం ఎదురుగా వెళ్ళితే మరి కొద్ది దూరంలో గణపతి ఆలయం , ఆ ప్రక్కనే నరసింహ స్వామి ఆలయం, ఆ ప్రక్కనే రుధ్ర తాండవం చేసే పరమేశ్వర ఆలయం ఆ వెనుక శ్రీ మహా లక్ష్మీ ఆలయం , ఆమ్మవారి ఆలయం నుంచి బయటికి వచ్చి ఎడమ వైపున ఆలయ రాతి స్తంభం పై శ్రీ సుబ్రమణ్య స్వామి చెక్కిన శిల్పం ,అటునుంచి నేరుగా వస్తే సహస్ర లింగం ఇంకా ముందుకు వెళ్ళితే స్వామి వారి 64 నాయనార్లు మూర్తులు , ఇంకా ముందుకు వెళ్లగా స్వామి వారి పంచ మండపాలు , తిరిగి స్వామి వారి ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు వస్తాము. ఈ ఆలయం వెనుక నుంచి వెళ్ళితే అమ్మవారి ఆలయం చాలా దగ్గర గా ఉంటుంది. ఆలయ పై కప్పు పై చక్కటి చిత్ర లేఖనలు ఆలయ చరిత్ర చెప్పడం గమనించవచ్చు.


ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే అనగా ఆలయ బస్ స్టాండ్ నుంచి 2 గంటల ప్రయాణం చేస్తే వైదేశ్వరన్ కోయిల్ వస్తుంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడ స్వామి వారు వైదుడిగా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామి దర్శించుకుంటే రోగాలు నయం అవుతాయి అని చెపుతారు. ఈ ఆలయంలో మారియొక్క ప్రత్యేకత కలదు. ఇక్కడ కోనేరు ఎల్లపుడూ పచ్చగానే కనిపిస్తుంది. మనలో చాలా మందికి తెలియని విశేషం జాతకం చెప్పడం ఈ ఆలయం నుంచే ప్రారంభం అయినది. అంతరాలయ దర్శనానికి ప్రత్యేక టికెట్ లు లేవు. చిదంబరం వెళ్ళినప్పడు చాలా మంది ఈ ఆలయం దర్శించకుండానే తిరుగు ప్రయాణం అవ్వుతారు. మీరు వెళ్ళినప్పడు తప్పకుండ ఈ ఆలయం కూడా దర్శించండి.

ఆలయ దర్శన సమయం :

తమిళనాడులో అని ఆలయాల దర్శన సమయం ఏ క్రింది విధముగా ఉంటుంది.

ఉదయం     : 7.00-12.00
సాయంత్రం : 4.00-8.30

వసతి సౌకర్యాలు :

ఆలయ ప్రవేశ ద్వారం నుంచి ప్రైవేట్ హోటల్ లు కలవు. ఇక్కడ అని 800 /- లేదా 1200/- సాధారణ రూమ్ లు ఉంటాయి.

ఆలయానికి చేరుకునే విధానం :

బస్ మార్గం :

ఈ ఆలయానికి కేవలం 1కి.మీ దూరంలోనే బస్ స్టాండ్ కలదు. బస్ స్టాండ్ నుంచి నడుచుకుంటూ ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి 5కి. మీ దూరంలో చిదంబర రైల్వే స్టేషన్ కలదు. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఆలయంనికి ఆటోలు 100/- తీసుకుంటారు.

విమాన మార్గం :

చెన్నై సమీప విమానాశ్రయం కలదు. అక్కడి నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

శ్రీ చిదంబర ఆలయం
చూడ్డలోరే
చిదంబర బస్ స్టాండ్ వద్ద,
తమిళనాడు.
పిన్ కోడ్ - 608001

key words : Sri chidambaram Temple Information, famous temples in Tamilnadu, Hindu Temples Guide. 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.