Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం | Alampur Navabrahma Temple History in Telugu


త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు సృష్టికర్త పేరుంది. ఈ భూ మండలం పై ఉన్న సకల ప్రతి జీవి పుట్టుకకు ఆయనే కారణం. అయితే ఆయనకు భారత దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీదా వేళ్లమీద లెక్కపెట్టగలిగిన దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ లోని పుష్కర్ లో మాత్రమే భారత దేశంలో బ్రహ్మకు చెప్పొకోదగ్గ దేవాలయం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కూడా బ్రహ్మకు దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మమనకు తొమ్మిది రూపాల్లో కనిపిస్తారు. ఇటువంటి దేవాలయం మరెక్కడా లేదు. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్జానం, సంపద మన సొంతమవుతుందని స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు. అంతే కాకుండా దురదృష్టం పోగొట్టి అదృష్టం కలుగజేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయం విశిష్టత, ఆ దేవాలయం ఎక్కడ ఉంది తదితర వివరాలన్నీ మీ కోసం...

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్‌కు దక్షిణ కాశీగా పేరుంది. హైదరాబాద్‌కు 200 కిమీలు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరానికి సుమారు 25 కిమీల దూరంలో తుంగభద్రా నది తీరంలో ఈ ప్రదేశం ఉంది. భారతదేశంలోని 18 శక్తి పీఠాల్లో ఒకటైన నవబ్రహ్మ ఆలయం ఇక్కడే ఉంది. దీన్ని ఏడో శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

ఇక్కడ బ్రహ్మ మొత్తం తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇలా బ్రహ్మ తొమ్మది వేర్వేరు రూపంలో ఉండటం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు.ఆ బ్రహ్మ పరమశివుడి గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెబుతారు. అందువల్లే ఈ పుణ్యక్షేత్రాన్ని పరమ పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ దేవాలయంతో పాటు శివుడికి కూడా గుడి ఉంది.  బాదామి చాళుక్యులు నిర్మించిన ఈ నవబ్రహ్మ ఆలయాలు... తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ పేర్లతో పిలువబడుతున్నాయి.

ఇక్కడి దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు నిలయం. అనేక పురాణ కథలను అద్భుతమైన శిల్పాలుగా మలిచిన తీరు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతుంది. ఇక్కడి శిల్ప కళ పై అధ్యయనం చేయడానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. అదే విధంగా ఇక్కడ శాసననాల పై నిత్యం అధ్యయనం జరుగుతూ ఉంటుంది.

అయితే మరో కథనం ప్రకారం
బ్రహ్మ తపస్సు చేయడంతో పాటు ఇక్కడ తొమ్మిది లింగాలను ప్రతిష్టించి పూజించాడని చెబుతారు. అవే బ్రహ్మ రూపంలో పూజించబడుతున్నాయని కూడా చెబుతారు. ఇక ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

జోగుళాంబదేవాలయం
ఆలంపూర్ లో నవబ్రహ్మ ఆలయంతో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబదేవాలయం కూడా ఉంది. హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని ప్రాంతాలను 'శక్తి పీఠాలు' అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతారు. కొంత మంది 18 అనీ, 51 అనీ, మరి కొందరైతే 52 అనీ, 108 అనీ ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరెన్ని చెప్పిన 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారన్నది సత్యం.

సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి.
వాటిలో ఒకటి తెలంగాణలో ప్రసిద్ది చెందినది. ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ -కర్నూల్ నుండి 27కిలోమీటర్ల దూరంలో తుంగ, భద్ర నదులు తుంగభద్రా నదిగా కలిసే ప్రదేశంలో ఉంది. జోగులాంబ దేవాలయం చాలా ప్రాచీన ఆలయం. సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ.

అలంపూర్ ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం అలంపూర్ కు 200 కి. మీ ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అలంపూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం అలంపూర్ లో జోగులాంబ హాల్ట్ (అలంపూర్ రోడ్డు) పేరుతో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు - హైదరాబాద్ రైల్వే లైన్ లో ఈ స్టేషన్ కలదు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల్ నుండి ప్యాసింజర్ రైళ్లు, కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు వస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం జాతీయ రహదారి అలంపూర్ గుండా వెళుతుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

Famous Books:





నవబ్రహ్మ ఆలయం, nava brahma temple alampur, nava brahma names, jogulamba temple, alampur jogulamba temple timings, papanasi temple alampur, virupaksha temple, durga temple aihole, lad khan temple, pattadakal temple, nava brahma temple history in telugu, nava brahma temple timings.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు