ఒక్క సారి దర్శిస్తే చాలు దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుంది | Alampur Navabrahma Temples


ఒక్క సారి సందర్శిస్తే చాలు దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుంది:
త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు సృష్టికర్త పేరుంది. ఈ భూ మండలం పై ఉన్న సకల ప్రతి జీవి పుట్టుకకు ఆయనే కారణం. అయితే ఆయనకు భారత దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీదా వేళ్లమీద లెక్కపెట్టగలిగిన దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ లోని పుష్కర్ లో మాత్రమే భారత దేశంలో బ్రహ్మకు చెప్పొకోదగ్గ దేవాలయం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కూడా బ్రహ్మకు దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మమనకు తొమ్మిది రూపాల్లో కనిపిస్తారు. ఇటువంటి దేవాలయం మరెక్కడా లేదు. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్జానం, సంపద మన సొంతమవుతుందని స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు. అంతే కాకుండా దురదృష్టం పోగొట్టి అదృష్టం కలుగజేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయం విశిష్టత, ఆ దేవాలయం ఎక్కడ ఉంది తదితర వివరాలన్నీ మీ కోసం...

ఇక్కడ బ్రహ్మ మొత్తం తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. 
ఇక్కడ బ్రహ్మ మొత్తం తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇలా బ్రహ్మ తొమ్మది వేర్వేరు రూపంలో ఉండటం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు.ఆ బ్రహ్మ పరమశివుడి గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెబుతారు. అందువల్లే ఈ పుణ్యక్షేత్రాన్ని పరమ పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ దేవాలయంతో పాటు శివుడికి కూడా గుడి ఉంది.

అనేక పురాణ కథలను అద్భుతమైన శిల్పాలుగా మలిచిన తీరు
బాలబ్రహ్మేశ్వర, విశ్వబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్థబ్రహ్, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, వీరబ్రహ్మ పేర్లతో భక్తులకు బ్రహ్మ దేవుడు దర్శనమిస్తాడు.ఇక్కడి దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు నిలయం. అనేక పురాణ కథలను అద్భుతమైన శిల్పాలుగా మలిచిన తీరు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతుంది. ఇక్కడి శిల్ప కళ పై అధ్యయనం చేయడానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. అదే విధంగా ఇక్కడ శాసననాల పై నిత్యం అధ్యయనం జరుగుతూ ఉంటుంది.
Also Read : ఏడాదిలో 4 నెలలే దర్శనం 7 నదులు కలిసే అద్భుత ఆలయం 
అయితే మరో కథనం ప్రకారం 
బ్రహ్మ తపస్సు చేయడంతో పాటు ఇక్కడ తొమ్మిది లింగాలను ప్రతిష్టించి పూజించాడని చెబుతారు. అవే బ్రహ్మ రూపంలో పూజించబడుతున్నాయని కూడా చెబుతారు. ఇక ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

జోగుళాంబదేవాలయం 
ఆలంపూర్ లో నవబ్రహ్మ ఆలయంతో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబదేవాలయం కూడా ఉంది. హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని ప్రాంతాలను 'శక్తి పీఠాలు' అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతారు. కొంత మంది 18 అనీ, 51 అనీ, మరి కొందరైతే 52 అనీ, 108 అనీ ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరెన్ని చెప్పిన 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారన్నది సత్యం.

సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. 
వాటిలో ఒకటి తెలంగాణలో ప్రసిద్ది చెందినది. ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ -కర్నూల్ నుండి 27కిలోమీటర్ల దూరంలో తుంగ, భద్ర నదులు తుంగభద్రా నదిగా కలిసే ప్రదేశంలో ఉంది. జోగులాంబ దేవాలయం చాలా ప్రాచీన ఆలయం. సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ.
Also Read : లాఫింగ్ బుద్దా విగ్రహం పెడితే ఏం ఫలితం ఉంటుంది.
జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయదిశగా 
జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయదిశగా నెలకొని ఉంది. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం ఉంది. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం.
Also Read : ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మిదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది
జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు.

అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. బాలబ్రహ్మేశ్వర స్వామి ప్రధాన దైవంగా నవబ్రహ్మాలయాలు నెలకొన్ని ఉన్న పుణ్యక్షేత్రం ఆలంపురం, శిల్పరిత్యా, చరిత్ర రీత్యా పౌరాణిక రిత్యా కూడా ఇది ఒక పవిత్ర క్షేత్రం. ఉత్తర వాహినియై ప్రవహిస్తున్న తుంగభద్రా తీరంలో వెలసిన ఈ క్షేత్రానికి మరొక ప్రశస్తి ఉంది. భారత దేశంలో అత్యంత పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమే ఆలంపురం.
Also Read : స్త్రీల మంగళసూత్రం లో పిన్నీసులు ఉంచుతున్నారా ?
అలంపూర్ ఎలా చేరుకోవాలి ? 
విమాన మార్గం అలంపూర్ కు 200 కి. మీ ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అలంపూర్ చేరుకోవచ్చు. రైలు మార్గం అలంపూర్ లో జోగులాంబ హాల్ట్ (అలంపూర్ రోడ్డు) పేరుతో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు - హైదరాబాద్ రైల్వే లైన్ లో ఈ స్టేషన్ కలదు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల్ నుండి ప్యాసింజర్ రైళ్లు, కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు వస్తుంటాయి. బస్సు / రోడ్డు మార్గం జాతీయ రహదారి అలంపూర్ గుండా వెళుతుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.
Alampur Navabrahma Temple:
Jogulamba Gadwal district, Telangana, 

Famous Temples :
పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

బ్రహ్మ, నవ బ్రహ్మ ఆలయం, Alampur Navabrahma Temples, Alampur, nava brahma names, nava brahma names in telugu, jogulamba temple, alampur jogulamba temple timings, papanasi temple alampur, swarga brahma temple alampur, virupaksha temple, lad khan temple, nava brahma temple timings, telangana,

1 Comments

  1. First visit Lord shiva then jogulamba. Very powful temple all 25 Shivalingas have Bhrma Sutra symbols in that 3 are Emrold stone(Marakatam), the only one temple in World...Small railway station no facility,autos are avail, Bustand is there, 30km distance to Karnool & last bus is 5pm ...Tourism lodges also available ....better to carry yiur own pooja bilva patra to do Shivapooja....

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS