Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత | How to do Friday Pooja at Home in Telugu

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత:
నోములన్నింటిలోకి 'శుక్రవారాల నోము'కి ఎంతో ప్రాధాన్యత ... ప్రాముఖ్యత వున్నాయి. ఈ నోము నోచుకునే వారు ఉదయాన్నే స్నానంచేసి, తులసి కోట దగ్గర దీపారాధన చేసి 20 ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజున ఎవరింటికి గానీ, ఏ వూరికి గాని వెళ్లకూడదు. ప్రతి శుక్ర వారం కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటూ, 20 వారాల పాటు ఈ నోమును కొనసాగించాలి. ఆ తరువాత 'లక్ష్మీ తులసి' దగ్గర 20 దీపాలు పెట్టి, 20 మంది ముత్తయిదువులకు బొబ్బర్లు వాయన దానమివ్వాలి. అలాగే ఒక బ్రాహ్మణుడికి నూతన వస్త్రాలను ... దక్షిణ తాంబూలాలతో సహా దానమివ్వాలి.

ఇక ఈ నోము నోచుకోవడానికి కారణమైన కథ ఒకటి ప్రచారంలో వుంది. పెళ్లయిన కొత్తలో ఓ యువతి పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకు వెళ్లడానికి వచ్చిన భర్త, ఉన్న పళంగా బయల్దేరమంటూ తొందర పెట్టాడు. ఆ రోజున శుక్రవారం కావడం వలన, అమ్మాయిని పంపించడం ఆనవాయతీ కాదంటూ అత్తామామలు అడ్డుపడ్డారు. అయినా అతను వినిపించుకోకుండా, తన భార్యను తీసుకుని ఎద్దుల బండిలో బయలుదేరాడు.

ఈ విషయంగా ఆ దంపతులిద్దరూ బండిలో గొడవపడుతూనే వున్నారు. అప్పటికే బాగా పోద్దుపోవడంతో ఒక ఊళ్లో ఆగిపోయి, ఓ పెద్ద మనిషి ఇంట్లో ఆశ్రయం పొందారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ల ధోరణిని ఆ పెద్దమనిషి గమనిస్తూనే వున్నాడు. మరునాడు ఉదయం వాళ్లిద్దరూ బయలుదేరుతుండగా, ఆ పెద్దమనిషి బండి దగ్గరికి వచ్చాడు. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానమనీ, అందువలన వాళ్లు కంట తడి పెట్టకుండా చూసుకోవాలని ఆ యువతి భర్తతో చెప్పాడు. ఆడపిల్ల పుట్టింటిని వదిలి పెట్టేటప్పుడు సహజంగానే కన్నీళ్లు పెట్టుకుంటుందనీ, అందువల్లనే ఆమెను శుక్రవారం తీసుకెళ్లకూడదని అన్నాడు.

ఈ విధంగా చేయడం ఇటు పుట్టింటి వారికి ... అటు అత్తింటి వారికి మంచిది కాదని చెప్పాడు. పెద్దలమాట కాదన్నందువలన కలహాలు ఏర్పడతాయనీ, శుక్రవారం బయలుదేరడం వల్లనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చెప్పాడు. ఇంటికి వెళ్లిన తరువాత శుక్రవారపు నోము నోచుకోమనీ, ఫలితంగా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నాడు. అంతలో ఆయన భార్య కూడా వచ్చి ఆ నోము విధి విధానాలను గురించి చెప్పింది. దాంతో ఆ యువతి ఇటు పుట్టింటి వారి కోసం ... అటు అత్తింటి వారి కోసం శుక్రవారాల నోము నోచి ఉత్తమమైన ఫలితాలను పొందింది.
Famous Books:l










శుక్రవారాల నోము, friday pooja in telugu, sampada sukravaram pooja vidhanam in telugu, sukravaram pooja ela cheyali, sukravaram in telugu, how to do friday pooja at home in kannada, friday lakshmi pooja in tamil, lakshmi puja, friday pooja vidhanam.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు