Drop Down Menus

శనేశ్వరుడు శనివారాల నోము | How to Worship Shani dev on Saturday

శనేశ్వరుడు శనివారాల నోము :
శని ... అనే పేరు వినగానే ఎంతటి వారైనా భయపడిపోతారు. ఎలాగో అలా ఆయనను పూజించి, ఆయన కల్పించే చిక్కుల్లోంచి బయటపడిపోవాలని అనుకుంటారు. సాక్షాత్తు ఈశ్వరుడినే తిప్పలు పెట్టిన శనేశ్వరుడు, విక్రమార్క మహారాజును కూడా నానాఅవస్తలు పెట్టాడు. తనకి ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల పాటు పట్టనున్నదని తెలుసుకున్న విక్రమార్కుడు, శనేశ్వరుడి కోసం తపస్సు చేశాడు.

ఆయన అభ్యర్ధనను మన్నించిన శనేశ్వరుడు, ఏడున్నర సంవత్సరాల కాలం అనే లెక్కను తగ్గించుకుని ఏడున్నర ఘడియల పాటు మాత్రం తన బారిన పడక తప్పదని చెప్పాడు. దాంతో ఆ ఏడున్నర ఘడియలు అడవిలో గడపడం మంచిదని భావించి మారు వేషంలో విక్రమార్క మహారాజు అక్కడికి వెళ్లాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక దొంగ కోసం గాలిస్తోన్న మరో రాజ్యపు రక్షక భటులకు విక్రమార్కుడి దగ్గరలోనే నగలమూట కనిపించింది. దాంతో వాళ్లు విక్రమార్కుడిని తీసుకు వెళ్లి తమ రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు.
ఆ రాజు విక్రమార్కుడికి ఉరిశిక్షను అమలు చేయమని ఆదేశించాడు. అప్పటికే ఏడు ఘడియలు కావడంతో, అరఘడియ సేపు ఆగిన తరువాత తనకి ఆ శిక్ష అమలు పరచమని విక్రమార్కుడు ఆ రాజును వేడుకున్నాడు. అతని మాట తీరు ... ప్రవర్తన చూసిన రాజు అందుకు అంగీకరించాడు. సరిగా అరఘడియ దాటగానే అసలు దొంగ దొరికాడంటూ, రక్షక భటులు ఓ వ్యక్తిని అక్కడికి తీసుకువచ్చారు.

దాంతో విక్రమార్కుడు తన వేషం తీసేశాడు. అందరూ ఆశ్చర్య పోతూ ఆయనకి మర్యాద పూర్వకంగా నమస్కరించారు. ముందుగానే ఆ సంగతి చెప్పవచ్చు గదా అని అడిగారు. శని ప్రభావం ఉన్నప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదంటూ, తన రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రతి శనివారం శనికి - ఈశ్వరుడికి అభిషేకాలు ...
పూజలు చేస్తూ చిమ్మిలి నైవేద్యంగా పెట్టాడు. ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ వచ్చాడు. అలా 19 సంవత్సరాలు చేసి ... ఒక మట్టి మూకుడులో నువ్వుల నూనె పోసి దానిని వెలిగించి, నువ్వులు - బెల్లంతో సహా ఒక నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చి మహా ఉద్యాపన కార్యక్రమాన్ని పూర్తి చేశాడు.
Famous Books:
శ్రీమహాభాగవతము | Bhagavatham Volume 1 Telugu PDF Book







శనివారాల నోము, ఏడు శనివారాల వ్రతం, saturday saneeswaran pooja, how to worship shani dev on saturday, shani pooja items, shani dev favourite food, how to remove shani effect, shani dev favourite colour, shani dev mantra, shani tailabhishekam procedure in telugu, shani good effects
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.