హనుమ నామస్మరణం…సర్వపాప నివారణం:
భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయస్వామి అనాధి నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది. హనుమంతుడు సహవేనుడు. గొప్ప రామభక్తుడు.
అతి శక్తి వంతమైన రామనామం స్మరణ తోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచి పోయాడు. వీరత్వానికి ప్రతిక అయిన హనుమను ప్రతి రోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం, సుఖశాంతులు లభిసా ్తయని తులసీదాసు తాను రాసిన శ్రీహనుమాన్ చాలీసాలో చెప్పాడు.
ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజి స్తాడు. హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది. రావణ కథానంతరం అయోధ్యలో శ్రీసీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగు తాడు. అప్పుడు హనుమ రామచంద్ర ప్రభూ, నాహృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచి పోవాలని, అదేవిధంగా ప్రతిక్షణం రామనామ స్మరణ తప్ప వేరే ధ్యాస తనకు కలగరాదని రామా! నీ నామస్మరణతోనే నా ఈ జన్మ పునీతం కావాలని అంత కన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామా! ప్రతిక్షణం నాలుకపై నీ నామ స్మరణ ఉండేలా కోరుకుంటున్నాను నాయీ కోరికను తీర్చమని హనుమ రాముడిని వేడుకుంటాడు. అందుకు రామచంద్రుడు తదాస్తు అని అంటాడు.
సీతా మాతకూడ తనకు అత్యంత ప్రేమ పాత్రుడగు హనుమను చూసి హనుమా నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరం ఇచ్చి ఆశీర్వదిస్తుంది. దేశంలోని ప్రతి పల్లెలో రామయణం ఉన్నట్లుగానే, ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది. హనుమ ఉన్న ఊరు నిత్యకల్యాణం పచ్చతోర ణంగా శోభిల్లుతుంది. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం క్రమం తప్ప కుండా ఎవరు భక్తితో చదువుతారో వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడ తాడు. ప్రతి రోజూ హనుమను సేవించడం వల్ల మనకు రోగ బాధలు. భూతప్రేత పిశాచ బాధలు తొలగు తాయి.
ప్రతి ఇంట్లో తప్ప నిసరిగా హనుమ ఫొటోను పెట్టుకోవాలి. ఆ పటానికి నిత్యం పూజలు చెయ్యాలి. ముఖ్యంగా విద్యా ర్థినీ విద్యా ర్థులు ప్రతి రోజూ హను మను భక్తితో పూ జిస్తే వారిలో ఆత్మస్థైర్యం ఆత్మ విశ్వాసం పెరుగు తుంది. చదువు లలో, ఆట పాటల్లో గొప్పగా రాణిస్తారు. ప్రతి మంగళ వారం, ఆంజనేయ స్వామి దేవాల యానికి వెళ్లి, అక్కడ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యివేసి దీపం వెలిగిస్తే చాలు మనలో ఉన్న కోరికలన్నీ తప్పక నెరువేరుతాయి.
హనుమదా లయాలలో హనుమం తుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపి స్తాయి. ప్రసన్నాంజ నేయుడు, వీరాంజ నేయుడు, అభయాం జనేయుడు, పంచ ముఖాం జనేయుడు ఇలా అనేక రూపాలతో మనకు దర్శనం ఇస్తాడు. హను మను భక్తితో మనం స్మరిస్తే బుద్ధి బలం, యశస్సు, ధైర్యం, నిర్భయ త్వం మనలో పెరుగుతుంది. హనుమంతుడు మహాజ్ఞాని, దివ్యా కరణ పండి తుడు స్వయంగా సీతారామ స్త్రోత్తాన్ని రచించి వారి వలన తత్త్వ జ్ఞానోపదేశం పొం దాడు. ప్రతి ఒక్కరూ క్రమం తప్ప కుండా పదకొండు రోజులు గాని, ఇరవై ఒక్క రోజుగాని సుందరా కాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటాము. మానసిక పరమైన ఆనం దం కలుగుతుంది. ఆంజనేయస్వామి ఉపాసన చేయడం వలన మనసు ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే చాలు ఆ ఇల్లు సుఖ సంతోషా లతో కళకళ లాడుతుంది.
Famous Books:
ఆంజనేయ స్వామి, hanuman, hanuman storys telugu, hanuman history, hanuman stotram, sri rama, hanuman meaning,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment