Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

గోరింటాకు పెట్టుకుంటే కష్టాలుండవట | సీతమ్మ ఇచ్చిన వరమే కారణమట | Significance of Gorintaku

శుక్రవారం చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే.. కష్టాలుండవట.. సీతమ్మ ఇచ్చిన వరమే కారణమట..
చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతుంటారు. చిన్న చిన్న ఫంక్షన్లైనా పెద్ద పెద్ద వేడుకలైనా గోరింటాకు లేకుండా జరుగదు. 
ప్రస్తుతం గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా.. మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పెళ్ళిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అలాంటి గోరింటాకు ఎందుకంత ప్రాశస్త్యమైందంటే..? 

గోరింటాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తున్నాయి. రావణుడిని సంహరించి.. రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు.. ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అప్పుడు సీతాదేవి రాముని వద్ద.. అశోకవనంలో తానుంతకాలం .. ప్రతి రోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది. ఈ గోరింటాకు చెట్టుకు తాము ఏదైనా చేయాలని కోరింది. 
ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది. అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కళకళలాడుతుందో.. సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి.. గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో.. వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో.. వారికి సకలసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది. అందుకే ఇప్పటివరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతోంది.
ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధూవరులకు.. వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుందని విశ్వాసం. అందుకే శుక్రవారం పూట గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే.. మహిళలకు ఎలాంటి కష్టాలుండవని.. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.
Famous Posts:
పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

gorintaku importance, ashadam gorintaku quotes, gorintaku special, ashadam gorintaku designs, scientific reason for gorintaku, ashada masam gorintaku images, scientific reason behind gorintaku, gorintaku history in telugu, ashada masam 2020, seethamma, gorintaku special,

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు