Drop Down Menus

ఈ పోస్ట్ చాల ముఖ్యమైనది దయచేసి అందరూ చదివి తప్పకుండా పిల్లలకు అలవాటు చేయండి | Hindu Temple Guide

ఈ పోస్ట్ చాల ముఖ్యమైనది దయచేసి అందరూ చదివి తప్పకుండా పిల్లలకు అలవాటు చేయండి.
ఎడమ వైపు నిద్ర పోవడం.
భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందువలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది.
ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి.

రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం 2 గంటల తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్ , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది.
పడుకునే విధానం :-
ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి .
దీనిని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు .
మన శరీరంలో సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .
మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .
ప్రయోజనాలు ( Benefits ) :-
1 . గురక తగ్గి పోవును .
2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .
3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .
4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .
5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .
6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .
7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి.
8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .
9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .
10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .
11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .
12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .
13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .
14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .
15 . ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి.
ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు. కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును .
ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .
మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.
గమనిక : -
తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .
ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది ..
Famous Posts:
> తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

విచిత్ర వినాయక  దేవాలయము ఓ అద్భుతమైన దేవాలయం ఉంది

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


importance post, what is the importance of posting in accounting, why consistency is important on social media, facebook posting, how many posts on facebook a day, facebook posting strategy, over posting on social media, facebook algorithm post frequency, divots, Hindu, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments