మన పూర్వీకులు ప్రకృతిలోని ప్రతీ దానిలో దైవతారూపాలను దర్శించారు. ఆయా కార్యాక్రమాలను ప్రారంభించే సమయంలో ఆయా అధిష్టాన దేవతలను ఆరాధిస్తే చాలు తప్పక ఆ పనులలో విజయం సొంతం అవుతుంది.
ఈ ప్రకృతిని కనిపించని ఒక అదృశ్య శక్తి నడిపిస్తున్నదనేది అందరి నమ్మకం. ఆ శక్తే దేవుడు అని మనం విశ్వసిస్తాం. అయితే ముఖ్యంగా గ్రీష్మ రుతువు పోయి వర్షరుతువు రాకకు సిద్దమవుతున్న ఈ ఆషాఢ, శ్రావణమాసాలు రైతులకు చాలా కీలకం. ఈ మాసాలలో వ్యవసాయ పనులు ఆరంభమవుతాయి. ఆయా ప్రాంతాలలో ఆయా రూపాల దేవతలను పూజించి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. అయితే పూర్వకాలం నుంచి పురాణాల ప్రకారం సస్యశామలం కావడానికి భూమాత రూపమైన వారాహీ దేవతను పూజించడం ఆనవాయితీగా ఉంది.
వారాహీ అనుగ్రహం ఉంటే తప్పక పంటలు విరివిగా పండి అంతా బాగుంటుంది. ఈ తల్లి పూజల గురించి తెలుసుకుందాం.
షాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు.
షాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు.
శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.
వారాహి దేవి లలితా పరాభట్టారిక సేనాని..లలిత రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు… ఈ విషయం లలితా సహస్రనామాలలో కూడా వస్తుంది. చండీసప్తశతిలో ఉంది. లలితా పరమేశ్వరి ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి.

లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది. దానిపేరు కిరి చక్రం.ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, దేవవైధ్యులైన అశ్విని దేవతలు.
వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, వాడిని సంహరించి, భూదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది.
కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూ తగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.
మంత్రం: ఓం హ్రీం వారాహీ హరి ఓం
మంత్రం: ఓం హ్రీం వారాహీ హరి ఓం
Famous Posts:
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
> సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం
> భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు
> ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ
> దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?
> ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు
వారాహీ, వారాహి మంత్రం, వారాహి దేవి, వారాహి దేవత, varahi devi pooja in telugu, varahi deepam, varahi amman miracles, varahi upasana book pdf, simple varahi mantra, benefits of worshipping varahi, varahi amman favourite food, om hreem namo varahi, varahi pooja vidhanam telugu

ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment