Drop Down Menus

కరోనా సోకకుండా ఈ టిప్స్ పాటించండి | Advice for the Public | Health Tips | Hindu Temple Guide

కరోనా పరిస్థితుల్లోనూ సాధారణంగా జీవించాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన పది టిప్స్ ఏంటో చూద్దాం..

ఇంట్లో నుంచి బయటకు రండి:
ఇంట్లో సరైన వెంటిలేషన్ లేకపోతే గాలి సరఫరా సరిగా ఉండదు. అలాగే సామాజిక దూరం పాటించడం కుదరకపోవచ్చు. అందుకే బయట కన్నా ఇంట్లోనే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతగా ఇంట్లో కాకుండా ఇంటి ఆవరణలో ఉండేందుకు ప్రయత్నించండి.

సూర్యరశ్మిలో నిలబడండి:
ఉదయాన్నే సూర్యరశ్మిలో నిలబడితే డి విటమిన్ వస్తుందని చిన్నప్పుడే నేర్చుకున్నాం. మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో డి విటమిన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు. అయితే సూర్యుడి కిరణాలు కరోనా వైరస్ చర్యను స్తంభింపజేస్తుందని ది జర్నల్ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ పేర్కొంది. అంటే సూర్యరశ్మిలో నిలబడటం వల్ల రెండు లాభాలున్నాయన్నమాట.
Also Readకరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు

ఏసీని వాడొద్దు:
నోటి తుప్పర్ల ద్వారా బయటకు వచ్చే కరోనా వైరస్ గాలిలో కొంత సమయం ఉంటుంది. ఆ గాలిని ఎవరైనా పీల్చుకుంటే వారికి కరోనా సోకే ప్రమాదముంది. ముఖ్యంగా ఏసీ ద్వారా వచ్చే గాలి వేగంగా కదులుతుంది. దీంతో కరోనా వైరస్ ఒకరి నుంచి మరోకరి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీలైనంత వరకు ఏసీలను ఉపయోగించడం మానుకోండి.

మాస్క్ ధరించండి:
కరోనా ప్రబలిన నాటి నుంచి చెబుతున్న విషయమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని మనం కరోనా నుంచి రక్షించుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలి. అలా అని 24/7 పెట్టుకోవద్దు. చుట్టుపక్కల ఎవరూ లేని.. కరోనా సోకే అవకాశం లేని ప్రాంతంలో మాస్కులు తీసేయండి. ఎక్కువ సేపు మాస్క్ ధరిస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.

కారు విండోస్ తెరిచే ఉంచండి:
కారులో ప్రయాణిస్తున్నప్పుడు విండోస్ తెరిచే ఉంచండి. బయటకు వెళ్తున్నామని మాస్క్ పెట్టుకోగానే సరిపోదు. కారు విండోస్ మూసి ఉంచితే గాలి సరఫరా ఉండదు. ఏసీతోనూ ప్రమాదముంది. కాబట్టి కారు విండోస్ తెరిచే ఉంచండి.

వీలైతే కళ్లద్దాలు లేదా ఫేస్ షీల్డ్ పెట్టుకోండి:
కరోనా వైరస్ మన వరకు ఎలా వచ్చినా.. నోరు, ముక్కు, కళ్ల ద్వారానే శరీరంలోకి చేరుతుంది. కాబట్టి చేతులను శుభ్రం చేసుకోకుండా వాటిని తాకేందుకు ప్రయత్నించకండి. మన ప్రమేయం లేకుండా మన చేతులు ఆ అవయవాలను తాకుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని నివారించేందుకు కళ్లకు అద్దాలు పెట్టుకోవడం లేదా ముఖానికి ఫేస్ షీల్డ్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. కచ్చితమైన నిబంధన అయితే కాదు.. కానీ సురక్షితంగా ఉండాలంటే తప్పదు మరి.
Also Read : కరోనా పాజిటివ్ వ్యక్తులకు  అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే

విమాన ప్రయాణం కొన్నాళ్లు మానుకోండి:
కరోనా వచ్చిన నాటి నుంచి దేశాలన్నీ విమాన సర్వీసులను మూసివేశాయి. ప్రస్తుతం విమాన ప్రయాణాలకు వెసులుబాటు కల్పించారు. దీంతో చాలా మంది విమానమెక్కేస్తున్నారు. పరిచయం లేని వారు ఎవరెవరో పక్కన కూర్చుంటారు. తుమ్మినా, దగ్గినా అనుమానించాల్సి ఉంటుంది. ఒకవేళ వారికి కరోనా సోకి ఉంటే మీకు వ్యాపించే అవకాశం అధికంగా ఉంటుంది. అలాంటి తలనొప్పులు ఏవి ఉండొద్దనుకుంటే కొన్నాళ్లపాటు విమాన ప్రయాణాలు చేయకండి.

ఆహారం పంచుకోవద్దు:
ఇప్పుడు ఉద్యోగులందరూ ఆఫీసులకు వెళ్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే లంచ్ టైంలో అందరూ కలిసి తింటూ వంటకాలను పంచుకునేవారు. కానీ ఇప్పుడు అలా చేయకండి. మీ ఆహారం ఇతరులతో పంచుకోకుండా ఉండటమే ఉత్తమం. చాలా మందిలో కరోనా వైరస్ ఉన్నా లక్షణాలు తెలియట్లేదు. మీ సహోద్యోగుల్లో ఎవరికైనా ఉన్నా.. మీకే ఉన్నా ఆహారం పంచుకునే క్రమంలో వైరస్ వ్యాప్తి చెందొచ్చు.

చేతుల్ని శుభ్రంగా కడగాలి:
చేతులను శుభ్రంగా కడగడం పరిశుభ్రతలో తొలి నియమం. ఇది వరకు చేతులు కడగకపోయినా పర్వాలేదులే అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఏది ముట్టుకున్నా.. పట్టుకున్నా ఆ తర్వాత చేతుల్ని శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాల్సిందే. లేకపోతే చేతులపై ఉండే కరోనా వైరస్ మన ముక్కు, నోరు, కళ్ల ద్వారా శరీరంలోకి వెళ్లే ప్రమాదముంది.
Also Readప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?

భౌతిక దూరం కొనసాగించండి:
ఒకరి నుంచి మరొకరి కరోనా సోకకుండా ఉండాలంటే కనీసం ఆరు అడుగులు భౌతిక దూరం పాటించాలని డబ్ల్యూహెచ్ వో నుంచి వైద్య నిపుణుల వరకు అందరూ చెప్పారు. కరోనాను కట్టడి చేయాలంటే ఇంత కంటే ఇప్పట్లో మరో మార్గం కూడా లేదు. వ్యాక్సిన్ ఔషధాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు సామాజిక దూరాన్ని పాటిస్తుండటమే మేలు.
Related Posts:

చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు

ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?

నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు

నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.

నీటి ఆవిరితో కరోనా మాయం

Corona, Covie-19, Coronavirus, coronavirus symptoms, how does coronavirus spread, what is coronavirus, cdc coronavirus, coronavirus news, coronavirus map
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.