ప్రజలు తమ బాధలు తట్టుకోలేని ప్రతిసారీ ఆ భగవంతుని తల్చుకోవడం నైజం. దైవకృపతో ఆ బాధలు తీరిపోతాయని వారి నమ్మకం. కానీ దేవుడు వస్తే కానీ తీరని బాధలు కలిగితే.... సాక్షాత్తు ఆ దైవమే కిందకి దిగిరాక తప్పదు. అలా ‘కిందకి దిగడం’ అన్న మాటను అవతరించడం అంటారు. అలా విష్ణుమూర్తి మానవాళిని రక్షించేందుకు తొమ్మిది అవతారాలు ఎత్తినట్లు చెబుతారు. వాటిలో ఐదవది వామనావతారం.
వామనుడు శ్రీమహావిష్ణువు అయిదో అవతారం. రాక్షసకులంలో పుట్టిన బలి గొప్ప విష్ణుభక్తుడు. ఆ గర్వంతో స్వర్గం మీదికి దండెత్తి ఇంద్రుణ్ని జయించి, స్వర్గాధిపతి అయ్యాడు. దేవతలను, మునులను హింసించసాగాడు. దేవతల తల్లి అదితి శ్రీహరిని ప్రార్థించింది. స్వామి అనుగ్రహించి, తగిన సమయంలో నేను బిడ్డగా జన్మించి, నీ కష్టాలు తొలగిస్తాను అని వాగ్దానం చేశాడు. ఫలితంగా అదితికి వామనుడిగా జన్మించాడు. లోకకల్యాణార్థం అవతరించిన వామనుడికి ఉపనయన సంస్కారాలు జరిగాయి. బ్రహ్మ తేజస్సుతో వెలిగే వటుడు వామనుడు దండం, గొడుగు, కమండలం తీసుకుని, నర్మదా నదీ తీరాన భృగుకచ్ఛ అనే ప్రదేశంలో అశ్వమేధయాగం చేస్తున్న బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు.
Also Read : స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
వామనమూర్తిని బలి స్వాగతించి, సత్కరించి, అంజలిబద్ధుడై, ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. కేవలం మూడు అడుగుల నేల ఇస్తే నాకు చాలు అన్నాడు వామనుడు. నేను త్రిలోకాధిపతిని. మీ కోరిక నాకు తగినట్టు గొప్పదిగా ఉండాలి అన్నాడు బలి. అందుకు వామనుడు- నేను బ్రహ్మచారిని. నీ సంపదను నేనేం చేసుకోను? నా ఇంద్రియాలన్నీ నా వశంలోనే ఉన్నాయి. మూడు అడుగుల భూమి చాలు నాకు అన్నాడు మళ్లీ. వామనుడి ఆంతర్యం గ్రహించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు. నీ రాజ్యాన్ని, జీవితాన్ని హరించి నిన్ను అథఃపాతాళానికి తొక్కివేయడానికి వచ్చాడు. అతడి కోరికను అంగీకరించకు అని ఎంతగా హెచ్చరించినా, బలి వినలేదు. ఆడిన మాట తప్పనన్నాడు. దానం చేసేందుకు, నీరు వదలడానికి కమండలం అందుకున్నాడు. చివరి ప్రయత్నంగా శుక్రుడు శిష్యుణ్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఓ పురుగు రూపంలో ఉదకం విడిచే చెంబు కొమ్ముకు అడ్డుపడ్డాడు. శ్రీహరి దర్భపుల్లతో కొమ్ములో పొడిచాడు. దాంతో శుక్రాచార్యుడి కన్ను పోయింది. బలి ఉదకాన్ని వామనుడి చేతిలో విడిచి దానం పూర్తి చేశాడు.
అనంతుడైన శ్రీహరి తన వామన రూపాన్ని విస్తరించి విశ్వరూపుడయ్యాడు. ఆ త్రివిక్రమ భగవానుడు ఒక పాదంతో భూమిని, రెండో పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడో అడుగు బలి శిరస్సు మీద ఉంచి, రసాతలానికి అణగదొక్కాడు. బలి సమర్పణ భావానికి, దానశీలతకు సంతోషించిన శ్రీహరి- బలిని సుతల లోక రాజ్యానికి అధిపతిని చేశాడు. సాపర్ణి మనువు కాలంలో దేవేంద్రుడవవుతావని బలికి వరం ఇచ్చాడు.
Also Read : మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
వామన ద్వాదశి ముందు రోజు ఏకాదశినాడు ఉపవసించి, జాగారం చేసి, వామన విగ్రహాన్ని పూజిస్తారు. శుక్ర ద్వాదశి, వామన ద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహా ద్వాదశి, అనంత ద్వాదశి, కల్కి ద్వాదశి అన్న పేర్లూ ఈ పర్వదినానికున్నాయి. ఎదుటివారిని అహంకారంతో చులకనగా చూసే దుష్టులకు తగిన గుణపాఠం నేర్పి, వారికి సక్రమ మార్గ నిర్దేశం చేయడమే వామనావతార రహస్యం.
మూడు అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. కంచిలో ఉన్న ‘ఉళగలంద పెరుమాళ్’ ఆలయం, ఖజరుహోలో ఉన్న ‘వామన’ ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి.
Also Read : ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
బలి గమ్యం లేని శక్తికి ప్రతీక, వామనుడు లక్ష్యం ఉన్న జ్ఞానానికి సూచన. వామనుడు కోరిన మూడు అడుగులకు కూడా చాలా అర్థాలే చెబుతారు. సత్వరజోతమోగుణాలనీ, సృష్టిస్థితిలయలనీ సూచిస్తాయని అంటారు. ఇక తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయడమే! వామన జయంతి సందర్భంగా ఆ విష్ణుమూర్తని కొలిచినవారు కూడా ఆ అహంకారాన్ని జయించి, ఈత బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు.
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శనేశ్వరుడు శనివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> శివదేవుని సోమవారపు నోము కథ
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
వామనజయంతి, vamana jayanti 2021, vamana jayanti 2020 date, vamana jayanti 2021 date, vamana dwadashi, vamana jayanti wikipedia, vamana jayanti importance, vamana stotram telugu,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment