నిద్రపట్టకపోవడానికి ఇవే కారణాలు | Sleeping Problems and Solutions | Health Tips | Hindu Temple Guide
Also Read : చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
ఒకప్పుడు ప్రజలు చీకటి పడగానే తినేసి హాయిగా నిద్రపోయేవారు. కానీ, కాలంతోపాటు నిద్రపోయే సమయం మారిపోయింది. ఆధునిక నైట్ కల్చర్, వృత్తులు, అలవాట్ల కారణంగా ఇప్పుడు చాలా మందికి అర్ధరాత్రి 12 దాటినా నిద్రపట్టట్లేదు. ఒకవేళ నిద్ర పట్టినా కొన్నిసార్లు హఠాత్తుగా మెలుకువ వచ్చేస్తోంది. దీంతో ప్రశాంతమైన నిద్ర కరవవుతోంది. ఈ కరోనా సంక్షోభంలో ఈ సమస్య మరింత పెరిగింది. అయితే ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణాలేంటని కొందరు పరిశోధకులు సర్వే నిర్వహించారు. 22 దేశాల నుంచి 69వేల మందిపై సర్వే నిర్వహిస్తే ముఖ్యంగా ఏడు కారణాలు ఉన్నాయని తేలింది. అవేంటో చూద్దాం.
చాలా మందికి నిద్రపోయే సమయంలో ఒంటరితనం వెంటాడుతోందట. దాని వల్లే నిద్రరావట్లేదని 54శాతం మంది సర్వేలో చెప్పారు. 18-24 ఏళ్లు ఉన్న వారిలో 38శాతం మంది ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారట. 65 ఏళ్లు పైబడిన ఒక శాతం మంది మాత్రమే ఒంటరితనం వల్ల నిద్రరావట్లేదని తెలిపారు.
ఇంట్లో.. ఆఫీసుల్లో చాలా మంది కాఫీ, టీ తాగుతుంటారు. పగటిపూట నిద్ర మత్తు ఉన్నప్పుడు వీటిని ఎక్కువగా తాగుతారు. వాటిలో ఉండే కెఫీన్ మనిషి నిద్రమత్తును పోగొట్టి ఉత్తేజంగా మారుస్తుంది. ఆ తాత్కాలికంగా నిద్రమత్తును వదిలించుకోవడం కోసం తీసుకునే కెఫీన్ నిద్రపోయే సమయంపై కూడా ప్రభావం చూపుతుంది. 54.4శాతం మంది కాఫీ కారణంగా నిద్రపట్టట్లేదని చెప్పారట. కాబట్టి పడుకునే ముందు కాఫీ వంటివి తాగకండి.
Also Read : నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా..?
సాధారణంగానే ఆర్థిక పరిస్థితులు మనిషికి మానసిక ఒత్తిళ్లను తెచ్చిపెడతాయి. ఇక ఈ కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో అనేక మంది ఉపాధి లేక, ఉద్యోగాలు కోల్పోయి కుటుంబ పోషణ ఎలా అన్న విషయంపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో వారికి నిద్రే కరవవుతోంది. 49.8శాతం మంది ప్రజలు ఆర్థిక ఒత్తిళ్ల వల్లే నిద్ర పట్టట్లేదని ఈ సర్వేలో వాపోయారు. 25-45 ఏళ్ల మధ్య వయస్కులు ఉద్యోగ భద్రత, ఆర్థిక కష్టాలే నిద్రపట్టకపోవడానికి ప్రథమ కారణమని చెప్పారట.
ఈ సర్వే ప్రకారం 53.4 శాతం మంది ప్రజలు వారికి నిద్రపట్టకపోవడానికి కారణం డిజిటల్ టెక్నాలజీ అని వెల్లడించారట. రాత్రి తిని పడుకునేటప్పుడు చాలా మంది మొబైల్ లో తమకు నచ్చిన ప్రొగ్రామ్స్ , వీడియోలు చూస్తూ.. నిద్రపోవాలన్న విషయమే మర్చిపోతున్నారు. ఎప్పటికో కళ్లు అలిసిపోయి నిద్రకు ఉపక్రమించినా మధ్యలో మెలుకువ వచ్చి నిద్రా భంగం కలుగుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పడుకునేముందు మొబైల్ ను దూరంగా పెట్టి పడుకుంటే మంచిది.
అనారోగ్యం పాలవుతున్నామని తెలిసినా లేదా కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనా ఆ ఆందోళనే మనిషికి నిద్ర పట్టకుండా చేస్తోందట. కాస్త నలతగా ఉన్నా కరోనా సోకుతుందేమోనని భయపడుతున్నారట. ఈ కారణంగానే నిద్ర రావట్లేదని 46.4శాతం మంది వెల్లడించారట. ఇలాంటి ధోరణి 35 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
చాలా మంది మద్యం ఎక్కువ తాగితే నిద్ర వస్తుందని అపోహ పడతారు. నిజానికి మద్యం సేవించడం మూలంగా నిద్ర పట్టదు. ఆ మత్తులో తూగుతుంటారంతే. ప్రశాంతమైన నిద్ర ఉండదు. 44.6శాతం మంది అధికంగా మద్యం తాగినా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నామని సర్వేలో తెలిపారట.
Also Read : స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
డిజిటల్ టెక్నాలజీతో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో ఆ వార్త తెలుసుకోగలుతున్నాం. మంచి, చెడు, నిజం, అబద్ధం ఇలా అన్ని రకాల వార్తలు బుర్రలోకి ఎక్కించుకోవడంతో మానసిక ఒత్తిడి పెరుగుతోందని 46.4శాతం మంది పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సమస్యను 18-44 ఏళ్ల మధ్య వయస్కులు ఎదుర్కొంటున్నారట.
ఆహార సూత్రాలు అవసరం:
తీసుకునే ఆహారాన్ని బట్టి మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు అనేది చాలా వరకు నిజం. అయితే నిద్రలేమికి తీసుకునే ఆహారానికి చాలా దగ్గర సంబంధమే ఉంది. సరైన పోషకవిలువలున్న తాజా ఆహారాన్ని తీసుకోవటంతో పాటు ఆ విషయంలో సరైన వేళలు పాటించాలి. అప్పడే ఆరోగ్యం మీ కంట్రోల్ లో ఉంటుంది. రొజూ నిద్రపోయే సమయానికి నిద్ర అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. పోషక విలువలు, విటమిన్లు ఎక్కువగా లభించే తాజా పండ్లు కూరగాయలు, దినుసులు డైట్ లో ప్రధానంగా ఉండేలా చూసుకుంటే చాలా వరకు ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతమైన నిద్రను కాపాడుకుంటున్నట్లే లెక్క.
ఆందోళనకు ఆమడదూరం :
రాత్రి నిద్రకు మంచంమీద చేరుకున్నాక ఫేనువైపు చూస్తూ ఆరోజు జరిగిన విషయాలను, జీవితంలో జరిగిన బాధ కలిగించే సంఘటనలను మననం చేసుకుంటారు చాలామంది. అంతేకాదు భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందనే బెంగతో నిద్రలేని రాత్రులను గడుపుతారు. రేపు జరగబోయే దానిగురించో, చేయవలసిన పనిగురించో ఇప్పటి నుండి అందోళన చెందటం, పదేపదే నిద్రపోయే ముందు అదే ఆలోచించటం నెమ్మదిగా ఒక ఆలవాటుగా మారిపోతుంటుంది. ఇదే నిశ్చింతగా రావాల్సిన నిద్రను దూరంగా తరిమేస్తుంది. అందుకే ఒక్కసారి మంచంపై వాలాక మనసును ప్రశాంతంగా ఉంచుకోడానికి ప్రయత్నించాలి. అందోళనను పెంచే ఎటువంటి ఆలోచనలు బుర్రలోనికి రానీయకుండా హాయిగా రెప్పలు వార్చాలి.
Also Read : సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
నిండైన శ్వాస :
హాయైన నిద్రకు ఈ చిన్న చిట్కా అనుసరించి చూడండి. రోజూ నిద్రకుపక్రమించే ముందు శ్వాసను దీర్ఘంగా లోపలికి తీసుకోవటం, నెమ్మదిగా వదలటం ఇలా వీలయినన్నిసార్లు ప్రత్యేక శ్రద్ధతో దీర్ఘశ్వాసను తీసుకోవడానికి ప్రయత్నిస్తే చక్కటి వ్యాయామం పూర్తి కావడమే కాకుండా చిక్కని నిద్ర కూడా ఆవరిస్తుంది. ఇలా రోజూ చేస్తే శ్వాసక్రియ పనితీరు కూడా ఎంతో మెరుగు పడుతుంది. ఇలా చేసే సమయంలో పూర్తి ఏకాగ్రతను శ్వాసపైనే ఉంచాలని మరువకండి. రోజూ ప్రయత్తిస్తుంటే ఇది సులభంగా సాధ్యం అవుతుంది.
వ్యాయామం, నడక :
ఇక ఆరోగ్యానికి ఎంతో ఉపకరించే వ్యాయామం, నడక సంపూర్ణమైన నిద్రను అందించడంలో కూడా ముందుంటాయి. ఎందుకంటే వాటివల్ల శరీరానికి కావలసిన అలసట అందుతుంది. అలసిపోయిన శరీరంపై రాసిన్ని వేడినీళ్లు పడ్డాయంటే ఇక అది కోరుకునేది హాయైన నిద్రనే. అందుకే సాయంత్రం పూట కాస్త వ్యాయామం చేయటం లేదా వాకింగ్ కు వెళ్లటం చేస్తే భోజనం చేసిన తరువాత చక్కటి నిద్రకు మీకు లోటుండదు.
కుటుంబంలో సత్సంబంధాలు :
ఉండే ప్రదేశం అది కుటుంబం కావచ్చు, వేరే ప్రత్యేక కొత్త ప్రదేశం కావచ్చు. మనుషులతో సత్సంబంధాలు ఉండటం ప్రధానం. లేదంటే ఆ గందరగోళం కూడా ప్రశాంతమైన నిద్రకు భంగం చేకూరుస్తుంది. బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన వారికి ఆ వ్యతిరేక వాతావరణంలో వినిపించే సూటిపోటి మాటలు, ఎడ, పెడ మొహాలు మనసుకు హాయిని లేకుండా చేస్తాయి. ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించిన సమయంలో పదేపదే గుర్తుకోస్తూ మనసును తొలుస్తుంటాయి. నిద్రపోవటానికి పెద్ద ఆటంకంగా తయారవుతాయి. ఉండే చోటులో ప్రశాంతత కోసం చుట్టు ఉన్న మనుషులతో సత్సంబంధాలు కూడా ముఖ్యమే. చక్కటి నిద్రకు అన్నింటికంటే ప్రధానమార్గం యోగా చేయటం. ఇందులో ముఖ్యంగా కొన్ని సూత్రాలు తెలుసుకొని ప్రతిరోజూ సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
Also Read : ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
ఇలా కూడా ప్రయత్నించి చూడండి:
అ గోరు వెచ్చని నీటిలో ఉడుకులోన్ కాని, లావెండర్ కానీ అయిదు చుక్కలు కలిపి స్నానం చేస్తే నిద్ర వస్తుంది.
అ కొబ్బరినూనె వేడిచేసి గోరువెచ్చగా ఉన్నపుడు తలకు మర్ధనా చేసుకుంటే కాసేపటికే పండంటి నిద్ర రావడం ఖాయం. అస్సలు నిద్ర పట్టకపోతే ఒక గ్లాసు చన్నీళ్లలో ఒక స్పూను పంచదార వేసి కలిపి తాగండి. హాయైన నిద్ర వస్తుంది. అయితే ఇది రోజూ కాదు ఎప్పడైనా మరీ నిద్ర పట్టనపుడే చేయాలి.
ఒక చెంచాడు నువ్వులనూనె వేడిచేసి అందులో కొంచెం కర్పూరం కలిపి అరికాళ్లకు మసాజ్ చేసుకున్నా చక్కటి నిద్ర వస్తుంది.
మనసుకు నచ్చిన చక్కటి సంగీతం వినటం వల్ల, మంచి పుస్తకాలు చదవటం వల్ల మనసు హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.
మనసు ప్రశాంతంగా ఉంటే నిద్ర దానంతటదే వస్తుంది. అరకపు ఆవుపాలు తాగినా చక్కని నిద్ర మీ చెంత చేరుతుంది.
Related Posts:
> ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
> నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
> నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా..?
> ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.
> నీటి ఆవిరితో కరోనా మాయం
> కరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు
> కరోనా పాజిటివ్ వ్యక్తులకు అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే
నిద్ర, నిద్రపట్టకపోవడానికి కారణాలివేనట, స్లీపింగ్, sleeping problems, sleeping problems solutions, sleeping problems causes, how to solve sleeping problems naturally, sleep disorders symptoms, sleep disorders treatment, types of sleeping disorders, health tips, sleep, corona, alcohol, News.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment