నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..? Nakshatra dosha for Birth in Telugu | Hindu Temple Guide
జననకాలనక్షత్రదోషాలుపరిహారాలు
పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది . ఏ నక్షత్రము లలో జన్మించినపుడు ఏ దోషములు కలుగుతాయి.. దోష పరిహారములు ఏమిటి ?
దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవగ్రహ శాంతి, హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభిషెకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి.. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి.
1. అశ్విని 1 వ పాదములో జన్మించిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము ౩ నెలలు ఉండును. ఇక్కడ గమనించ వలసిన విషయము రేవతి, అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషములు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు.
2. భరణీ 1 2 4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగ పిల్లాడు పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 దినముల వరకు ఉంటుంది.
3. కృత్తిక నక్షత్రములో 3 వ పాదము లో స్త్రీ జన్మించిన తల్లికి... పురుషుడు జన్మించిన తండ్రికి సామాన్య దోషం కలుగ చేయును. 1 2 4 పాదములలో జన్మించిన వారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు.
4. రోహిణి నక్షత్రము 1 వ పాదములో జన్మించిన మేనమామ కు, 2 వ పాదము తండ్రికి, 3 వ పాదము తల్లికి దోషమని, 4 వ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము. సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టిన వారి వలన మేనమామ కు గండము. తప్పక శాంతి అవసరము .
శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు . అందు వలెనే కంసుడు నాశనమయ్యాడనీ పురాణ వచనము.
5. మృగశిర 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు.
6. ఆరుద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు 4 వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము.
7. పునర్వసు నక్షత్రము 1 2 3 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.
8. పుష్యమి నక్షత్రము కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును. రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. పుష్యమి నక్షత్రము లో జన్మించిన వారివలన 1 వ పాదము మేనమామలకు , 2 పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు . మూడు, నాలగవ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును . వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి . గంధపు చెక్కను దానము ఇచ్చుట వలన దోషము నశించును.
9. ఆశ్లేష నక్షత్రములో 1 వ పాదమున పుట్టినవారికి దోషము లేదు. 2 వ పాదము శిశువునకు, 3 వ పాదము తల్లికి, 4 వ పాదము తండ్రికి దోషము . నాలుగవ పాదము న జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును.
10. మఖ నక్షత్ర 1 వ పాదములో జనన మైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్ర్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము . ౩ వ పాదము న పుట్టిన వారి వలన తల్లి తండ్రి ఇద్దరకి దోషము . అశ్వము దానమిచ్చుట వలన దోషము తొలగును . 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు.
11. పుబ్బ నక్షత్రములో 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.
12. ఉత్తర నక్షత్ర 1, 4 వ పాదములలో జననము జరిగిన యెడల తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. నూనె పాత్రను దానము చెయ్యాలి. మిగతా 2 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు.
13. హస్తా నక్షత్ర 3 వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1 2 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.
14. చిత్త నక్షత్రములో 1 వ పాదము తండ్రికి, 2 వ పాదము తల్లికి, 3 వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. 4 వ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును.
15. స్వాతి నక్షత్రమున 1 2 3 4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు.
16. విశాఖ నక్షత్రము లో జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును . 1 2 3 4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము. విశేష శాంతి అవసరము.
17. అనూరాధ నక్షత్రములో 1 2 3 4 పాదముల లో జన్మించుట వలన దోషము లేదు.
18 . జ్యేష్ట నక్షత్రము ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1 2 3 4 ఏ పాదములో జన్మించినా దోషమే. జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి . అందు ఏ భాగములో పుడితే ఆ భాగ సంభందము కలవారికి తప్పక నాశనము కలుగును.
1 వ భాగములో తాతయ్యకు
2 అమ్మమ్మ కు
౩ తల్లి తోడ బుట్టిన వారికి , మేనమామలకు
4 అన్నలకు, అక్కలకు
5 శిశువునకు
6. ఎవ్వరికి దోషము ఉండదు
7. వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు
8. జాతకునకు
9. తల్లికి
10. తండ్రికి దోషము కలుగ చేయును. మరియు నాల్గవ పాదమున జనన మైతే తండ్రికి దోషము . ఇది సుమారు 9 నెలలు ఉండును . గోవు ను దానము ఇచ్చుట వలన శాంతి కలుగును. విశేష శాంతి చేయించాలి.
19. మూల నక్షత్రము .. ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండును. ఈ నక్షత్రములో 1 వ పాదమున జనన మయిన వారి తండ్రికి, 2 వ పాదము తల్లికి, ౩ వ పాదము ధనమునకు నాశనము కల్గించును .. 4 వ పాదమున జననము జరిగిన దోషము లేదు . మూలా నక్షత్ర సమయమును మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసు కోవాలి. పన్నెండు భాగాలలో
1.వ భాగము తండ్రికి దోషము
2.తల్లికి
౩.అన్నలకు
4.భాగస్వాములకు
5.పిల్లనిచ్చిన మామగారికి
6.చిన్నాన్న, పెద్ద నాన్నలకు
7.పిన్నమ్మ , పెద్దమ్మ లకు మరియు మేనమామలకు
8.ధనమునకు
9.జీవన నాశనము
10.దరిద్రమును కల్గిస్తుంది
11.భ్రుత్యులు
12.జాతకునికి నాశనము కలుగ చేయును.
జ్యేష్ట ,మూలా నక్షత్రములలో జన్మించిన వారి దోషము వివాహ కాలము వరకు ఉండును . దోష నివారణ కొరకు ఎద్దును దానమివ్వడము.... నవగ్రహ శాంతి, జప, తప, దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును.
20. పూర్వాషాడ నక్షత్రము పగటి వేళలో కుమారుడు జన్మించినపుడు తండ్రికి ఆపదలు కలుగును. 2 3 వ పాదములలో స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టిననూ తల్లి తండ్రి ఇద్దరికీ గండము . 4 వ పాదమున జననము దోషము లేదు.
21. ఉత్తరాషాడ నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .
22. శ్రవణం నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .
23. ధనిష్ట నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .
24. శతభిషం నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .
25. పూర్వాబాద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు . నాల్గవ పాదము సామాన్య దోషము .
26. ఉత్తరాభాద్ర నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.
27. రేవతి నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు . 4 వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి . .
ఈ నక్షత్రములనే కాక దుష్ట తిధి దోషము, వర్జ్యము, దుర్ముహూర్త కాలముల యందునూ, గ్రహణ సమయములలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట ముఖ్యము..
సర్వేజనా సుఖినోభవంతు..
సనాతన హిందూ సంప్రదాయాలను గౌరవించండి -- పాటించండి..
Famous Posts :
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
nakshatra dosha, nakshatra dosha for death, ashlesha nakshatra dosha nivarana in telugu, rohini nakshatra dosha, nakshatra dosha, good nakshatras for birth, best nakshatra to be born in 2020, jyeshta nakshatra dosha nivarana, nakshatra dosha chart, నక్షత్ర దోషాలంటే ఏమిటి..?
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
For 108 Nakshatrapaada Sivalayalu, Draksharamam, visit www.srirajarajeswaripeetham.com
ReplyDelete