Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు. మీకు తిరుమల దర్శనం టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD (SLOTTED SARVADARSHAN )టికెట్స్ పొందవచ్చు. ఇవి తీసుకుంటే మీకు మూడు నుండి నాలుగు గంటలలోపు దర్శనం అవుతుంది(భక్తుల రద్దీని బట్టి) * తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తీసుకుని ప్రతిఒక్కరు క్యూ లైన్లో నిలబడి ఈ టికెట్స్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ లేకుండా సరాసరి కొండమీదకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గానీ మీకు 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. కావున భక్తులు SSD టోకెన్ లు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి.. టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :- 1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది .. మీరు రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఇతర జీవులతో, మన ఋణాలు ఎలా ఉంటాయంటే? Sanatana dharma | Hinduism | Hindu Temple Guide

ఇతర జీవులతో, మన ఋణాలు ఎలా ఉంటాయంటే?

మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా, ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గానూ వారే తారసపడతారు.

Also Readభస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

ద్వేషం కూడా బంధమే! పూర్వజన్మలో  మనమీద గల పగను తీర్చుకోవడానికే, మనల్ని హింసించే యజమానిగానో లేదా సంతానంగానో ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.

మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు  అపకారం చేసే వారిగా తిరిగి ఎదురవుతారు!

మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి వచ్చేవారు మాత్రం, మనకు ఈ జన్మలో మిత్రులు గానో, సహాయకులు గానో మనకు ఎదురవుతారు.

ఉదాహరణకు ఓ జరిగిన కథ..

కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర  యాచన చేసే ఒక కుంటి బిచ్చగాడు, ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం  అడుక్కుంటూ ఉండేవాడు. 

ఆ వృత్తిలో నెలకి పదివేల రూపాయలకు పైగానే సంపాదించేవాడు. 

కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే, బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచ లోనో  పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.

తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. 

పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు  ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదనీ..

Also Readనక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..? 

అందుకే, ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ, బాధలు  పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడనీనూ!

ఒకోసారి, మనం తెలిసీ తెలియక చేస్తూన్న చిన్న చిన్న తప్పులు కూడా, మనకు బంధాలు అవుతాయని నిరూపించే మరొక కథ ఇదిగో..

ఒకసారి  ఒక మహర్షి బస చేసిన అతిథిగృహం  బయట ఉన్న చెత్తకుండీలో, తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. 

అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణమేమని?

ఈ పిల్లలంతా వారి గత జన్మలలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో, ఇలా ఆహారం కోసం పరితపిస్తున్నారు - అని స్వామివారు జవాబు చెప్పారు.

ఎవరైనా నీటిని బాగా దుర్వినియోగం చేస్తే, వారు మరుజన్మలో ఎడారిలో పుడతారు. కాబట్టి ఏ వనరులను దుర్వినియోగం చేసినా,  దాని ఫలితాన్ని మనం తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి!

ఒకమారు శ్రీవిద్యాప్రకాశానందగిరి స్వామివారు బందరుకి  వెళ్ళేందుకై తమ గురువైన శ్రీమలయాళ స్వామివారి అనుమతి తీసుకుని వెళ్ళబోతూంటే - ఆయన వెనక్కి పిలిచి, నీ చేతి సంచి ఏది అని అడిగారట! 'పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది'  అని చెబుతారు శిష్యులు. అప్పుడు మలయాళ స్వామి వారు - 'నువ్వు మోయగలిగి ఉండి కూడా, ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచీని మోయిస్తే,  వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది మరి! అన్నారు.

Also Read :  భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.

ఇలాంటివి మనము తెలిసీ తెలియక , చాలానే చేస్తూ ఉంటాం.  మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో  లేదా మరే ఇతర కారణాల ద్వారానో, ఉచితంగా  స్వీకరించినవన్నీ  కూడా కర్మబంధాలయి జనన-మరణచక్రంలో మనల్ని బంధిస్తాయి.

కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే, నాకూ ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.

అవి కర్మ బంధాలవుతాయని తెలియక, మన  జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలలో చిక్కుకుపోతూంటాము. ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషమైనా కూడా అంతే ప్రమాదకరం కదా! అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కావడం జరగదు మరి.....ఓం నమఃశివాయ

Famous Posts:

ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు


చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం


ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు


ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి


నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..? 


అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!


భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం

sanatana dharma meaning in telugu, sanatana dharma vs hinduism, sanatana dharma vs hinduism, sanatana dharma principles, sanatana dharma pdf, sanatana dharma meaning in telugu, sanatana dharma book, Sanatana Dharma

Comments

Popular Posts