Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ వినాయక చవితి పూజకు కావలసిన సామాగ్రి | Vinayaka Chavithi Pooja Samagri List Telugu

శ్రీ వినాయక చవితి

మన దేశంలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయనన్నే. పూర్ణకుంభంలాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం.

ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే.

వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానంకోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ. 

భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉందికానీ, వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతాలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు.

పూజకు కావలసిన సామాగ్రి

1. లేవవలసిన సమయము : ఉదయం 5 గంటలు. 

2. శుభ్రపరచవలసినవి : పూజామందిరము, ఇల్లు. 

3. చేయవలసిన అలంకారములు : గడపకు పసుపు, కుంకుమ; గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు. 

4. చేయవలసిన స్నానము : తలస్నానము 

5. ధరించవలసిన పట్టుబట్టలు : ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు 

6. పూజామందిరంలో చేయవలసినవి : పూజకు ఉపయోగపడు వస్తువులు పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి. 

7. కలశముపై వస్త్రము రంగు : ఆకుపచ్చ రంగు 

8. పూజించవలసిన ప్రతిమ : బంకమట్టితో చేసిన గణపతి 

9. తయారు చేయవలసిన అక్షతలు : పసుపు రంగు 

10. పూజకు కావలిసిన పువ్వులు : కలువపువ్వులు, బంతి పువ్వులు 

11. అలంకరణకు వాడవలసిన పూలమాల : చామంతిమాల 

12. నివేదన చేయవలసిన నైవేద్యం : ఉండ్రాళ్ళు 

13. సమర్పించవలసిన పిండివంటలు : బూరెలు, గారెలు 

14. నివేదించవలసిన పండ్లు : వెలక్కాయ 

15. పారాయణ చేయవలసిన అష్టోత్తరం : గణపతి అష్టోత్తరము 

16. పారాయణ చేయవలసిన స్తోత్రాలు : సంకటనాశన గణేశ స్తోత్రం 

17. పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు : ఋణవిమోచక గణపతి స్తోత్రము 

18. పారాయణ చేయవలసిన సహస్రాలు : గణపతి సహస్ర నామం 

19. పారాయణ చేయవలసిన గ్రంధం : శ్రీ గణేశారాధన 

20. పారాయణ చేయవలసిన అధ్యాయములు : గణపతి జననం

21. దర్శించవలసిన దేవాలయాలు : గణపతి 

22. దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు : కాణిపాకం, అయినవిల్లి 

23. చేయవలసిన ధ్యానములు : గణపతి ధ్యాన శ్లోకం 

24. చేయించవలసిన పూజలు : 108 ఉండ్రాళ్ళుతో పూజ 

25. దేవాలయములో చేయించవలసిన పూజా కార్యక్రమములు : గరికెతో గణపతి గకార అష్టోత్తరం 

26. ఆచరించవలసిన వ్రతము : వినాయక వ్రతము 

27. సేకరించవలసిన పుస్తకములు : శ్రీగణేశారాధన, శ్రీగణేశోపాసన 

28. సన్నిహితులకు శుభాకాంక్షలు : కాణిపాక క్షేత్ర మహత్యం 

29. స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి : గరికెతో గణపతి పూజలు 

30. పర్వదిన నక్షత్రము : చిత్త.

31. పర్వదిన తిధి : భాద్రపద శుద్ధ చవితి 

32. పర్వదినమున రోజు పూజ చేయవలసిన సమయం : ఉ||9 నుండి 12 గం|| లోపుగా 

33. వెలిగించవలసిన దీపారాధన కుంది : కంచుదీపారాధనలు 

34. వెలిగించవలసిన దీపారాధనలు : 2 

35. వెలిగించవలసిన వత్తులసంఖ్య :7 

36. వెలిగించవలసిన వత్తులు : జిల్లేడు వత్తులు 

37. దీపారాధనకు వాడవలసిన నూనె : కొబ్బరి నూనె 

38. వెలిగించవలసిన ఆవునేతితో హారతి : పంచహారతి 

39. ధరించవలిసిన తోరము : పసుపురంగు తోరములో పువ్వులు+ఆకులు 

40. నుదుటన ధరించవలసినది : విభూది

41. 108 మార్లు జపించవలసిన మంత్రం : ఓం గం గణపతయే నమః 

42. జపమునకు వాడవలసిన మాల : రుద్రాక్ష మాల 

43. మెడలో ధరించవలసిన మాల : స్పటిక మాల 

44. మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ : గణపతి 

45. చేయవలసిన అభిషేకము : పంచామృతములతో 

46. ఏదిక్కుకు తిరిగి పూజించాలి : ఉత్తరం.

Famous Posts:

> వినాయక చవితి నాడు గణపతిని ఇలా పూజించండి.

వినాయక ప్రతిమను ఏయే పదార్థంతో చేసి పూజిస్తే, ఎలాంటి ఫలితం ఉంటుంది.

>  వినాయక చవితి వ్రత కథ  పూజా విధానం.

వినాయకునికి పాలవెల్లి  ఎందుకు కడతారు?

ఏనక్షత్రానికి ఏగణపతి స్వరూపాన్ని ఆరాధించాలి.

vinayaka chavithi telugu, vinayaka chavithi, vinayaka chavithi story, vinayaka chavithi date, ganapati, vinayaka pooja samagri

Comments