Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సనాతన ధర్మము లో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు | Sanatana dharma | Hinduism

హిందూ_సనాతన_ధర్మము లో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.....
1) ముక్కులు కుట్టించుకున్న దృష్టి దోషము కలగదని నమ్మకము.

2) చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.

3) ఎడమ హస్తము పరమాత్మ అనియు, 
కుడి హస్తము జీవాత్మ అనియు.... ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.
4) తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి.

5) తడి పాదములతో శయనించిన ఆయు:క్షీణం.

6) స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్య గల అక్షరములతో పేర్లు పెట్టుట మంచిది.

7) సూర్య గ్రహణానికి ముందు ''12 '' గంటల కాలము, చంద్ర గ్రహణానికి ''9'' గంటల ముందు కాలము కడుపు ఖాళీగా ఉంచుకోవలెను.

8) శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి . 
బంగారం కుజునికి , వెండి గురువునకు , 
రాగి  రవికి, ఇత్తడి బుధునకు,  ఇనుము శని కి ఇష్టము.
9) స్పటిక ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.
10) బుదవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోశలు తొలుగుతాయి.

11) యాత్ర సమయము లందు మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పడుకున్న మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.

12) ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు (వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను.

13) తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి.

14) ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు (శివునికి) చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.

15) ఇద్దరు ఆడపిల్లలకు ఒకే మారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు మగపిల్లలకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.

16) గృహ ప్రవేశ సమయము లందు మంచి గుమ్మడికాయను పగలకోట్టుచుండురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలు చేయరాదు.

17) వినాయకునికి తులసి దళంతో-__  శివునకు మొగలిపువ్వు తో, - దుర్గమ్మ ను గరిక తోను పూజించరాదు.

18) తులసి దళమును, -బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.

19) బోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.

20) కొబ్బరి- మామిడి-అరటి-పనస ఉదయం పూట తినరాదు.

21) వేరుశనగ పప్పు-అరటిపండు తిన్న పిదప నీరు త్రాగ రాదు...
సనాతన హిందూ సంప్రదాయాలను గౌరవించండి పాటించండి..

Famous Posts:
దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?
ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు 
వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి  
శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి
బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? 
Sanatana dharma, Hinduism, sanatan dharma rules, sanatana dharma book, sanatana dharma means, pooja vidhanam, devoties telugu, god images, హిందూ_సనాతన_ధర్మము

Comments

  1. Read about Trivikram
    https://tollywood-stories.blogspot.com/2020/09/trivikram-moviel-titles-began-with.html

    ReplyDelete

Post a Comment