Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am ***జనవరి 2023 నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్‌లు ఆన్లైన్ లో 12.12.2022 10:00 AM.విడుదల చేస్తున్నారు.**డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ? What is the importance of Rangoli? Importance of Muggu

మన పూర్వీకులు అసలు ముగ్గు ఎందుకు పెట్టేవారు ఆ ముగ్గు ల అర్థం పరమార్థం ఏంటి అనేది తెలుసుకుందాం....

> ఇంటి  గడప ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా  నిరోధిస్తాయి.
ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి.
> ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని  గుర్తు!  పండుగల సమయంలో  ఈ విధంగా   ఖచ్చితంగా వేయాలి.

> ఏ దేవత పూజ చేస్తున్నా  దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి  గీతలను తప్పక గీయాలి

> నక్షత్రం ఆకారం  వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత,  పిశాచాలను ఆ దరిదాపులకు  రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గు లలో కూడా మనకు తెలీని అనేక కోణాలు   దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు,  యంత్రాలు కూడా!... యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

> తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం ముగ్గు గు వేసి దీపారాధాన చేయాలి!    
> యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం 
మీద  నాలుగు  గీతలతో కూడిన ముగ్గు వేయాలి.... దైవకార్యాలలో  కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

> నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి  చుట్టు ప్రక్కల    లతలు,  పుష్పాలు,  తీగలతో కూడిన ముగ్గులు వేయాలి!

> దేవతా రూపాలను, ఓం,  స్వస్తిక్, శ్రీ గుర్తులను   పోలిన ముగ్గులు  వేయకూడదు,    ఒకవేళ  వేసినా వాటిని తొక్కకూడదు.

> ఏ స్త్రీ అయితే దేవాలయం లోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో,  ఆ స్త్రీ కి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళి గానే మరణిస్తుందని  దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం  చెబుతున్నాయి.

> పండుగ వచ్చింది కదా అని, నడవడానికి చోటు లేకుండా  వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు!

> ఈ మధ్యకాలంలో ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తున్నారు... .దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి!

> నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. 
> ముగ్గు  పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

> ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి.

> పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు    ... ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు.  వారే కాదు....  అడ్డుక్కునే వారు కూడా  ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు.

> ముగ్గు లేదంటే  అక్కడ  అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించిన వారికి    శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు.... శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

> ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి..... 
> మనం ఆచరించే ఏ ఆచారమూ  మూఢనమ్మకం కాదు...  మన ఆచార, సంప్రదాయాలన్నీ  అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి....

హిందూ సనాతన సంప్రదాయాలు గౌరవించండి -- పాటించండి.
Famous Posts:
శివ గుణాలు లోకానికి సందేశాలు 

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


importance of muggulu in telugu, ముగ్గు, Muggulu, telugu muggulu, muggulu story, types of muggulu, rangoli , Sankranti, chukkala muggulu

Comments

Popular Posts