వినాయకుడిని ఇంట్లో లేదా ఆఫీస్ లో పెడుతున్నప్పుడు ఈ 10 విషయాలను అస్సలు మర్చిపోకండి | Where to keep Ganesh Idol at Home | Lord Vinayaka

వినాయకుడిని ఇంట్లో లేదా ఆఫీస్ లో పెడుతున్నప్పుడు  ఈ 10 విషయాలను అస్సలు మర్చిపోకండి..

తన భక్తులు ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలతో మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలని, సంతోషం, ఆనందం మరియు విజయాలకు ప్రతీకగా నిలిచే వినాయకుడు కొన్ని వేల సంవత్సరాల నుండి ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.

ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి, మనం దైర్యం కోల్పోకుండా విజయం సాధించేలా నడిపిస్తారు. ఇందు మూలంగానే జీవితంలో ఏ పనిని లేదా ఏ కొత్త విషయాన్ని మొదలుపెట్టాలన్నా ఆ విఘ్నేశ్వర స్వామిని పూజిస్తారు.

Also Read శివునికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది?

ఆ విఘ్నేశ్వర స్వామిని చాలా మంది భక్తులు తమ ఇళ్లల్లో పెట్టుకుంటారు. కాకపొతే చాలా మందికి ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి గణేశుడి విగ్రహాన్ని పెడితే ధనంతో పాటు, ఆనందం విజయం ప్రాప్తిస్తాయి అనే విషయాలు పెద్దగా తెలియవు.

మీకు గనుక ఏ ఏ ప్రదేశాల్లో విగ్నేశ్వరుడిని విగ్రహం పెట్టాలని తెలియకపోతే, వాస్తు ఆధారంగా క్రింద చెప్పబడిన సూచనలను తప్పక పాటించి ఆయా ప్రదేశాల్లో విగ్రహాన్ని పెట్టి సకల సౌభాగ్యాలను మీ వశం చేసుకోండి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1) ఎవరైతే ఆనందాన్ని, శాంతిని మరియు సిరిసంపదలను కోరుకుంటారో అలాంటి వ్యక్తులు తెల్ల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలి. తెల్ల వినాయకుడి చిత్రాన్ని తప్పక ఇంట్లో పెట్టుకోవాలి.

2) ఎవరైతే స్వీయ అభివృద్ధి కోరుకుంటారో, అటువంటి వ్యక్తులు సిందూర వర్ణము వినాయకుడిని ఇంటికి తెచ్చుకొని ప్రతి రోజు పూజించాలి.

3) ఇంట్లో పూజించుకోవడానికి కూర్చొని ఉన్న గణేషుడిని తెచ్చుకుంటే చాలా మంచిది. కూర్చున్న వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అదృష్టం మరియు విజయాలు మన జీవితంలో తిష్ట వేస్తాయి.

4) కూర్చొని ఉన్న వినాయకుడి తొండం ఎడమ వైపుకి వంగి ఉన్న విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకోవాలి. ఏ గణేశుని విగ్రహానికైతే తొండం కుడి వైపుకి వంగి ఉంటుందో ఆ విగ్రహం పెట్టుకుంటే, వినాయకుడి అనుగ్రహం పొందడం కష్టమవుతుంది.

5) మీరు గనుక విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని పని చేస్తున్న దగ్గర పెట్టుకోదలిస్తే, నిలుచుకొని ఉన్న విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలనే విషయాన్ని మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం ద్వారా మీరు చేస్తున్న పనికి శక్తితో పాటు ఉత్సాహం తోడవుతుంది.

6) ఎలుకతో పాటు, ఉండ్రాళ్లు కలిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోండి. అది మీకెంతో పవిత్రతను చేకూరుస్తుంది.

7) మీ పూజ గదిలో వినాయాక స్వామి విగ్రహాన్ని ఒక్కటి మాత్రమే పెట్టుకోండి. ఒకటి కంటే ఎక్కువ గనుక పెట్టుకున్నట్లైతే, విఘ్నేశ్వరుడు భార్యలు రిద్ధి, సిద్ది నిరుత్సాహపడతారు.

8) గణేశునికి గరికని సమర్పించడం మాత్రం భక్తులు మర్చిపోకూడదు. గరికని సమర్పించిన తర్వాత భక్తులు ఈ గణపతి మంత్రాన్ని తప్పక పఠించాలి.

" ఓం గమ్ గణపతయే నమః "

9) స్వస్తిక్ చిహ్నం వినాయక స్వామిదని చాలా మంది నమ్ముతారు. అందుచేత ఎవరైతే వాస్తుదోషంతో బాధపడుతుంటారో అటువంటి వ్యక్తులు ఇంట్లో స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది.

10) ఈ అద్భుతమైన మంత్రాన్ని పఠిస్తే ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది.

Also Readకాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?

"ఓం నమః శివాయ.... శివ శివ శివ...

ఓం శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్...

ఓం శ్రీ హనుమతే నమః ...

జై జై బజరంగబలి...

ఓం గమ్ గణపతయే నమః...

ఓం శ్రీ గణేశాయ నమః...

ఓం నమో నారాయణ...

ఓం నమో భగవతే వాసుదేవాయే...

 ఓం గురు... ఓం గురు... ఓం శ్రీ దుర్గాయా నమః...

ఓం శ్రీ శనిదేవాయ నమః...

ఓం శ్రీ శనైశ్చరాయ నమః...

ఓం శ్రీ సూర్య నమః...

ఓం సున్ సూర్య నమః "

Famous Posts:

నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?


భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి.


తుల‌సి_చెట్టు మారే స్థితిని బ‌ట్టి ఆ ఇంట్లో ఏం జ‌రుగుతుందో ముందే చెప్ప‌వ‌చ్చ‌ట‌


చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?


ఇంట్లో పూజ ఎవరు చేయాలి?


ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?


పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...


శయనిస్తున్నశివుడు ప్రపంచంలో ఏకైక_ఆలయం

వినాయక, Ganesh Chaturthi, ganesh idol home entrance, ganesh idol facing direction in home, keeping dancing ganesha at home, placing ganesha at home entrance, lord ganapathi, vinaya images, vinayaka pooja, vinayaka temples

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS