ఉసిరికాయ -దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు..
ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేదంలో చ్యవన్ ప్రాస్ దీని నుండి తయారుచేస్తారు.
Also Read : 'రోజు రెండు యాలకులు తింటే ఇన్ని ప్రయోజనాలా ?
దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయ క్రింద లేదా ఉప్పు, కారంలో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు.
హిందువులు ఉసిరిచెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీకమాసంలో వనమహోత్సవాలలో ఉసిరిచెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్ఠం అన్ని నమ్ముతారు.
ఉసిరి కాయలను పచ్చడికి.., జాం, జెల్లీ, సాస్ తయారీల్లో కూడ వుపయోగిస్తారు.ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది.
ఉసిరికాయ కంటి చూపును పెంచడములో సహాయపడుతుంది.2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకొని రోజుకి మూడు లేక నాలుగు సార్లు తాగుతూ ఉంటే జలుబు తగ్గుతుంది.
ఉసిరికాయ రోజు తినడము వలన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.
బరువు నియంత్రణకు: ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.
Also Read : నిమ్మరసం ఎక్కువగా తాగితే డేంజర్
ఔషధగుణములు :
ఉసిరి కాయలలో విటమిన్ 'సీ' అధికముగా ఉంది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును. శరీరానికి చల్లదనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను తగ్గించును.
జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విదంగా కురుల ఆరోగ్యానికి కూడు ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉపిరి తిత్తులు,కాలేయం, జీర్ణమండలం, గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .
జీర్ణమండలం :
దాహం,మంట,వాంతులు,ఆకలిలేకపోవుట,చిక్కిపోవుట,ఎనీమియా,హైపర్ -ఎసిడిటి, మున్నగు జీర్ణ మండల వ్యాదులను తగ్గిస్తుంది .
Also Read : నిద్రపట్టకపోవడానికి ఇవే కారణాలు
ఉపిరితిత్తులు :
ఆస్తమా,బ్రాంకైటిస్,క్షయ,శ్వాసనాలముల వాపు, ఉపిరితిత్తులనుండి రక్తము పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది .
గుండె :
ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది . ఉసిరి వల్ల ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది . శరీరములో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది .
కాలేయము :
కామెర్లు ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వల్ల తగ్గుతాయి . కాలేయంలో చేరిన మలినాలు, విషపదార్ధాలును తొలగిస్తుంది, 'యాంటి ఆక్షిడెంట్' గా పనిచేస్తుంది .
Also Read : చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
కామెర్లు :
ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితె వైటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధి, కామెర్లు రాకుండ సహాయపదుతుంది.
మలబద్ధకం:
మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉసిరి కాయ తినడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది
నోటి పూత:
నోటి పూతతో బాధపడేవారికి ఉసిరి కాయ రసంతో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అర కప్పు నీటిలో ఉసిరి కాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితము ఉంటుంది.
Also Read : > నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా..?
కంటిచూపు:
ఉసిరి కంటిచూపు మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండ కళ్ళు ఎర్రబడటం, దురదని కూడా తగ్గిస్తుంది. సగం కప్పు నీటిలో రెండు చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని ప్రతి రోజు ఉదయం తాగుతూ ఉంటే కళ్ళకు చాలా మంచిది.
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
ఉసిరికాయ ఉపయోగాలు, Usirikaya, Amla, how to eat amla fruit, dry amla benefits, amla side effects, amla powder benefits, amla nutrition, amla juice dosage, amla juice benefits, amla fruit benefits
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment