విలువయిన సంపద భగవద్గీత గ్రంథం | Significance and Importance of Bhagavad-gita | Devotional Story's

విలువైన సంపద భగవద్గీత గ్రంథం..

ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .

ఒక రోజు , ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందినవారు , మీ కొడుకు చాలా మంచివాడు కదా !

Aslo Readమహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు

మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?

అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :- బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు 

నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .

వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు .

ఆ డబ్బు  మొత్తం నా అవసరాలకు అయిపోయింది .

నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు ను సంపాదించలేను .

అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .

అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు :- " మీ కోసం మీ కొడుకు డబ్బు  పంపించడం లేదా ? "

ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు . నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను .

Also Readఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి 

సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటారు .

మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడ ను చూసి ఆశ్చర్యపోతారు .

ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .

ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .

ఆ ముసలావిడకు చదువు రాదు .

అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు .

Also Readభార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.

మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .

మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం ఉంది .

కానీ , మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .

మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం .

మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీత ను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అర్మారాలో భద్రంగా పెడుతున్నాం .

ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతి ని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం

సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత .

Also Readమీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి

చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత .

ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత .

ఎన్నో వ్యాధులకు మందు రామాయణ మహా భారత భగవద్గీత లలో ఉన్నాయి

దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.

గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా(దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత .

ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథమ్ భగవద్గీత .

ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథం భగవద్గీత.

ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత .

Also Readభార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం 

దేవుడు మనందరికి పవిత్ర రామాయణ మహా భారతాలను భగవద్గీత చదివి , అర్థం చేసుకొని , దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను !

ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించి మన భారతదేశ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియజేయండి..

Famou Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

భగవద్గీత, ghantasala bhagavad gita telugu pdf, bhagavad gita in telugu pdf, bhagavad gita in telugu with meaning, bhagavad gita in telugu download, bhagavad gita saramsam in telugu, bhagavad gita stories in telugu, iskcon bhagavad gita in telugu pdf, who wrote bhagavad gita in telugu

Comments