ఉల్లాసంగా, ఆనందంగా గడపాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే ఇలా చేయండి | Health Tips, Health News, Health Care and Fitness Tips
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంతోపాటూ నడవాలంటే, ఎంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు.ప్రతి రోజూ ఎన్నో టెన్షన్ లతో జీవితాన్ని గడుపుతూ ఉండడంవల్ల శారీరకంగా ఎన్నో అనారోగ్య సమస్యలు బారిన పడతారు.
Also Read : రోజు రెండు యాలకులు తింటే ఇన్ని ప్రయోజనాలా ?
ప్రతిరోజు మనమీద పడే అధిక ఒత్తిడిని తగ్గించి రోజంతా ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా గడపాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే కొన్ని పనులను చేయడం ద్వారా రోజంతా ఎంతో ఉల్లాసంగా గడపవచ్చు.అయితే మరి ఎలాంటి పనులను చేయడం ద్వారా ఉల్లాసంగా గడుపుతారో తెలుసుకుందాం…
మరుసటి రోజు ఉదయం చేయాల్సిన పనులను గురించి ముందు రోజు రాత్రి వాటి గురించి ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం వల్ల మరుసటి రోజు వారు అధిక ఒత్తిడికి లోనవు కుండా ఎంతో ప్రశాంతంగా ఆ పనులను నెరవేర్చుకుంటారు.ఉదయం లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా ఉండటం ద్వారా ఆ రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.
Also Read : నిమ్మరసం ఎక్కువగా తాగితే డేంజర్
అంతేకాకుండా ఉదయం లేవగానే సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చోకూడదు.
ఉదయం లేచిన తర్వాత కాసేపు ఆగి మళ్ళీ పడుకోకూడదు.
అలా పడుకోవడం వల్ల తీవ్రమైన తలనొప్పితో రోజంతా బాధపడాల్సి వస్తుంది.ఉదయం లేచిన వెంటనే జాగింగ్, యోగా వంటి వాటిని చేయటం ద్వారా మన శరీరం ఎంతో చురుగ్గా ఉంటుంది.
అంతేకాకుండా రాత్రి తొందరగా పడుకోవడం వల్ల మన శరీరానికి సరిపడా నిద్రను, నిద్ర పోవడం వల్ల మరుసటి రోజు ఉదయం తొందరగా నిద్ర లేచి పనులను ముగించుకుంటారు.
Also Read : నిద్రపట్టకపోవడానికి ఇవే కారణాలు
వ్యాయామం చేసిన తర్వాత ప్రతి రోజు ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల డిప్రెషన్ మూడ్ నుంచి బయటకు రావడమే కాకుండా, రోజంతా ఎంతో చురుగ్గా పని చేస్తారు.మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవ్వటం వల్ల అధిక ఒత్తిడికి గురవుతారు.అలాంటి సమయంలో ఒక కప్పు కాఫీ తాగడం ద్వారా, కాఫీ లో ఉన్నటువంటి కెఫిన్ కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గించి మన శరీరానికి ప్రశాంతతను కలిగిస్తుంది.
ప్రతిరోజు ఉదయం పీచుపదార్థాలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అల్పాహారాన్ని తీసుకోవాలి.వీటిని తీసుకోవడం ద్వారా మన రక్తంలోని చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి.కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి సరిపడా రోగనిరోధకశక్తి పెరుగుతుంది.తద్వారా బ్యాక్టీరియా ,వైరస్ ల ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది. ఈ రోజు ఈ పనులు చేయటం ద్వారా రోజంతా ఎంతో ఉల్లాసంగా గడపవచ్చు.
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
simple health tips for everyone, natural health tips, health tips telugu, health tips of the day, health tips for students, health tips for men, 100 health tips, 10 tips for good health, yoga, morning,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment