Drop Down Menus

విష్ణువుకి ఏ పాత్రలో నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా? History Behind Prasadam In Copper Plate To Lord Vishnu

విష్ణుమూర్తికి రాగి పాత్రలోనే నైవేద్యం పెట్టాలా? ఎందుకలా?

ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడిఅర్చకులు స్వాములు రాగి పాత్రలోనే శ్రీ మహావిష్ణువుకు నైవేద్యమంటే పెడుతుంటారు. కారణం ఏంటి?

అంతెందుకు కొన్ని గుళ్ళలో రాగి తీర్థం ఇచ్చే పాత్రలు కూడా రాగితోనే తయారు చేయబడి ఉంటాయి. ఎందుకు అలా చేస్తారు. పురాణాలు ఏం చెబుతున్నాయి. శాస్త్రం ఏం చెబుతోంది అనే అంశాలను పరిశీలిద్దాం.

పురాణాల ప్రకారం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు. పుట్టుక రాక్షస పుట్టుకే అయినా పరమ విష్ణుభక్తుడు. ఆయన ధ్యాసలోనే ఉండేవాడు.

ఆ రాక్షసుడు పదహారువేల సవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు.

కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు.

తన మరణం విష్ణు చక్రం వల్ల సంభవించాలని, తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.

తరువాత కూడా గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ద ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిశ్చయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు.

విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించిది. వెంటనే అతడి మాంసమంతా రాగిగా మారిపోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి.

మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారైంది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణువుకు ఎంతో ఇష్టం.

Also Readపూజలో కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ?

రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని పురాణాలు చెబుతుంటాయి.

శాస్త్రపరంగా చూస్తే, రాగికి రోగ నిరోధక శక్తి ఎక్కువ. తీర్థం రాగి పాత్ర ద్వారానే వేయడం వలన రోగాలు సోకకుండా ఉంటాయని అర్థం. అందుకే గడాకేశుడి శరీరం ద్వారా లోహాల లక్షణాలను తెలియజేశారు.

Famous Posts:

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

విష్ణుమూర్తి,  రాగి, నైవేద్యం, Satyanarayan Puja,Copper Plate, Lord Vishnu, Prasadam, vishnu facts, lord vishnu stories,lord vishnu avatars, lord brahma, vishnu krishna

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.