Drop Down Menus

సంతానాన్నిచ్చే ‘పళ్ళాలమ్మ‘ | Sri Pallalamma Ammavari Temple | Vanapalli | East Godavari District

సంతానాన్నిచ్చే ‘పళ్ళాలమ్మ‘

వనపల్లి

శ్రీ పల్లమ్మ అమ్మవారి ఆలయం

పవిత్ర గోదావరీనదీ తీరానవెలసిన అతిముఖ్యమైన దేవతలలో ”పళ్ళా లమ్మవారు ఒకరు! ఈమెను ఇక్కడి ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు.

Also Readఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి.. 

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలంలోని ”వానపల్లి గ్రామం లో ఈ అమ్మవారి దేవస్థానం ఉంది! ఈమెను ఇక్కడి భక్తులు ”కాళికా దేవి అవతారంగా నమ్ముతారు! శ్రీపళ్ళాలమ్మవారి విగ్ర హం కాలువిూద కాలువేసుకొని ఉండి, క్రింద కాలితో నక్కను తొక్కిపెడుతూ ఉండడం విశేషం! వానపల్లిని పూర్వం ”వానరపల్లిగా పిలిచేవారని, వనములు, వానరులు ఎక్కువగా ఉండడంవల్ల వానరపల్లిగా పేరు వచ్చిందని అంటారు. ఈ గ్రామం త్రేతాయుగం నాటిదని సీతమ్మవారి వన వాసం ఈ ప్రాంతంలోనే గడిచిందని పూర్వీకులు చెబుతుం టారు!

స్థలపురాణం;-

వనవాస సమయంలో సీతమ్మ గౌతమిలో స్నానంచేసి వనదేవతను పూజిస్తూ ఉండగా ఆమె దర్శనం ఇచ్చిందని కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అప్పటినుంచీ పూజలందుకుంటుం దని అంటారు. సీతాదేవియే స్వయంగా ఈ పీఠా న్ని స్థాపించిందని కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అప్పటినుంచీ పూజ లందుకుంటుందని అంటారు. సీతాదేవియే స్వయం గా ఈ పీఠాన్ని స్థాపించిందని అందుకు నిదర్శనంగా పేరులేని ఒక చెట్టును ఇక్కడ నాటిందని చెబుతుంటారు. ఆ చెట్టు ఇప్పటికీ ఉండడం విశేషం! ఈ చెట్టును మూడుసార్లు దర్శించి, అమ్మవారికి పూజలు జరిపితే వంశా భివృద్ధి జరగడ మేకాక సంతానార్థులకు పుత్రుడు కలుగుతాడని తెలు స్తోంది. సంతానం కలిగాక ఒకకొబ్బరి మొక్కను, చీర, పసుపు కుంకు మలు, వగైరాలను అమ్మవారికి సమర్పించి మొక్కు తీర్చుకుంటారు! 

అమ్మవారు ఒకనాడు పిఠాపురం రాజావారికి కలలో కనిపించి తనకు పండ్లు, పూలు పంపించ మని వంశం భోగభాగ్యాలతో విలసిల్లుతుం దని చెప్పిందట! రాజావారు ఆవిధంగానే చేయడమేకాక కొంతభూమిని కూడా అమ్మవారికి సమర్పించి పూజాదికాల నిర్వహణకు అర్చక స్వామిని కూడా నియమించారట!

Also Readపూజలో కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? 

”సర్‌ అర్థర్‌ కాటన్‌ దొర గోదావరిపై ఆనకట్ట నిర్మింపజేయాలని భావించారు. ముక్తేశ్వరం కాలవను తవ్వించడానికి అమ్మవారి కోవెల అడ్డుగా ఉందని దాన్ని తొలగించక తప్పదని అనుకున్నారు. అప్పుడు అమ్మవారు కాటన్‌ దొరగారికి కలలో కనిపించి ఆలయం పక్కగా కాల వను తవ్వించమని పని దిగ్విజయంగా పూర్తికావడానికి తనశక్తిని కూడా ప్రసాదిస్తానని చెప్పిందట! అప్పుడాయన ఆవిధంగానే చేశారట! కాటన్‌ దొరగారు అమ్మవారిని దర్శించి ఆమె నక్కను తొక్కినట్లుగా ఉండడం ఏమిటి? అనుకున్నారట! ఆ ప్రాంతం అంతా అరణ్యంగా, నక్కలు ఊళలు వేస్తూ భయంకరంగా ఉండేదని తనకు నిద్రాభంగం కలుగుతోందని భావించిన అమ్మవారు నక్కలను అదుపులో ఉంచినట్లు గా ఉందని చెబుతారు. ఈ ప్రకారంగా ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల చాలా మంచి జరుగుతుందని, గ్రామానికి కీడు జరగకుండా కాపా డడమే ఈ రూపంలోని ఆంతర్యమని నమ్ముతారు! 

1986లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఏటిగట్టుకు గండి పడు తుందని ప్రజలు భయపడి, పళ్ళాలమ్మవారికి మొక్కుకున్నారట!

వరదల నుండి గ్రామం కాపాడబడిందని పంట జాతరను వైభవంగా జరిపారట! ప్రతిఏటా వరదలు వచ్చినా అమ్మ వారి పీఠంనుండి జలం ఉద్భవించి క్రమేపీ ఛాతివరకూ చేరుకొని తగ్గిపోతుందట! ఈ పంట జాతరను చెయ్యడం ఎంతో గొప్పగా స్థానికులు చెబుతారు. ఆడబడుచును పుట్టినింటినుండి పంపేరీతిలో చీరె-సారెలతో అమ్మ వారిని గ్రామస్థులంతా సాగనంపుతారు! ఆరోజున అంద రూ ఉపవాసం ఉండి భర్త కావడి మోయగా భార్యగానీ లేక ఆడబడుచులుగానీ అఖండ దీపంతో అమ్మ వారిని పంపించడం ఇక్కడ ఆనవాయితీ. చివరగా గుడిదగ్గర అగ్ని గుండం తొక్కడంతో అమ్మవారిపంటలజాతర ముగుస్తుంది. ఒకరోజున ఒక సాధువ్ఞ అమ్మవారికి పూజాది కాలు నిర్వర్తించి, ఆలయం తలుపులను మూసి వెళ్ళిపోయా డట.

Also Readఇంట్లో పూజ ఎవరు చేయాలి? 

అర్థరాత్రివేళ ఏదో జ్ఞాపకం వచ్చి, ఆలయానికి వెళ్ళి తలుపులు తెరవగా ఆ సమయంలో 101 అక్కా చెల్లెళ్ళతోపాటుగా ఆటపాటలతో గడుపుతూ ప్రధాన దేవతయైన పళ్ళాలమ్మ అమ్మవారు కానవచ్చిందట! శక్తి స్వరూపిణిగా దర్శనమిచ్చిన అమ్మవారిని హఠాత్తుగా చూడడం వల్ల ఆ సాధువ్ఞ ప్రాణాలు విడిచిపెట్టేశాడట! అమ్మవారిని ఆవిధంగా దర్శించిన మొట్టమొదటివాడు ఆసాధువే! అందుకే ఆయన శరీరాన్ని ఆలయం పక్కనే దక్షిణాన సమాధి చేశారట! ఈ విధంగా ఎన్నో మహిమలు కలిగి కోరిన వారి కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజింప బడుతున్న పళ్ళాలమ్మవారి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు మనసారా నమస్కరించుకుందాం! ఆయురారోగ్య ఐశ్వ ర్యాలనిమ్మని వేడుకుందాం!!

సమయాలు

8:00 AM - 7:00 PM

ఈ ఆలయం అమలాపురం నుండి 21 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి 55 కిలోమీటర్ల దూరంలో, మరియు కాకినాడ (రావులపాలెం ద్వారా) నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇక్కడ వసతులు అందుబాటులో లేవు మరియు అమలాపురం లేదా రాజమండ్రి లేదా కాకినాడలో ఉండవలసి ఉంది.

Famous Posts:

నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 

భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. 

ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.

అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.

నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 

భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి. 

తుల‌సి_చెట్టు మారే స్థితిని బ‌ట్టి ఆ ఇంట్లో ఏం జ‌రుగుతుందో ముందే చెప్ప‌వ‌చ్చ‌ట‌

చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?


           

సంతానాన్నిచ్చే పళ్ళాలమ్మ, Vanapalli, Sri Pallalamma Ammavari Temple, vanapalli pallalamma temple history telugu, pallalamma thalli temple, vanapalli pallalamma thalli, vanapalli pallalamma images, vanapalli village, vanapalli temple timings, vanapalli caste, rajahmundry to vanapalli, East Godavari

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.