Drop Down Menus

పిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే | how parents can influence their children?

పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..

పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..

వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..

ఇప్పుటి తరం పిల్లలు..

(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)

తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు..

పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...

రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...

గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..

తిడితే వస్తువులను విసిరి కొడతారు..

Also Read : పిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు

ఒకరు, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్న తల్లి కూడా పనిమనుషులపై ఆధారపడి తన ఇంటి పనే తాను చేయడం లేదు.

ఇంటి లో ఆవులను పోషించరు గానీ ఎ.సి. మాత్రం తప్పదు.

అత్తమామలు ఇంటికి వస్తే పొగబెట్టి తరిమేస్తారు. కానీ వీరి కోడలు మాత్రం వీరి కాళ్ళకింద ఉండాలని కోరుకుంటారు.

ఇలా ఏమాత్రం బాధ్యత లేని సౌఖ్య బానిసలుగా బ్రతికేస్తూ ఆడపిల్లలకు కనీసం ఇల్లు వాకిలి తుడవడం,కల్లాపి ముగ్గులు వేయడం కూడా నేర్పకుండా, కనీసం తిన్న కంచం తీసే సంస్కారం కూడా అలవరచకుండా తామే అటువంటి పనులు చేయకుండా భావిభారత పౌరులను భూమి కి భారమయ్యేలా పెంచుతున్నారు.

ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..

ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..

20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..

బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..

కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..

వారిస్తే వెర్రి పనులు..

మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

Also Readగురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?

వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది.. 

కష్టం గురించి తెలిసేలా పెంచండి 

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..

ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..

మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..

అభినయాలు కనపడడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..

కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం..

కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..

చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...

గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం

టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..

అందుకే తల్లిదండ్రులు మారాలి..

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం..?

ఒక్కసారి ఆలోచన చేయండి..

సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి..?

కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో 

పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..👇

👉  బాధ్యత 

👉  మర్యాద

👉  గౌరవం 

👉  కష్టం 

👉  నష్టం 

👉  ఓర్పు

👉  సహనం

👉  దాతృత్వం

👉  ప్రేమ

👉  అనురాగం

👉  సహాయం

👉  సహకారం

👉  నాయకత్వం

👉  మానసిక ద్రృఢత్వం 

👉  కుటుంబ బంధాలు

👉  అనుబంధాలు    

👉  దైవ భక్తి

👉  దేశ భక్తి

ఈ భావనలు సంప్రదాయాలు అంటే..

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి.. 

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..

పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...

మనం కూడా మమేకమవుదాం...

భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం.

Famous Posts:

మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి


మరణం తరువాత ఏం  జరుగుతుంది? 


అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 


నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 


భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. 


ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.


అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.


నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 


భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి. 

Parent-Child Relationship, why are parent-child relationships important, types of parent-child relationships, parents child relationship quotes, parent-child relationship psychology, parent-child relationship problems, parent-child relationship ppt, parent-child relationship essay, parent-child relationship definition

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. u said is correct please dnt mention only girls why not boys...?

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.