Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ | Know why you must worship Lord Hanuman on Saturdays

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ.

శనివారం ఆంజనేయ స్వామి ని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మంద వారం అని పిలువ బడే శనివారం శ్రేష్టమైనది. "సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’అంటే ప్రతి శనివారం భరతుడు హనుమ ను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని అర్ధం.

శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభి షేకం చేయాలి. తైలం తో కూడిన గంధసిన్దూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగు తుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగు తుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశో వంతు లైన పుత్రులు కలుగుతారు. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలో నైనా కాని, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శని వార వ్రతం చేయాలి.

శనివార వ్రాత విధానం – ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రల తో బయటి నుండి నీరు తెచ్చు కొని హనుమకు అభిషేకం చేయాలి. అన్ని వర్ణాల వారు, స్త్రీలు కూడా చేయ వచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి.

ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యదా విధి గా జపించాలి. దీని వల్ల జన వశీకరణ కలుగుతుంది. ధన లాభం, ఉద్యోగ ప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి.

శని వార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉండి. శని గ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు. ఒక సారి శని దేవుడు హనుమను సమీ పించి "మారుతీ ! నేను శనిని. అందర్ని పట్టి బాధించాను. ఇంత వరకు నిన్ను పట్టు కొలేదు. ఇప్పుడు చిక్కావు" అన్నాడు. దానికి హనుమ "శానీశ్వరుడా ! నన్ను పట్టు కొంటావా ? లేక నాలో ఉంటావా ? నాలో ఉండ దలిస్తే ఎక్కడ ఉండాలని కోరిక గా వుంది ?"అని ప్రశ్నించాడు. అప్పుడు శని హనుమ శిరం మీద ఉంటానని చెప్పాడు. సరే నని శిరస్సు మీద శనిని చేర్చు కొన్నాడు. మారుతి ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. ఒక మహా పర్వతాన్ని పెకలించి నెట్టి మీదకు ఎత్తు కొన్నాడు హనుమ."కుయ్యో మొర్రో అని ఆ భారం భరించ లేక శని గిల గిల తన్ను కొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువు కు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు. తోకలో బంధింప బడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ, ఏడుస్తూ ప్రార్ధించాడు. శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి "మందా ! నన్ను పట్టు కొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు. అప్పుడే గిజగిజ లాడి పోతున్నావె?’’అని ప్రశ్నించాడు. "ప్రజలను బాధించ టమే నీ ధర్మం గా ప్రవర్తిస్తున్నావు. అందు కని నిన్ను ఒక రకంగా శాశించి వదిలి పెడ తాను" అన్నాడు. గత్యంతరం లేక శని సరే నన్నాడు. హనుమ శనీ! నా భక్తులను బాధించ రాదు .నన్ను పూజించే వారిని,  నా మంత్రాన్ని జపించే వారిని, నా నామ స్మరణ చేసే వారిని ,నాకు ప్రదక్షిణం చేసే వారిని, నా దేవాలయాన్ని సందర్శించే వారిని, నాకు అభిషేకం చేసే వారిని ఏకాలం లో నైనా ముట్టు కొకూడదు. నువ్వు బాధించ రాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను ‘"అని చెప్పి, శనితో వాగ్దానం చేయించు కొని వదిలి పెట్టాడు. అందుకే శని వారం ఇంత ప్రాధాన్యత సంత రించు కొన్నది. శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధా నివృత్తి కే శని కి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శని దేవుడు బాధించటం లేదు

Also Read :  హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

"మంద వారేషు సం ప్రాప్తే హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే;

హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా"

శనివారం రాగానే హనుమను పూజించాలి. ఆయన శనివారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.

Famous Posts:

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి పాటలు, Chanting of Hanuman Chalisa, anjaneya swamy temple, hanuman pooja on saturday, hanuman abhishekam items, hanuman pooja for 11 days, Saturday, sri rama

Comments

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు