Drop Down Menus

ఏదినిజం? ఏదిఅబధ్ధం? ఏది భ్రమ? Sanatana Dharma Telugu | Hindu Temple Guide

ఏదినిజం? ఏదిఅబధ్ధం? ఏది_భ్రమ?

ఒక గురుకులం లో గురువు గారు తన శిష్యులకు ఆనాటి పాఠం ఇలా చెప్తున్నారు..

ఒక సాధువు ఒక ఊరి బయట నివసించేవాడు.  ఆయన ఉదయాన్నే లేచి నది వద్దకు వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున ధ్యానం చేసుకునేవాడు.. ఇదీ అతని దినచర్య...

Also Readభార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి.

ఒక రోజు ఆయన తన దినచర్య మొదలు పెట్టటానికి నది వద్దకు వెళ్ళగా... అక్కడ ఆయన కళ్ళకు కనపడింది ఏమిటంటే.. ఒక మత్స్యకారుడు ఒక మహిళ ఒడిలో తల పెట్టుకుని నిద్ర పోతున్నాడు.. అతని పక్కనే ఒక ఖాళీ మద్యం సీసా కూడా పడి ఉంది.. సాధువుకి అదంతా చూసి చిరాకు, కోపం వచ్చాయి..

ఒక రోజుని మొదలు పెట్టాలంటే మంచి పనులతో మంచిగా మొదలుపెట్టాలి... అంతేకానీ.. ఈ మనిషి ఎంత పాపిష్టి వాడు, మహా పాపి... ఇంత పొద్దున్నే పద్ధతి లేకుండా పడి ఉన్నాడు... బహుశా నాస్తికుడు కూడా అయి ఉండవచ్చు అనుకుని... సరే నాకెందుకులే అనుకుని..తన స్నానం, ధ్యానం సంగతి చూసుకుంటున్నాడు...

సాధువు ధ్యానం కోసం కళ్ళు మూసుకుని భగవన్నామ స్మరణ చేసుకుంటుండగా...

ఒక శబ్దం వినిపించింది... కాపాడండి, కాపాడండి అని ఎవరో అరుస్తున్నారు... ఏమిటా ఆ అరుపులు అని సాధువు కళ్ళు తెరిచి చూడగా... నదిలో ఒక మనిషి మునిగిపోతూ కాపాడమని అరుస్తున్నాడు...

Also Readఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.

సాధువు ఏమి చెయ్యాలో ఆలోచించేలోపే మహిళ వళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్న మనిషి లేచి.., పరుగున వెళ్ళి నదిలో మునిగిపోతున్న మనిషిని కాపాడి ఒడ్డుకి తెచ్చాడు... మునిగిపోయే మనిషికి ఏ ప్రమాదము లేదు అని అర్ధం అయి సాధువు సంతోషపడ్డాడు...

కాపాడిన మనిషిని చూసి సాధువు ఆశ్చర్య పోయాడు.. అయోమయం పడుతున్నాడు..

ఇతన్ని చెడ్డవాడు అనుకున్నాను, ఇప్పుడు ఒక ప్రాణం కాపాడాడు.. మంచివాడు అనిపిస్తున్నాడు... ఇతను మంచివాడా, చెడ్డవాడా ""అని అర్ధం కాక అతని వద్దకే వెళ్ళి అడిగారు... నువ్వు ఒకరిని కాపాడి చాలా మంచి పని చేసావు... కానీ ఇందాకా నువ్వున్న పరిస్థితిలో... నిన్ను చూసిన నాకు నీ మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చింది... అని తన మనసులో మాట బయటపెట్టాడు...

అప్పుడు ఆ మనిషి చెప్పాడు... ""స్వామీ.. నేను చాలా రోజులు ప్రయాణించి పొద్దున్నే మా ఊరు చేరాను... నేనొచ్చే సమయానికి మా అమ్మ నా కోసం భోజనం, నీరు తీసుకొచ్చింది... హాయిగా మా అమ్మ కమ్మటి చేతి భోజనం కడుపునిండా తినేసి, మంచినీళ్ళు తాగాను... చల్లటి ఉదయం వేళ హాయైన గాలి.. కడుపునిండా తిన్న భోజనం.. నాకున్న అలసటకి నిద్ర వచ్చేసింది... మా అమ్మ ఒడిలో తలవాల్చి కంటినిండా నిద్రపోయాను... హాయిగా మంచి నిద్ర పోయి లేచాక ఇప్పుడు అలసట కూడా లేదు అని చెప్పాడు....

Also Readఅన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.

మరి ఆ ఖాళీ మద్యం సీసా ఏమిటీ అనడిగాడు సాధువు... ఆ మనిషి నవ్వుతూ చెప్పాడు...ఓ అదా..నాకు మంచినీరు తేవటానికి ఏదీ దొరక్క మా అమ్మ ఆ సీసాలో నీళ్ళు తెచ్చింది అంతే ... అన్నాడు..

అది విన్న సాధువుకి తాను ఇంతకు ముందు ఈ మనిషి గురించి ఎంత తప్పుగా అనుకున్నాడో... అని అనుకుని కొంచెం బాధనిపించి కళ్ళు తడి అయ్యాయి... మనసులోనే అతనికి క్షమాపణ చెప్పుకుని... ఇంకెప్పుడూ తొందరపడి ఎవరి గురించీ ఏ అభిప్రాయమూ ఏర్పరుచుకోకూడదు.... అని ఒక కొత్తపాఠం నేర్చుకున్నాడు..

అంతే కదా...  మనం కూడా ఒక సంఘటన చూసి అందరూ తమ దృష్టికోణం లో తలా ఒక రకంగా ఊహించేసుకుంటాము...

Also Readనవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?

అందులో నిజం ఏంటి, అబద్ధం/భ్రమ ఏంటీ అనేది ఎంత అవసరం అని చూసుకోము...

దాని వల్ల కొంత మంది అమాయకులు ఎంత బలి అవుతారో అని అంచనా కూడా వేయరు చాలామంది...

చూసే కళ్ళను, వినే చెవులను కూడా ఒక్కోసారి పూర్తిగా నమ్మకూడదు.. ఒక అభిప్రాయానికి వచ్చే ముందు కొంచెం మంచీ చెడు ఆలోచిస్తే బావుంటుంది...

Famous Posts:

ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి 


దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది


భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.


ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు


చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం


ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు


ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి

devotional story in telugu, god stories in telugu pdf, devotional stories in telugu pdf, telugu god stories in telugu, indian mythological stories in telugu, mythological stories in telugu pdf, sakshi stories in telugu, telugu bhakti story, devudu kathalu in telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments