మేఘనాథస్వామి లలితాంబిక ఆలయం  | Thirumachu Lalithambika Meghanatha Swamy Temple | Tamilnadu


 ఒక్కసారి ఈ చిత్రం గమనించండి..

తిరుమెయిచూర్ లో శ్రీ లలితాదేవి అమ్మవారి అన్నవడై సేవ ముందు ఉన్నది నెయ్యి, అందులో అమ్మవారి ప్రతిబింబము కనపడుతుంది గమనించారా ? అలా కనిపిస్తోంది అంటే అమ్మవారి అనుగ్రహము కలిగినట్లే, మనం స్వయంగా ఆ ఆలయానికి వెళ్లి ఈ సేవ గమనించినా ఇంత స్పష్టంగా దర్శించుకోగలమా ? మనసు ఆనందంతో పరవశిస్తోంది.అంతా అమ్మ దయ కాకుంటే మరేమిటి....

Also Readఇంట్లో పూజ ఎవరు చేయాలి? 

అంతేకాదు ఆ నేతిలో అమ్మవారిని దర్శించుకుంటే జీవితాంతము భార్య భర్తల మధ్య మనస్పర్థలు రాకుండా ఉంటాయి అని అమ్మవారి వాక్కుగా చెబుతారు.మరిన్ని విశేషాలు కలిగిన ఈ అద్భుతమైన ఆలయం గురించి పూర్తిగా చదవండి.

అమ్మవారిని శాంతపరచిన మహాదేవుని ఆలయం, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణమునకు అత్యంత శ్రేష్ఠమైన ప్రదేశం కూడా ఇదే, జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా పారాయణము చేయాలని ఎంతోమంది భక్తులు తపించిపోతుంటారు, ఇప్పుడు మనకు కూడా అదే కోరిక కలుగుతోంది కదూ .....

Also Readఅన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 

మేఘనాథస్వామి లలితాంబిక ఆలయము

పరమేశ్వరుడు మేఘనాథస్వామిగా జగన్మాత పార్వతీదేవి  లలితాంబికగా ఆవిర్భవించిన దివ్యక్షేత్రం తిరుమెయిచూర్‌ ఆలయం. ఇది తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లాలో ఉంది.

ఉగ్రరూపిణి నుంచి శాంత మూర్తిగా

పాండాసురుడనే రాక్షసుడు ఋషులను, దేవతలను హింసించేవాడు. అతని బాధలు పడలేక వారు జగన్మాత పరాశక్తికి మొరపెట్టుకున్నారు. దీనితో వారి బాధలు తీర్చేందుకు మాత యజ్ఞగుండం నుంచి శ్రీచక్రరథంపై ఆశీనురాలై లలితాంబిక నామధేయముతో ఆవిర్భవించినది, పాండాసురునితో భీకరంగా పోరుచేసి అతన్ని సంహరించినది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించాడు. లయకారకుని ఆదేశంతో ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సుచేసి ప్రశాంతంగా అత్యంత దయామయురాలిగా మారినది,అనంతరం వాక్‌దేవతలను సృష్టించి తనకు సహస్రనామాలతో పూజచేయమని కోరినది, ఈ సహస్రనామాలనే నేడు లలితాస్తోత్రముగా పిలుస్తున్నాము..

Also Readభర్త భార్యను ఇలా పిలవడం మానేయండి. 

అభయహస్తములో అమ్మవారు

పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిశారు, జగన్మాత శ్రీచక్ర రాజ సింహసనంపై అభయహస్తముతో భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తోంది, తమిళ మాసమైన చితిరాయ్‌( ఏప్రిల్‌ -మే)లో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలు తాకుతాయి, ఆలయ ప్రాశస్త్యం గురించి నయనార్‌.. తిరుజ్ఞాన సంబందనార్‌ తన పద్యాల్లో రాశారు. ఆయుష్షు పెంపు కోసం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 60, 80వ జన్మదినాలను స్వామి సన్నిధిలో చసుకోవడం ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు.

అన్న ప్రసాదం

ఈ ప్రాంతంలోనే గరుత్మంతుడు, అతని సోదరుడు అరుణ.. వానర రాజులు వాలి, సుగ్రీవ, యమధర్మరాజు, శనీశ్వరులు పూజలు నిర్వహించారు, ఆయుష్షు కోసం యమధర్మరాజుకు ఇక్కడ హోమాలు నిర్వహిస్తారు. భగవంతుడికి నైవేద్యంగా పెట్టే అన్నాన్ని భగవంతుని చరణాల ముందు పెట్టి అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు,ఈ ప్రసాదం అనేక రోగాల నుంచి విముక్తులను చేస్తుందని భక్తుల నమ్మకము, సూర్యభగవానుడిని పరమేశ్వరుడు శాపం నుంచి ఇక్కడే విముక్తుడిని చేశాడు.....

Also Readపూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?

శుఖ బ్రహ్మదేవిగా

జగన్మాత లలితాంబికను సౌందర్యనాయకిగా కొలుస్తారు, ఇక్కడ వెలసిన దుర్గమ్మవారికి ఎనిమిది చేతులుండటంతో సుఖబ్రహ్మ దుర్గాదేవిగా ఆరాధిస్తారు, ఆమె చేతిలోని రామచిలుక శాంతిని ప్రబోధిస్తుంది, ఆలయ ప్రాంగణంలో మరిన్ని ఉపాలయాలను చూడవచ్చు.....

లలితా సహస్రనామావళి 

లలితాంబికకు హయగ్రీవుడు భక్తుడు, లలితా సహస్రనామాల గురించి అగస్త్యునికి వివరిస్తాడు,యావత్‌ విశ్వంలో ఈ నామాలను స్తుతించేందుకు అనువైన క్షేత్రం ఏది అని అడగగా తిరుమెయిచూర్‌ అని హయగ్రీవుడు వెల్లడిస్తాడు. దీంతో అగస్త్య మహాముని తన సతీమణి లోపాముద్రతో కలిసి ఈ క్షేత్రానికి చేరుకొని లలితాంబిక సన్నిధిలో సహస్రనామాలు జపిస్తాడు. దీనితో సంతోషించిన అమ్మవారు వారి ముందు నవరత్నాలు పొదిగిన హారము ధరించి ప్రత్యక్షమైనట్టు స్థలపురాణం చెబుతోంది, అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామాలను పఠిస్తే అన్ని శుభాలు కలుగుతాయి....హర నమఃపార్వతీపతయే హర హర మహాదేవ శంభోశంకర ఓం నమఃశివాయ.

Also Readఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?

ఇలా చేరుకోవచ్చు

తమిళనాడులోని జిల్లా కేంద్రమైన తిరువరూర్‌కు 25 కి.మీ.దూరంలో ఉంది. సమీప రైల్వేస్టేషన్‌ పేరళంలో దిగి వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం తిరుచ్చిరా పల్లి. చెన్నై ఎగ్మూర్ నుంచి కరైకాల్‌ వరకు వెళ్లే రైళ్లు పేరళం స్టేషన్లో ఆగుతాయి.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

meghanatha swamy temple, tamil nadu, tamil nadu temples, lalithambigai story, Thirumachu Lalithambika Meghanatha Swamy Temple, Sree Lalithambigai Temple, Thirumeeyachur, Lalithambigai temple, 

Comments