Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

పాపాలను, శాపాలను పోగొట్టి, కష్టాలను తీర్చి, ఆయుష్షును పెంచే అక్షర సాధనం ఆదిత్య హృదయం పారాయణం | Aditya Hrudayam With Telugu

ఆదిత్య హృదయం పారాయణ..!!

ఆదిత్య హృదయం పరమ పవిత్రం.

ఒక స్తోత్ర రాజం వంటి మహా మంత్రం.

పాపాలను, శాపాలను పోగొట్టి, కష్టాలను తీర్చి, ఆయుష్షును పెంచే అక్షర సాధనం ఆదిత్య హృదయం.

ఈ అమోఘమైన స్తోత్రరాజాన్ని శ్రీరామచంద్రునికి

అగస్త్య మహర్షి మంత్రాలవంటి మాటలలో వివరించాడు.

ఆరోగ్య భాగ్యమును, సకల సంపదలను ప్రసాదించే వానిగా, ప్రత్యక్షదైవముగా సూర్య భగవానుడు పేరు ప్రఖ్యాతి కాంచినాడు.

ఆదిత్య హృదయం మహా పవిత్రమైన గ్రంథం.

శ్రీమద్‌ రామాయణ మహాకావ్యంలో..

యుద్ధకాండలో 105వ సర్గలో ..

సూర్య భగవానుని స్తుతికి 'ఆదిత్య హృదయం' 

అని నామకరణం చేశారు.

వీటిలో ఆదిత్య నామం శ్రీరామాయణ కర్త అయిన

వాల్మీకి మహర్షికి చాలా ఇష్టం.

ఆదిత్యులు 12 మంది.

అందులో విష్ణువు ముఖ్యుడు.

ఆదిత్యులలో ''నేను విష్ణువు''ను అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను.

'ఆదిత్యానా మహం విష్ణుం''. 

అందువల్ల ఆదిత్య హృదయంను విష్ణువు స్తోత్రంగా భావిస్తారు.

ఆదిత్య హృదయం విశేష పుణ్యప్రదమైనది.

దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే యిహలోకాన అన్ని రకాల సంపదలు,

పరమున పుణ్య లోకములను పొందుదురు.

సంతానం లేనివారు:'ఆదిత్య హృదయం'ను

నిత్యం పారాయణం చేసినచో వారికి సంతానం కలుగును.

న్యాయ వివాదాలలో చిక్కుకొని కోర్టుల చుట్టు తిరుగుతూ సతమతం అయ్యేవారు దీనిని పారాయణం చేసిన వారికి విజయం కలుగుతుంది.

దరిద్రంతో భాదపడుచున్న వారు అనునిత్యం పారాయణం చేస్తే వారికి సకల అష్ట ఐశ్వర్య సంపదలు కలుగుతాయి.

అనారోగ్య రుగ్మలతో బాధపడుచున్నవారు

ఆదిత్య హృదయం పారాయణం చేసినచో

వారి రోగాలు మాయమగును.

నిరుద్యోగులు పారాయణం చేస్తే వారికి మంచి

ఉద్యోగం లభిస్తుంది.

విద్యార్థులు పారాయణం చేసినచో పరీక్షలలో

మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.

ఆదిత్య హృదయం రామ, రావణ సంగ్రహములో వెలువడింది. రామరావణ యుద్ధం జరుగుతోంది.

గొప్ప తపశ్శక్తితో పరమశివుడి అనుగ్రహం పొందిన రావణుడు ధైర్యంగా శ్రీరాముణ్ని ఎదుర్కొంటున్నాడు. రావణుణ్ని ఎలా సంహరించడమా అని శ్రీరాముడు తీవ్రంగా యోచిస్తున్నాడు.

అమోఘమైన తపశ్శక్తి కలిగిన రావణాసురున్ని వధించడానికి శ్రీరామునికి శక్యం కాలేదు.

రావణుడు చావు లేకుండునట్లు అనేక వరాలు పొందడం వల్ల శ్రీరామునకు రావణాసుర వధ వీలుకాలేదు. శ్రీరాముడు ఎన్ని అస్త్ర శస్త్రములను ప్రయోగించినా రావణుడు చావలేదు.

దీనితో శ్రీరాముడు చింతాక్రాంతుడై ఉండెను.

ఈ యుద్ధాన్ని అంతరిక్షం నుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు మొదలైనవారంతా తిలకిస్తున్నారు.

వారిలో అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు.

రావణుడి యుద్ధ తీవ్రత చూసి దిగులుతో ఉన్న శ్రీరాముడి సమీపానికి అగస్త్యుడు వచ్చి అతడి దైవత్వాన్ని గుర్తుచేసి ఆదిత్య హృదయ మంత్రం బోధిస్తాడు.

రామరావణ యుద్ధాన్ని చూడటానికై దేవతలతో కలిసి ఆగస్త్య మహాముని శ్రీరాముని చేరుకొని యిట్లనియే '

ఓ రామా! నీకు మహా పవిత్రమైన రహస్యమును చెప్పెదను వినుము.

దీనివల్ల నీవు యుద్ధమున రావణున్ని సులభంగా జయించగలవు.

మహా పుణ్యప్రదం,జయప్రదం, మంగళకరం, శుభకరం, సమస్త పాపాలను నశింపజేయు, దీర్ఘ ఆయుష్షును కలుగజేయు ఆదిత్య హృదయం నీకు ఉపదేశించెదను.

దీనిని నీవు భక్తి శ్రద్ధలతో పఠించిన యెడల

యుద్ధములో సులభంగా జయించెదవు' అని మంత్రమును ఉపదేశించెను.

బ్రహ్మ మొదలగు సమస్త దేవతలు, అనగా..

బ్రహ్మ,

విష్ణువు,

శివుడు,

కుమారస్వామి,

తొమ్మండుగురు ప్రజాపతులును,

దేవేంద్రుడు,

కుబేరుడు,

మృత్యువును,

యముడును, 

చంద్రుడును, 

సముద్రుడును

అను వీరందరును ఇతడే.

పితృదేవతలు,

అష్టవసువులు,

సాధ్యులు,

అశ్వినీ దేవతలు,

మరుత్తులు, 

మనువు, 

వాయువు, 

అగ్ని 

మొదలగు వారిలో సూర్యుడే అంత ర్యామియై ఉన్నాడు.

బంగారు రూపం గల అందం గర్భమందు గలవాడు. బంగారంతో సమానమైన అంత:కరణ గలవాడవును, చల్లనివాడవును,

శత్రుసంతానములను పోగొట్టువాడవును,

లోకమునకు వెలుతురు కలుగజేయు వాడువును, అదితియొక్క కుమారుడవును,

మంచును పోగొట్టువాడవును అగు నీకు భక్తితో నమస్కరించి స్తోత్రమును చేయుచున్నాను.

ఋగ్వేదం, 

యజుర్వేదం, 

సామవేదం, 

అధర్వణవేదం 

అనే నాలుగు వేదములయొక్క సారం అయిన వాడవు.

సమస్త వేదాలును నీవే అయిన వాడువును సముద్రజలముపై శయనించు వాడవును. దక్షిణాయనమున వింధ్య పర్వతమున సంచరించువాడవును

అయిన నిన్ను భక్తి శ్రద్ధలతో సేవించుచున్నాను

అని శ్రీరాముడు అనెను.

సమస్త నక్షత్రములకును, గ్రహములకును అధిపతివయిన వాడవును లోకమునకు ఆధారభూతుడవును,

స్వర్గం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలతో ఉండు ఆకాశం, దిక్కులు, భూమి, సముద్రం

అన్నీ నీ వీర్యముచే నిలిచి ఉన్నవి.

ఇంద్రుడు,

ధాత,

భృగుడు,

పూషుడు,

మిత్రుడు,

వరుణుడు,

ఆర్యముడు,

ఆర్చిస్సు,

వివస్వంతుడు,

త్వష్ట,

సవిత,

విష్ణువు 

అను పేరు గల 12 ఆదిత్యులలో అంతర్యామి అయిన నీకు భక్తితో నమస్క రిస్తున్నాను.

ప్రళయ కాలమున ఈశ్వరుడు ఈ జగత్తును నాశనం చేయగా మరల సృష్టించి, కిరణములచే లోకానికి తాపమును కలుగజేసి, వర్షాలను కురిపించి

సర్వ జయాలను కలుగజేసే నిన్ను ప్రార్థిస్తున్నాను.

ఈవిధంగా ఆదిత్య హృదయమును మూడుసార్లు పఠించగా ఆ పరమాత్ముడు ఆనందించినవాడై

దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరుడై శ్రీరాముని జూచి ''ఓ రామా! రావణునకు అంత్య కాలము సంప్రాప్తించినది ఆలస్యం చేయక త్వరపడుము''

అని ఆశీర్వదించాడు.

త్వర అనే మాట ఆదిత్యుని నోట వెలువడిన వెంటనే రావణ సంహారం జరిగి లోక కల్యాణం జరుగుతుంది.

బయటి శత్రువులనే కాక అంతశ్శత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయం అమోఘమైన అక్షర సాధనం అని ఉపదేశించాడు.

తాను వెలుగతూ ప్రపంచానికి వెలుగును ప్రసాదించే భాస్కరుని నమ్ముకుంటే ఏమి లోటు ఉండదనెను.

సూర్యుడికి గల విశేష నామాలు ఆదిత్య హృదయంలో ప్రస్తావితమయ్యాయి.

ప్రాణికోటిని పూజించేవాడు గనుక ‘పూష’.

కిరణాలతో శోభిల్లేవాడు గనుక ‘గభస్తిమంతుడు’. గర్భంలో పుష్కలంగా హిరణ్యం దాచుకున్న హిరణ్యగర్భుడు. ఇట్లా ఎన్నో పేర్లతో సార్థక నామధేయుడు సూర్యుడు.

బ్రహ్మ సృష్టికి మూలం.

సమస్త జీవజాలానికి ఉదయ గుణం ఇచ్చేవాడు బ్రహ్మ.

ఉదయం వివేకోదయానికి చిహ్నం.

జ్ఞాన వివేచనలకు ఉదయకాలం బ్రహ్మ జ్ఞానంతో సమానమంటారు విజ్ఞులు.

సకల లోకాలకు శుభాలు కూర్చేవాడు శంకరుడు మధ్యాహ్నకాలానికి ప్రతీక.

జీవనదులకు, పంట పొలాలకు, మానవాళికి

శక్తి ప్రదాత మార్తాండుడు.

సాయంకాలం విష్ణురూపం.

విష్ణువు సర్వ వ్యాపకుడు.

సాయంకాలం విష్ణువులా జగత్తుకు తేజస్సును ఇచ్చే లోకబాంధవుడిగా సూర్యుణ్ని కొలుస్తాం.

వేదాల్లో సూర్యదేవతాసూక్తం ఉంది.

సూర్యుడు త్రిమూర్త్యాత్మకుడు.

వాల్మీకి రామాయణంలోని ‘ఆదిత్య హృదయం’

నిత్య పారాయణ యోగ్యం.

యుద్ధకాండలో 107వ సర్గలో 31 శ్లోకాల్లో ఉంది.

ఇది కేవలం స్తోత్రం కాదు.

సకల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని తనలో మిళితం చేసుకొని తనను ఆరాధించేవారిని తగిన రీతిలో తరింపజేసే స్తోత్రరాజం ఆదిత్య హృదయం.

ఆదిత్యులు పన్నెండు మంది.

వీరిలో విష్ణువు కూడా ఒకడు.

ఆదిత్యుల్లో ప్రధానస్థానం వహించిన విష్ణువును ఉద్దేశించి చెప్పిన స్తోత్రం ఇది.

శాంతిని, కాంతిని, స్థిరత్వాన్ని, స్థాయిని ప్రసాదించే సామర్థ్యం ఆదిత్య హృదయంలో ఉంది.

రామచంద్రుడికి రణరంగంలో సహకరించినట్లుగానే ఆదిత్య హృదయం ప్రాణికోటికి జీవితంలో ఉపకరిస్తుంది. కృష్ణార్జునుల మధ్య గీతామృతం ప్రవహించినట్లుగానే అగస్త్య రామచంద్రులు ఆలంబనంగా ఆదిత్య హృదయం ఆవిర్భవించింది. రెండూ రణరంగంలోనే వెలువడటం విశేషం.

ఆదిత్య హృదయంలోని మొదటి తొమ్మిది శ్లోకాలు స్తోత్రానికి పూర్వ రంగాన్ని సమకూరుస్తాయి.

చివరి తొమ్మిదీ స్తోత్ర ప్రాశస్త్యాన్ని, ఫలశ్రుతిని అందిస్తాయి. మధ్య పన్నెండు శ్లోకాలు ద్వాదశాదిత్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కనిపిస్తుంది.

స్తుతి మధ్య భాగంలో ‘ద్వాదశాత్మన్నమోస్తుతే’ అనే నమోవాకం ఉంది.

అగస్త్యుడు శ్రీరాముని ‘రామరామ మహాబాహో’ అని సంబోధిస్తాడు. ఆదిత్య హృదయం పరమ పవిత్రమని,

సర్వశత్రు వినాశనమని నిత్యం, అక్షయం, పరమ కల్యాణదాయకమైన స్తోత్రమని వివరిస్తాడు.

భాస్కరుడిలో సకల దేవతలు మూర్తీభవించి ఉన్నారని అగస్త్యుడు వివరిస్తాడు.

ఇంద్రుడు, కుబేరుడు, యముడు, సోముడు, వరుణుడు, పితృ దేవతలు, అష్ట వసువులు, అశ్వినీ దేవతలు, మరుద్గణాలు- అందరూ భాస్కరుడి ప్రతిరూపాలే.

గాలి, అగ్ని, ఊపిరి, ఋతువులు- వీటన్నింటికీ ఆధారం సూర్యుడు. సమస్త ప్రాణులందు అంతర్యామి రూపంలో ఉంటూ వారు నిద్రపోయినా తాను మేల్కొంటాడు.

సర్వకాల సర్వావస్థల్లోనూ మనకు తోడునీడగా 

మనలో వెలుగుతున్న ఆదిత్య రూపం సర్వదా ఆరాధ్యం.

ఆదిత్య స్తోత్రాన్ని మూడుసార్లు పఠిస్తే యుద్ధంలో విజయం లభిస్తుందని అగస్త్యుడు బోధిస్తాడు. 

ఆ తరవాత శ్రీరాముడు ఆనందంతో, 

నిష్ఠతో ఆదిత్య హృదయం జపించి 

రావణ సంహారం గావిస్తాడు

జై శ్రీ రామ జయ రామ జయ రామ

జై శ్రీ రామ జయ రామ జయ రామ

జై శ్రీ రామ జయ రామ జయ రామ

ఆదిత్య హృదయం చదివితే ఏమవుతుంది..

శ్రీకృష్ణుడు భగవద్గీతని ఏ సందర్భంలో చెప్పాడో మనందరికీ తెలిసిందే!

కురుక్షేత్ర సంగ్రామంలో తన రక్తసంబంధీకులతో యుద్ధం చేసేందుకు అర్జునుడు విముఖుడు కావడంతో తనని కార్యోన్ముఖుని చేసేందుకు సాగిన బోధే భగవద్గీత. రామాయణంలోనూ ఇలాంటి సందర్భం ఒకటి ఉంది.

ఆ సమయంలో వెలువడిన స్తోత్రమే ఆదిత్య హృదయం.

అది రామాయణంలోని యుద్ధకాండ.

లంకలోకి అడుగుపెట్టిన రాముని ఎదుర్కొనేందుకు, రావణుడు భీకరమైన రాక్షసులందరినీ యుద్ధభూమికి పంపాడు. అలా తన మీదకు వచ్చినవారిని వచ్చినట్లుగా సంహరిస్తున్నాడు రాముడు.

ఒకపక్క వారితో యుద్ధం చేస్తున్న ఆయన శరీరం అలసిపోతోంది.

అంతకుమించి తన కళ్లెదుట జరుగుతున్న మారణహోమాన్ని చూసి మనసు చలించిపోతోంది.

దాంతో యుద్ధం పట్ల విముఖత మొదలైంది.

అగస్త్య మహాముని రాములవారి మానసిక స్థితిని గమనించాడు.

నిదానంగా ఆయన చెంతకు చేరుకుని..

ఆ ఆదిత్యుని కనుక ప్రార్థిస్తే ఎనలేని శక్తి లభిస్తుందనీ, అంతులేని విజయాలు పొందవచ్చనీ సూచించాడు.

అలా చెబుతూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందించాడు. ఈ ఆదిత్య హృదయంలో 30 శ్లోకాలు ఉన్నాయి.

మొదటి ఆరు శ్లోకాలలోనూ ఆదిత్యుని పూజించమన్న సూచన కనిపిస్తుంది.

7వ శక్లోకం నుంచి 14వ శ్లోకం వరకూ ఆదిత్యుని

ప్రశస్తి కనిపిస్తుంది.

15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకూ ఆదిత్యుని

ప్రార్థన సాగుతుంది.

22వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకూ ఆదిత్యహృదయాన్ని పఠిస్తే కలిగే శుభాల గురించిన 

వర్ణన ఉంటుంది.

ఇదంతా విన్న రాములవారు కార్యోన్ముఖులు కావడాన్ని 29, 30 శ్లోకాలలో గమనించవచ్చు.

ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాత రాముడికి విజయం అనాయాసంగా లభించిందని వేరే చెప్పాలా! రాములవారికే శుభాన్ని అందిస్తే ఇక సామాన్యులు అనుమానించాల్సిన పని ఏముంది.

అందుకే జీవితంలో ఎలాంటి ఆపదలు ఎదురైనా, అనారోగ్యాలు ఏర్పడినా... ఎలాంటి ఒడిదొడుకులలోనైనా ఆదిత్య హృదయం మనల్ని ఒడ్డుకి చేరుస్తుందన్నది పెద్దల మాట.

శత్రువినాశనం కావాలన్నా,

దారిద్ర్యం దూరమవ్వాలన్నా,

మనోవాంఛలు తీరాలన్నా

ఆదిత్య హృదయం తారకమంత్రంలా పనిచేస్తుందని తరతరాల నమ్మకం.

‘మూడుసార్లు కనుక ఆదిత్య హృదయాన్ని పఠిస్తే

ఈ సంగ్రామంలో విజయం సాధిస్తావు’ అంటూ సాక్షాత్తూ అగస్త్య మహర్షే 26వ శ్లోకంలో (ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి) పేర్కొంటాడు.

మన అవసరాన్నీ, అవకాశాన్నీ బట్టి ఎన్నిసార్లయినా

ఈ శ్లోకాన్ని పఠించవచ్చు.

ముఖ్యంగా సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి, సూర్యునికి అభిముఖంగా నిలిచి ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు.

ఇంతకీ రాములవారే ఓ అవతారపురుషుడు కదా!

మరి ఆయన ఆదిత్యుని కొలవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అనుమానం రాక మానదు. 

ఆ సందేహానికి సమాధానం ఈ స్తోత్రంలోనే కనిపిస్తుంది. ఆదిత్య హృదయం అంటే ఆదిత్యుని హృదయం అన్న అర్థంతో పాటు ‘ఆదిత్యుని కలిగి ఉన్న హృదయం’ 

అన్న అర్థం కూడా వస్తుంది.

ప్రతి మనిషిలోనూ ఉన్న పరబ్రహ్మకు ప్రతిరూపమే 

ఆ ఆదిత్యుడు.

‘ఈ దేహం నాది’ అనుకున్నప్పుడు మనం ఈ సృష్టికంటే భిన్నమైనవారం అనుకుంటాము. 

కానీ ‘ఈ సృష్టికి నేను కూడా ఒక ప్రతీకని’అనుకున్నప్పుడు ఎలాంటి ఎల్లలూ లేని ఆత్మస్వరూపాన్ని దర్శించగలం.

ఆదిత్యుడు అన్న పేరుని వాడటం వెనుక ఉద్దేశం 

ఇదే కావచ్చు! ఆదిత్యుడు అంటే ఆద్యంతాలు లేనివాడు అని అర్థం. 

ఆ ఆదిత్యుని మనలోనే దర్శించిన రోజున ఎలాంటి పరిమితులూ మనకి అడ్డంరావు. 

అందుకే సమస్త దేవతలకూ ప్రతీకగా, 

అజ్ఞానాన్ని రూపుమావేవాడిగా, 

సకల ప్రాణులలో ఉండే అంతర్యామిగా, సృష్టిస్థితిలయకారునిగా 

ఆ ఆదిత్యుని ఈ స్తోత్రంలో పేర్కొన్నారు.

ఓం నమో ఆదిత్యాయ నమః..!!

స్వస్తి..!!

ఓం నమః శివాయ..!!

Famous Posts:

మనసులోని కోర్కెలు తీర్చే దశావతార నృసింహ మంత్రము


దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు ఎందుకో తెలుసా?


స్త్రీ మూర్తులకి ఇవి అవసరం..


శుక్రవారం విడిచిన దుస్తుల్నే_ధరిస్తే..?


ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న, ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమిచెయ్యాలి?


గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు


ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు


తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు

aditya hrudayam telugu pdf, aditya hrudayam mp3, aditya hrudayam telugu pdf with meaning, aditya hrudayam by ms subbulakshmi, aditya hrudayam sanskrit, aditya hrudayam benefits, aditya hrudayam meaning, aditya hrudayam mp3 free download ms subbulakshmi


Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు