Drop Down Menus

మకరతోరణం అంటే ఏమిటీ..? ఆలయంలో దీనికున్న విశిష్టత ఏమిటీ..!! History of Makara Thoranam in temples

 

మకరతోరణంఅంటేఏమిటీ..? ఆలయంలోదీనికున్నవిశిష్టతఏమిటీ..!!

 దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణo మధ్య భాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షస ముఖం కనబడుతుంది.... దానికే 'మకర_తోరణం' అని పేరు.. ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్య భాగంలో అమర్చటానికి గల కారణము గురించి స్కంద మహాపురాణం లో ఒక కథ వుంది..

పూర్వం కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనము లలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు.. చివరకు పరమశివుని పత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు... అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు.. 

పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.. మరణం లేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అనే భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు... భక్త సులభుడైన బోళా శంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడు..

ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు.. యుక్తిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు.. శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోక భాగం నుంచి మొదలు పెట్టి కంఠం వరకూ తిన్నాడు.. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు..

Also Read ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు 

అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. ఆ ప్రార్ధన ఆలకించిన పరమశివుడు.., ఈనాటి నుంచి అన్ని దేవాలయాలలో దేవతా మూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని , ఆశను తింటూ ఉండు.. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు..

ఆనాటి నుంచి కీర్తిముఖుడు  దేవాలయాల లోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణ మధ్య భాగాన్ని తన రాక్షస ముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని,, దురాశను కబళిస్తున్నాడు..

ఈ కారణం గానే దేవతా మూర్తుల వెనుక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికే 'మకర_తోరణం' అని పేరు వచ్చింది...

Famous Posts:

దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు ఎందుకో తెలుసా?


శుక్రవారం విడిచిన దుస్తుల్నే_ధరిస్తే..?


ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న, ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమిచెయ్యాలి ?


గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు


ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు


తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు

మకరతోరణం, makara thoranam price, makara thoranam small, makara thoranam meaning in telugu, silver makara thoranam, makara thoranam makers in hyderabad, makara thoranam story telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.