లక్ష్మీదేవిని, సరస్వతిని ఆరాధిస్తే వచ్చే ఫలితాలు ఏమిటో తెలుసా ? Saraswati and Lakshmi Devi Pooja Vidhanam in Telugu

 లక్ష్మీదేవిని, సరస్వతిని ఆరాధిస్తే వచ్చే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం...

🌹 జీవితంలో విద్య మరియు సంపద ప్రధానమైన పాత్రలను పోషిస్తాయి. ఘనమైన సంపదలు కలిగినవారి పట్ల సరస్వతీదేవి అనుగ్రహం ఉండకపోవచ్చును గానీ, విద్యావంతులైన వారిని లక్ష్మీదేవి తప్పకుండా కటాక్షిస్తుంది. ఇందుకు ఎన్నో సంఘటనలు, ఉదాహరణలుగా కనిపిస్తాయి.

🌹 జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎవరికైనా విద్య అవసరమే. విద్యవలన విజ్ఞానం కలుగుతుంది .. విజ్ఞానం వలన గౌరవం పెరుగుతుంది. అలాంటి విద్య .. విజ్ఞానం లభించాలంటే అందుకు హయగ్రీవస్వామి అనుగ్రహం, సరస్వతీదేవి కరుణ ఉండాలి.

🌹 అనునిత్యం హయగ్రీవ స్వామి స్తోత్రం .. సరస్వతీదేవి ద్వాదశ నామాలు పఠించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. విద్యావంతులపట్ల లక్ష్మీదేవి చల్లని చూపు సహజంగానే ఉంటూ ఉంటుంది.

ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుకునేవారు, ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తర పారాయణం చేసుకోవాలి. 

🌹 ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అంతేకాదు తలపెట్టిన కార్యాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు .. ఆటంకాలు తొలగిపోతాయి. అందువలన అనునిత్యం లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని ఆరాధించడం మరువకూడదు.

Famous Posts:

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి

నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..? 

అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!

భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం 

హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూడ‌కూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?

పిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు

saraswathi, lakshmi devi, goddess, saraswathi lakshmi devi pooja telugu, bhakthi, pooja in telugu,  లక్ష్మీదేవి, సరస్వతి, Hindu Goddesses, saraswati, lakshmi parvati story

Comments