Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తలనీలాలు 'పుట్టు వెంట్రుకలు' ఎందుకివ్వాలి - ఫ‌లితం ఏంటీ ? The scientific reason behind the Mundan ceremony - Puttu Ventrukalu to Children's

తలనీలాలు 'పుట్టు వెంట్రుకలు' ఎందుకివ్వాలి - ఫ‌లితం ఏంటీ

దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి? ఫ‌లితం ఏంటీ? అనే సందేహం చాలామందికి వ‌స్తుంటుంది. నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి.

వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక విషయ వాసన వలన పాపాలు అనేవి తల జుట్టుకు అట్టిపెట్టుకుని వుంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన ( పుట్టు వెంట్రుకలు ) కార్యక్రమం నిర్వహిస్తారు.

Also Read :జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకం ఎప్పుడు రాయించుకోవాలి?

పాపాలను కలిగివున్నందునే శిరోజాలను ‘శిరోగతాని పాపాని’ అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన వుంది. జయద్రధుడు (సైంధవుడు)ని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు.

శిశువు పుట్టిన సంవత్సరంలోపు మొట్ట మొదటి సారిగా పుట్టు వెంట్రుకలు తీసేందుకు ఎందుకు ముహుర్తానాకి ప్రాధాన్యత ఇచ్చారంటే శిశువు మొదటి సారి జుట్టు తీయడం వలన గతజన్మ పాప ప్రక్షాళనతో బాటు మంచి జ్ఞానార్జనకు ఉపయోగకరంగా ఉండెందుకు ముహూర్తం ఉపయోగ పడుతుంది. వాటికి సంబంధించిన వివరాలను కొన్నింటిని ఈ క్రింది వాటిలో గమనిద్దాం.

* పుట్టు వెంట్రుకలు ఏ సంవత్సరంలో తీయాలి అనే విషయానికొస్తే శిశువు పుట్టిన సంవత్సరంలోపు, మూడవ ఏట అది తప్పితే ఐదు సంవత్సరాలలో తీయాల్సి ఉంటుంది.

* ఇందులో విశేషించి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టు వెంట్రుకలు ( కేశ కండన ) కార్యక్రమం జరిపించాలి.

* మగ పిల్లలకు సరిమాసంలో, ఆడ పిల్లలకు బేసి మాసంలో తీయాలి.

* జాతకం ఆధారంగా తారాబలం, శుభ లగ్నం, శుభ గ్రహ సంపత్తి మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకుని అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుని ద్వార ముహూర్తం నిర్ణయం చేయించుకుని కార్యం నిర్వహించాల్సి ఉంటుంది.

* అనుకూలమైన వారాలు :- సోమ , బుధ, గురు, శుక్రవారాలలో మధ్యాహానం 12 లోపు తీయిచాలి.

* అనుకూల తిధులు :- శుక్లపక్ష విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిధులు మంచివి.

* ఈ కార్యం చేయుటకు ఘాతవార దోషం వర్తించదు. ( ఘాతవారంలో అయిననూ ముహూర్తం కలిస్తే చేయవచ్చును )

* గురు, శుక్ర మౌడ్యాలలో చేయకూడదు.

* కుటుంబ పెద్ద మరణించిన ఇంట్లో అబ్ధికం చేసే వరకు పిల్లల పుట్రువెంట్రుకలు తీయకూడదు.

* మొదటపుట్టిన ( తోలుచూరు ) పుత్రిక, పుత్రునకు జ్యేష్ఠమాసములో తీయకూడదు.

* శిశువు తల్లి గర్భవతిగా ఉండి 5 నెలలు దాటినా పుట్టు వెంట్రుకలు తీయరాదు.

Also Read : తల్లితండ్రుల గొప్పదనం గురించి  శాస్త్రాలలో చెప్పబడిన విధానం

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమనగా మనకు అనుకూలంగా ఉన్న సమయంలో ముహూర్తం పెట్టమని జ్యోతిష పండితున్ని ఒత్తిడి చేయకూడదు.

శిశువు జాతక బలం ఆధారంగా శాస్త్ర సూచిత నియమాలకు అనుగుణంగా సరైన ముహూర్తం ఎప్పుడు వస్తుందో అప్పుడే చేయాలి.

Famous Posts:

మీరు పడుకునే విధానం బట్టి మీ గత జన్మ ఎలాంటిదో తెలుసుకోవచ్చు?


విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం


పాపాలను, శాపాలను పోగొట్టి, కష్టాలను తీర్చి, ఆయుష్షును పెంచే ఆదిత్య హృదయం


బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే వచ్చే ఫలితాలు


ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం స‌మ‌ర్పించాలి?


కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు 

పుట్టు వెంట్రుకలు, తలనీలాలు, Puttu Ventrukalu, hair, childern, puttu ventrukalu muhurtham, hindu hair cutting ceremony, 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు