మనీ ప్లాంట్ ఇంట్లో వుంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఇంట్లో మనీ ప్లాంట్‌ను పెంచడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని ఎంతోమంది విశ్వాసం.
అంతేగాకుండా మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం ద్వారా ఆర్థిక సమస్యలు ఉండవు . రుణబాధలు తీరిపోతాయాని పెద్దలు అంటుంటారు. సానుకూల తరంగాలను ప్రసరింపజేయడంలో మనీ ప్లాంట్ ముందుంటుంది. ఇంకా ఇంట్లోని గాలిని సైతం మనీ ప్లాంట్ శుభ్రపరుస్తుంది.
Also Read : వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
మనీ ప్లాంట్ పెంచాలని చాల మందికి సరదా ఉంటుంది, కానీ వాస్తు ప్రకారం ఈ మొక్కను ఏ దిశలో పెంచితే శుభ ఫలితాలు వస్తాయి, ఏ దిశలో పెంచితే అశుభ ఫలితాలను ఇస్తాయి అనే విషయంపై అవగాహన లోపంతో మధన పడుతూ ఉంటారు. సున్నితమైన తీగలతో వేగంగా పెరిగే ఈ మొక్కను ఎక్కడబడితే అక్కడ పెంచరాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కను నిర్దిష్ట ప్రదేశంలో పెట్టినప్పుడే అది శుభఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
ఇంట్లో శుభాలు కలుగాలంటే తూర్పు ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచడం చేయాలి. గణేశుడి ఆధిపత్య స్థానమైన ఇంటికి ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్‌ను పెంచడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ఈ దిశకు వినాయకుడు అధిపతి. ఆగ్నేయ దిశలోనే పాజిటివ్ ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుంది, అందుకే ఈ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచాలి అప్పుడే సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈ దిశకు శుక్రుడు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ కారణాల చేత మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో పెంచాలి.
Also Read : సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
మనీ ప్లాంట్‌ను మట్టిలో పెట్టి పెంచాలి. నీటి డబ్బాల్లో పెట్టి పెంచవచ్చును. మనకు కావలసినట్టుగా ఇంటిలోపల కానీ, బయట కానీ మనీ ప్లాంట్‌ను పెంచుకోవచ్చును. దీనివల్ల ఇంట్లో సంపదకు, సౌభాగ్యం అనుకూలంగా ఉంటాయి. మొక్కకున్న ఎండిన, పసుపు రంగు ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకుంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది.
మనీ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఈశాన్య మూలన ఉంచరాదు. దీనివల్ల ధననష్టం, అనారోగ్య సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Famous Posts:
> చాలామందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం
> ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
> ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి
> నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..?
> అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!
> భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం
మనీ ప్లాంట్, మనీ ప్లాంట్ ఎక్కడ పెట్టాలి, Money Plant, Vastu Shastra, money plant benefits, money plant scientific name, types of money plant,