Drop Down Menus

బంగారు ఉసిరి కాయలు కురిసింది ఇక్కడే | What Is Story Behind Kanakadhara Stotram - Adi sankaracharya - Mahalakshmi

 

బంగారు ఉసిరి కాయలు కురిసింది ఇక్కడే

ఆ ఇల్లు... కేరళలోని అగ్రహారాల్లో కనిపించే సాధారణ గృహాల్లానే అనిపిస్తుంది. కానీ, ఆ ఆవరణకో ఐతిహ్యం ఉంది. అక్కడే, ఆదిశంకరులు ఆశువుగా కనకధారాస్తోత్రం వల్లించారు. ఆదిలక్ష్మి ఆ భక్తికి మెచ్చి బంగారు ఉసిరికాయల వాన కురిపించింది.

పళం తోట్టం... అన్న పేరు కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో తొంభై శాతం మందికి తెలియదు. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న క్షేత్రం ఇది. పన్నెండు వందల సంవత్సరాల నాటి ఓ అపురూప ఘట్టానికి సాక్ష్యం ఆ గ్రామం. అద్వైత సిద్ధాంత రూపకర్త ఆదిశంకరుడు. ఆయన బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, విష్ణు సహస్రనామానికి భాష్యం రచించారు. నృసింహ కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగం, అన్నపూర్ణాదేవి అష్టకం లాంటి ఎన్నో రచనలు అందించారు. దేశం నలుమూలలా పీఠాలను ఏర్పాటు చేశారు. ఈ కారణజన్ముడి జన్మస్ధలం కాలడి. పెరియార్‌ నదీ తీరంలోని కాలడికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళం తోట్టం. బాల్యంలోనే సన్యాసం స్వీకరించారు శంకరులు. సర్వసంగ పరిత్యాగి భిక్షాటన మీదే జీవించాలి. ఆ నియమం ప్రకారం... ఇంటింటికి వెళ్లి భిక్ష స్వీకరించేవారు. అలా ఒక రోజున ఓ ఇంటికి వెళ్ళారు.

ఆ ఇంట్లో వితంతువు ఉండేది. వంటింట్లో పిడికెడు గింజలైనా లేని పేదరికం ఆమెది. ఇల్లంతా వెదకగా.. ఒక ఎండు ఉసిరికాయ కనిపించింది. చిరుగుల చీరతో గడప దాటడానికి అభిమానం అడ్డొచ్చి... తలుపు చాటు నుంచే ఆ ఉసిరికాయను భిక్షాపాత్రలో వేసింది. ఆ దారిద్ర్యాన్ని చూసిన బాలశంకరుల గుండె బరువెక్కింది. ఆ ఆవేదన లోంచే ఇరవై నాలుగు శ్లోకాలుగా శ్రీలక్ష్మీస్తుతి రూపు దాల్చింది. ఆ స్తోత్రానికి సంతుష్టురాలైన సిరులతల్లి... 'ఏం కావాలో కోరుకో నాయనా?' అని అడిగింది. 'ఈ పేదరాలి దారిద్ర్యాన్ని దూరం చేయమ్మా' అంటూ అర్ధించాడు. అందుకు శ్రీదేవి అంగీకరించలేదు. 'ఆమె తన గతజన్మల కర్మ ఫలం ఇంకా అనుభవించాల్సి ఉంది' అని జవాబిచ్చింది. 'తనకు తినడానికి లేకపోయినా, ఉన్న ఒక్క ఉసిరికాయనూ నాకు ఇచ్చేసింది. దాంతో ఆమె కర్మ పూర్తిగా తొలగిపోలేదా! పుణ్యం లభించలేదా?'' అని ప్రశ్నించారు శంకరులు.

ఆ తర్కానికి సంతసించిన శ్రీమహాలక్ష్మి పేదరాలి ఇంట బంగారు ఉసిరి కాయల వర్షం కురిపించిందని ఐతిహ్యం. శంకరులు ఆశువుగా వల్లించిన శ్లోకాలే 'కనకధారాస్తవం'గా (స్తోత్రం) పేరుపొందాయి. బంగారు ఉసిరి కాయల వాన కురిసిన ఆ ఇల్లు పళం తోట్టంలో ఉంది. దాన్నిప్పుడు 'బంగారు ఇల్లు' అని పిలుస్తారు. ఆ పేదరాలి వంశంవారు అక్కడే నివసిస్తున్నారు. కాకపోతే, ఆదిశంకరులు అనుగ్రహించినప్పటి భవనం కాలక్రమంలో శిథిలమైపోయింది. రెండు వందల యాభై సంవత్సరాల క్రితం దాన్ని పునర్నిర్మించారు. ఇంట్లోవారి దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా.... వరండాలోని శంకరాచార్యుల చిత్ర పటం వద్ద ధ్యానం చేసుకుంటారు సందర్శకులు. పక్కనే ఉన్న భువనేశ్వరీ దేవి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.

ప్రత్యేక ట్రస్టు...

'పళం తోట్టం' ప్రాధాన్యాన్నీ, ఆ ఇంటి ప్రశస్తిని అర్థం చేసుకున్న ఆధ్యాత్మిక సాధకులు 'శ్రీ ఆదిశంకర కనకధారా స్మృతి ట్రస్టు'ను ఏర్పాటు చేశారు. ట్రస్టు ఆధ్వర్యంలో మహాలక్ష్మి, శంకరుల ఆలయాలు, యోగా కేంద్రం, ధ్యాన కేంద్రం, వృద్ధాశ్రమం, ఉచిత భోజనశాల, నక్షత్రవనం నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి ప్రధాన ద్వారం, ప్రార్థన మందిరం, భజన మండపం, ధ్యానకేంద్రం, ట్రస్టు కార్యాలయం పూర్తి అయ్యాయి. పళం తోట్టం చేరుకోవడం కాస్తంత కష్టమైన పనే. ఆలువా, కాలడి, కొచ్చిన్‌ (ఎర్నాకుళం), కొట్టాయంల నుంచి వెళ్లవచ్చు. వీటిలో ఆలువా మార్గమమే ఉత్తమం. ఆలువాకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పళంతోట్టం. ఆలువా నుంచి కొలన ఛేరి వెళ్లే బస్సులు ఇక్కడ ఆగుతాయి. ప్రధాన కూడలి నుంచీ 'స్వర్ణత్తమన' వెళ్లాలంటే, రెండు కిలోమీటర్లు నడవాల్సిందే. వాహనాలు ఉండవు. ఒకటి మాత్రం నిజం. అక్కడికి చేరుకోగానే... యాత్రికులు అప్పటిదాకా పడ్డ శ్రమంతా మరచిపోతారు.

'వందే వందారు మందారం

ఇందిరానంద కందలమ్‌

అమందానంద సందోహ

బంధురం సింధురాననమ్‌...'

అని తన్మయంగా కనకధారాస్తోత్రం చదువుకుంటారు. లక్ష్మీ కటాక్షంతో... బంగారు ఉసిరికాయల వాన కురుస్తున్న దృశ్యం మనోఫలకం ముందు ఆవిష్కృతం అవుతుంది.

Also Read : చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు 

కనకధారా స్తోత్రం

అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తీ

బృంగాంగనేవ ముఖళాభరణం తమాలమ్!

అంగీకృతాఖిల విభూతి రసంగలీలా

మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః !!

ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్ర పాప్రిణి హితాని గతా గతాని !

మాలాదృశోర్మధు కరీవ మహోత్ప లేయా

సామే శ్రియం దిశతు సాగర సంభావా యాః !!

విశ్వా మరేంద్ర పదవి భ్రమ దానదక్ష

మానంద హేతు రదికం మురవిద్విషోపి.

ఈషన్నీషీదతుమయి క్షణ మీక్షణార్థ మిందీవరోదర సహోదర మిందియా యాః !!

అమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుంద మానంద కంద మనిషేష మనంగ తంత్రం!

అకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవన్మమ భుజంగ శయాంగనాయాః !!

బాహ్వంతరే మధుజితశ్శ్రిత కౌస్తు భేయా హారావళీవ మరి నిలమయీ విభాతి !

కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణ మావహతుమే కమలాల యామాః !!

కాలాంబు దాళి లలితో రసి కైటభారేః ర్దారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !

మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః !!

ప్రాప్తం పదం ప్రథమతఃఖలు యత్ప్రభావాత్ మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన!!

మయ్యపతే త్తదిహ మంథర మీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః !

దద్యాద్దయాను పవనోద్రవిణాంబు ధారా మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే !!

దుష్మర్మ ఘర్మమపనీయ చిర్టయదూరం నారాయణ ప్రణయనీ నయనాంబువహః !

ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టప పదం సులభం లభంతే !

దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః !!

గీర్ధవ తేతి గరుడద్వజ సుందరీతి శాకంభరీతి శశశేఖర వల్లభేతి !

సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై !!

శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రశూత్యే రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై !

శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !!

నమోస్తు నాళిక నిభాననాయై నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్యై !

నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై !!

సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి !

త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే !!

యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలర్థ సంపదః !

సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే !!

సరసిజనిలయే ! సరొజహస్తే ! దవళత మాంశుక గందమాల్య శోభే !

భగవతి ! హరివల్లభే ! మనోజ్ఞే ! త్రిభువన భూతకరీ ! ప్రసీద మహ్యం !!

దిగ్ఘస్తభిః కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగిం !

ప్రాత ర్న మామి జగతాం జననీ మశేష లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రిం !!

కమలే ! కమలాక్ష వల్లభే !త్వం కరుణాపూర తరంగితై రపాంగైః !

అవలోకయ మా మకించనానం ప్రథమం పాత్ర మకృతిమం దయాయాః !!

స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం త్రయీ మయీం త్రిభువనమాత్రం రమాం !

Famous Posts:

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?


మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.


భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు


ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి

kanakadhara stotram in telugu, kanakadhara stotram pdf, kanakadhara stotram miracles, kanakadhara stotram benefits, kanakadhara mahalakshmi temple, how many times to recite, kanakadhara stotram, kanakadhara stotram experience, kanakadhara stotram birthplace, కనకధారా స్తోత్రం, ఉసిరి కాయలు, 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.