Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఈ మంత్రం ఎందుకు జపించాలి...| Om Namo Bhagavate Vasudevaya Benefits - Lord Vishnu - Hindu God

 

ఈ మంత్రం ఎందుకు జపించాలి...

ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన (భవిష్యపురాణం)ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు. అతను ఈ "ఓంనమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆతరంగాలు కలిపురుషుడిని తాకాయి. 

ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరం లో పడ్డాడు.

కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి ఒస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను.

ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా, కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా, అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా...? విష్ణువా...? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు. వ్యాసుడు నవ్వి ఇది నీరాజ్యం ఈ కలికాలం నీది, నీకు సందేహమా... ఏ ఇద్దరిని కూడా సక్రమంగా కలిసి ఉండనివ్వవు కదా. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది కలిపురుషా..? ఇంతకి నువ్వు కుశలమే కదా! అన్నాడు వేదవ్యాసుడు

కుశలమే! నారాజ్యంలో నేను కాకా నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు, ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు.

త్రికరణ శుద్దిగా నిత్యం '' ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.

          ఓం నమో భగవతే వాసుదేవాయ

Famous Posts:

గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు

ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు 


తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు


ఎవరితో పెళ్లి జరగాలో ఈ స్వామి వారు నిర్ణయిస్తాడు 


మీరు పడుకునే విధానం బట్టి మీ గత జన్మ ఎలాంటిదో తెలుసుకోవచ్చు?


విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం


పాపాలను, శాపాలను పోగొట్టి, కష్టాలను తీర్చి, ఆయుష్షును పెంచే ఆదిత్య హృదయం

Om Namo Bhagavate Vasudevaya, om namo bhagavate vasudevaya benefits, sri maha vishnu mantra, sri maha vishnu images, sri maha vishnu images hd, sri maha vishnu avatars, sri maha vishnu avatars in telugu, ఓం నమో భగవతే వాసుదేవాయ, Lord Vishnu, Hindu God

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు