చెమటలు పట్టే విగ్రహం...| Nachiyar Koil - Kal Garudan - Interesting Facts - Nachiyar Kovil - Temples of Tamilnadu

చెమటలుపట్టేవిగ్రహం...

శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు. 

108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. 

ఆ వివరాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం..

తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో వున్న తిరునాయూర్ అనే క్షేత్రంలో ఉత్సవమూర్తిగా వున్న గరుత్మంతుని విగ్రహం ఊరేగింపుసమయంలో వివిధ రకాల బరువులతో ఉండటం జరుతుంది. 

ఈ క్షేత్రానికి నాచ్చియార్ కోవెల్ అనే పేరుగూడా వున్నది.ఈ క్షేత్రంలో వెలసిన మహావిష్ణువుకి సంవత్సరానికి 2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపుగా వెళుతూ వుండగా స్వామివారు గరుడవాహనంమీద అమ్మవారి వెనక వెళుతూవుంటారు.

స్వామి వారు ఈ సమయంలో  ఒక చిక్కుపరిస్థితిలో పడతారు,అదేమిటంటే గరుడవాహనం యొక్క వేగం హంసవాహనం కన్నా అధికం తానెక్కిన గరుడ వాహనం వెళితే అమ్మవారు వెనక బడిపోతుంది.అది గ్రహించిన గరుత్మంతుడు స్వామితో ఇలా అంటాడు, నేను అమ్మవారు ఎక్కిన హంస వాహనంకన్నా 

ముందుకి వెళ్లను,తగిన వేగంతో వెళ్తూ హంసవాహనం వెనకాలే వెళతాను.

ఈ ఊరేగింపు లో ఒక విచిత్రం జరుగుతుంది. అదేంటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడవాహనం ఎక్కినప్పుడు అది తేలికగావుండి కేవలం నలుగురు మనుషులు మోస్తే కదులుతుంది.

అలా ముందుకు వచ్చిన గరుడవాహనం ఆ తరువాత ఉన్న 5ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు జామితీయ పద్ధతిలో పెరుగుతుంది. 2 వ ప్రాకారాన్ని దాటుతున్న గరుడవాహనాన్ని 8మంది మోయాల్సుంటుంది.3వ ప్రకారం దాటేటప్పుడు 16మంది మోయాల్సుంటుంది.4వ ప్రకారాన్ని దాటేటప్పుడు 32మంది మోయాల్సుంటుంది.

5 వ ప్రాకారాన్ని దాటే ముందు 64 మంది మోయాల్సుంటుంది. 5ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడవాహనం బరువు విపరీతంగా పెరిగిపోయు 120మంది మోయాల్సొస్తుంది. 

ప్రధానవీధుల్లోకొచ్చే సరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందు వెళుతూ వుండగా దాని వెనకాల 128మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూ వుంటుంది.

ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ వూరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతుని ఉత్సవ విగ్రహంపైన చెమటలు కనిపిస్తాయి.

గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువు వుండి క్రమంగా పెంచుకుంటూ పోయేసరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు.

అన్నట్టు తమిళనాడులో వున్న ఈ క్షేత్రంలోని ఈ గరుత్మంతుని కాలగారుడన్ అని పిలుస్తారు.ఈ అద్భుతఊరేగింపు దృశ్యం సంవత్సరానికి 

2సార్లు జరుగుతుంది. మహాశక్తి వంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని తన ఆభరణాలుగా ఏవిధంగా ధరిస్తాడో తెలుసుకుందాం.

ఆదిశేషుడు – తన కంకణంగా

కర్కోటకుడు – తాను ధరించే పూలదండగా

పద్మనాభుడు – తన కుడిచెవి ఆభరణంగా

మహా పద్ముడు – ఎడమచేతి ఆభరణంగా

శంఖపాలుడు – తన కిరీటం ఆభరణంగా

గుళికుడు – కుడి చేయి గాజులాగా

తక్షకుడు – వడ్డాణంగా

వాసుకి – జంధ్యంగా

ఇక 9వ సర్పం..ఆయన యొక్క కంఠానికి అలంకరణగా చుట్టుకుని వుంటుంది.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

Nachiyar Koil, nachiyar koil temple history in telugu, nachiyar koil temple contact number, nachiyar koil famous, tamil nadu temples, famous temples tamil nadu, నాచ్చియార్ కోవెల్

Comments